ఢిల్లీలో ఆధర్ ఉండి, ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన జీవీఎల్ నరసింహారావు, అమిత్ షా ఆదేశాల మేరకు, వారినికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ పై ఎదో ఒక విమర్శ చేస్తూ ఉంటాడు. వారం అంతా ఎక్కడ ఉంటాడో తెలీదు కాని, ఎదో ఒక రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ గురించి ఎదేదో మాట్లాడతాడు. ఈయన అలా మాట్లాడతాడో లేదో, ఆంధ్రప్రదేశ్ ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావు లైన్ లోకి వచ్చి, ఫుల్ కోటింగ్ ఇచ్చి వదిలిపెడతారు. ఇంకా అంతే, మళ్ళీ ఆ టాపిక్ గురించి జీవీఎల్ మాట్లాడడు. మళ్ళీ కొత్త టాపిక్ పట్టుకుని, అర కోటు ఒకటి వేసుకుని వస్తాడు. వచ్చి, ఏదన్నా రాష్ట్రానికి ఉపయోగపడే పని చేస్తాడా అంటే, అలాంటిది ఏమి ఉండదు. అమరావతి యుసిల దగ్గర నుంచి, అన్నీ ఇలాంటి గాల్లో ఆరోపణలు చేసి, కుటుంబరావు చేత కోటింగ్ తిని ఢిల్లీ వెళ్తాడు. ఈ కోవలోనే నిన్న మరో కొత్త ఆరోపణతో వచ్చాడు జీవీఎల్.

gvl 05082018

కామన్వెల్త్, 2జీ స్కాంల కంటే పెద్దది ఏపీలో జరిగిన పీడీ కుంభకోణమన్నారు. రూ.53వేల కోట్లను పర్సనల్ అకౌంట్స్‌లో వేశారని.. అవి దారిమళ్లాయని ఆరోపించారు. దేశంలోనే ఇదో పెద్ద స్కాం అంటూ, జీవీఎల్ హడావిడి చేస్తున్నాడు. మరి కేంద్రంలో అధికారం నీదే కదయ్యా, మీ మోడీకి, అమిత్ షా కి చెప్పి, ఇది ప్రూవ్ చేయ్యచ్చుగా అంటే, మళ్ళీ అడ్రెస్స్ ఉండడు. అయితే, ఆదివారం అని కూడా చూడకుండా, పాపం జీవీఎల్ ని ర్యగింగ్ చేసి పెట్టారు కుటుంబరావు. పీడీ అకౌంట్లంటే అర్థం తెలియని జీవీఎల్.. మిడి, మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు కుటుంబరావు. పీడీ అకౌంట్లలో రూ.20వేల కోట్లు మురిగిపోతున్నాయని మాట్లాడం సరికాదన్నారు. రాజ్యసభ సభ్యుడైన ఆయనకు ట్రెజరీలో నిధులు నిలువ ఉండవనే విషయం తెలియకపోవడం దారుణమన్నారు.

gvl 05082018

యూపీ నుంచి ఎంపీగా ఎన్నికైన జీవీఎల్, ఆంధ్రప్రదేశ్ లో కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. జీవీఎల్‌కు దమ్ముంటే ఏపీలో కనీసం వార్డు మెంబర్‌గా అయినా గెలవాలని కుటుంబరావు సవాల్ చేశారు. ఇక యూసీల విషయానికొస్తే.. కేంద్రంలో చాలా శాఖలు యూసీలు ఇవ్వలేదని కాగ్ చెప్పిందని.. దీనిపై జీవీఎల్ విరణ ఇవ్వగలరా అని ప్రశ్నించారు కుటుంబ రావు. ఆరోపణలు చేయడం కాదని దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్నారు. మొత్తానికి జీవీఎల్, ప్రతి వారం, కుటుంబరావు చేతిలో పడే కోటా, ఈ వారం కూడా తీసుకుని, ఢిల్లీ బయలుదేరారు. పాపం జీవీఎల్ ను చూస్తుంటే, అదేదో సినిమాలో బ్రాహ్మీ సీన్ గుర్తుకువస్తుంది.

బ్యాడ్మింటన్‌ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లో రజతం కైవశం చేసుకున్న సింధును అభినందించారు సీఎం చంద్రబాబు. ఫైనల్లో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ లో ఓడినా అద్భుత ప్రతిభ చూపిందని సింధును ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచి సింధు భారత షట్లర్ల ఘనతను చాటిందని ప్రశంసించారు. భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణే కాదు ప్రపంచశ్రేణి క్రీడాకారిణిగా సింధు రాణించడం గర్వకారణమని అన్నారు.ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లో అద్భుత ఫామ్‌ ప్రదర్శించి తెలుగు జాతికి మణిమకుఠంగా సింధు నిలిచిందని కీర్తించిన సీఎం చంద్రబాబు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నాలుగు పతకాలు గెలిచి బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లో సింధు సువర్ణాధ్యాయం సృష్టించిందని అన్నారు.

sindhu 085082018 2

వరుసగా రెండుసార్లు ఫైనల్‌ చేరుకొని సింధు చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నఅయన ఫైనల్ లో కరోలినా మారిన్‌( స్పెయిన్‌), సెమీస్‌లో యమగూచి(జపాన్‌)వంటి ప్రపంచ దిగ్గజ షట్లర్‌ లను వరుసగా జరిగిన మెగా టోర్నీల్లో ఆడి సింధు అసమాన్య ప్రతిభ చూపిందన్న సీఎం చంద్రబాబు. ఇదే విషయం పై చంద్రబాబు ట్వీట్కూడా చేసారు "Congratulating athlete @Pvsindhu1 for winning silver medal after an incredible badminton face off at World Badminton Championships 2018. Millions of citizens drew inspiration from her as she made India proud yet again on an international platform. "

sindhu 085082018 3

ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌ చేతిలో 21-19, 21-10 తేడాతో సింధు ఓడిపోయింది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రెండోసారి కూడా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి సింధుపై మారిన్‌ విజయం సాధించినట్లైంది. 2014, 2015ల్లో స్వర్ణం గెలిచిన మారిన్‌, తాజా విజయంతో మూడోసారి కూడా పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

కొండలతో నిండిన బెజవాడ నగరంలో మరో సొరంగ మార్గం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ చిన్న నగరంలో ఎటు నుంచి ఎటు ప్రయాణించాలన్నా కొండల చుట్టూ తిరిగివెళ్లాల్సిందే. అత్యంత తక్కువ దూరం ఉన్న గుణదల - బెంజ్‌సర్కిల్‌ మధ్య ప్రయాణానికి సైతం పెరిగిన ట్రాఫిక్‌ కారణంగా గంటకు పైగా సమయం వెచ్చించాల్సివస్తోంది. రామవరప్పాడు నుంచి బస్టాండుకు వెళ్లాలన్నా అంతే. పాతబస్తీలో మాదిరి కొండల మధ్య మరో సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తే మరి కొన్ని ప్రాంతాల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించవచ్చునని భావించిన వీఎంసీ ఆ దిశగా ప్రణాళికలను రచిస్తోంది. రూ.200 కోట్ల అంచనాలతో వీఎంసీ ఆహ్వానించిన ఆర్‌ఎఫ్‌పీలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అంచనాలకు మించిన స్పందన వస్తోంది.

sorangam 05082018 2

60వ దశకంలో కేఎల్‌ రావు జలవనరుల శాఖ మంత్రి(ఇండిపెండెంట్లీ ఇన్‌చార్జి)గా ఉన్న సమయంలో ఏర్పాటుచేసిన సొరంగ మార్గం నేటికీ లక్షలాదిమంది ప్రయాణికులకు ఉపయోగపడుతోంది. అదే తరహాలో నగరంలో కొండల మధ్య నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర సొరంగాన్ని ఏర్పాటుచేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీని కోసం జూన్‌ 6న ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానిస్తున్నట్టు వీఎంసీ ప్రకటించగా.. ఢిల్లీ నుంచి రెండు అంతర్జాతీయ సంస్థలు, కోల్‌కతా వంటి నగరాలతో పాటు స్వీడన్‌ వంటి ఇతర దేశాల నుంచి పలు అంతర్జాతీయ సంస్థలు డీపీఆర్‌లు సిద్ధం చేయడానికి పోటీ పడుతున్నాయి.

sorangam 05082018 3

ప్రస్తుత అంచనాల ప్రకారం గుణదల, క్రీస్తురాజపురం, మొగల్రాజపురం, లయోలా కళాశాల, 65వ నెంబరు జాతీయ రహదారి మీదుగా ప్రయాణించే వాహనాలు, పాదచారుల కోసం గుణదల కొండ కిందగా జాతీయ రహదారి వైపునకు గానీ మొగల్రాజపురం వైపునకు గానీ ఏర్పాటుచేయాలని వీఎంసీ భావిస్తోంది. లేకపోతే విద్యాధరపురం కొండకు ప్రస్తుత సొరంగ మార్గం కాకుండా మరో మార్గానికి సన్నాహాలు చేసే అవకాశముంది. విజయవాడలో నిర్మితమై ఉన్న 1264 కిలోమీటర్ల రోడ్లపై నిత్యం 250కి పైగా ప్రైవేటు బస్సులు (పర్మిట్‌ ఉన్నవి) హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్టణం వంటి ఇతర ప్రాంతాలకు నడుస్తుంటాయి. వాటితోపాటు 8లక్షల ద్విచక్ర వాహనాలు, 36వేల ఆటోలు, 50వేలకు పైగా కార్లు, 30వేలకు పైగా లారీలు నగరంలో ప్రయాణిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు లెక్కేలేదు.

ఏడాదిన్నర పసి బాలుడుకు అరుదైన చర్మ వ్యాధి సోకింది... రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవికి కుమారుడుగా జన్మించడం ఆ బిడ్డడి తప్పయింది... తన పాలనలో ఎవరికి ఏ కష్టమొచ్చినా తెలిసినంతనే ఆదుకునే మానవత్వం ఉన్న మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం ఆ బిడ్డడికి అదృష్టమైంది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం బండారుపల్లికి చెందిన అరుణ, ఏకాంబరం దంపతుల ఏడాదిన్నర కుమారుడికి వ్యాధి సోకి చర్మంపై మచ్చలు ఏర్పడ్డాయి. వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఏకాంబరానికి దిక్కుతోచలేదు. రైతుకు తన కుమారుడికి చికిత్స చేయించడం కష్టమయింది. .తనకున్న శక్తి మేరకు స్థానికంగా చికిత్స చేసినా కుమారుడి చర్మవ్యాధి తగ్గలేదు...మరింత మెరుగైన ఆధునిక విదేశీ వైద్యం చేస్తేగానీ తగ్గదన్నారు డాక్టర్లు...ఖర్చు కూడా పెద్దమొత్తం అవుతుందనడంతో ఆ తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు...

cbn 05082018 2

దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కన్నట్లు... ప్రత్యక్ష దైవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్మురణకు వచ్చాడు...గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించుకుంటే మానవతా దృక్పథంతో ఆదుకున్న సంఘటనలు గుర్తు చేసుకున్నారు ఆ తల్లిదండ్రులు...దూరాభారమైనా కుప్పం నుంచి బిడ్డని చంకన వేసుకుని ఆ తల్లిదండ్రులు ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కొడుకుకు వచ్చిన కష్టాన్ని చెప్పుకున్నారు...తక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పసిబిడ్డడి వైద్య చికిత్సకు రూ. లక్ష మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆదుకునే హస్తం ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలబడే నేస్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారని బిడ్డను తీసుకుని అరుణ, ఏకాంబరం దంపతులు సంతోషంతో ఇంటి ముఖం పట్టారు.

Advertisements

Latest Articles

Most Read