ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, అలాగే విభజన హామీల గురించి కూడా చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం ఎంపీలు రాజ్యసభలో ఆందోళన చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి మరీ నిరసనలు తెలపడం, నినాదాలు చేయడంతో మధ్యాహ్నానికి ముందే సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే, ఏపీ విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసిన సంఘటన మరోసారి గుర్తు చేసారు వెంకయ్య. సోమవారం రాజ్యసభలోనూ అరగంట పాటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించి సభా కార్యక్రమాలను కొనసాగించారు. టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ వెంకయ్యనాయుడు సుమారు 30 నిముషములపాటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించారు.

parliament 23072018 2

ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీ సభ్యులు పదే పదే పట్టుపట్టారు. ఈ అంశంపై, ఇప్పటికే బీఏసీ సమావేశంలో చర్చించినట్లు వెంకయ్య వెల్లడించారు. ఆ తర్వాత వరికి కనీస మద్దతుధరపై అన్నాడీఎంకే సభ్యుడు విజిల సత్యనాథ్, ప్రభుత్వ నిఘా సంస్థలను ప్రభుత్వం రాజకీయ ప్రతీకారాలకు వాడుకుంటోందన్న అంశంపై కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఇచ్చిన ఇచ్చిన నోటీసులను జీరో అవర్‌లో చర్చకు చేపట్టారు. ఆయన ఆ విషయం చెప్పగానే టీడీపీ సభ్యులు పలువురు వెల్‌లోకి దూసుకె ళ్లారు. ఈ అంశాలపై పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని వారు డిమాండు చేయగా, వెంకయ్యనాయుడు మాత్రం రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకు అనుమతించారు.

parliament 23072018 3

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల పై ఇవాళ రాజ్యసభలో జరగాల్సిన స్వల్పకాలిక చర్చ రేపటికి వాయిదా వేసారు. విభజన చట్టం అమలు చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎంపీలు.. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను పెద్దల సభలో ప్రస్తావించడానికి సిద్ధపడ్డారు. అయితే స్వల్పకాలిక చర్చను రేపు చేపడతామని వెంకయ్య అన్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరిలు చర్చ ఇవాలే చేపట్టాలని డిమాండ్ చేశారు. కానీ సభ్యుల అభ్యర్థనమేరకే చర్చను రేపటికి వాయిదా వేసినట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ, ఒక్కో స్లీపర్ సెల్ బయటకు వస్తుంది.. ఎన్నికల వేళ మాత్రమే బయటకు వచ్చి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ లో ప్రముఖుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పురంధేశ్వరి గారి భర్త. కరుడుగట్టిన చంద్రబాబు వ్యతిరేకి అయిన , దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటం, చంద్రబాబు రోజు రోజుకీ బలపడుతూ ఉండటంతో, నిద్రావస్థలో ఉన్న ఈయన కూడా బయటకు వచ్చారు. ఇప్పటికే ముద్రగడ, మోత్కుపల్లి, లక్ష్మీనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు, పవన్, జగన్, అందరూ కలిసి, చంద్రబాబు పై ఎలా ఎగబడుతున్నారో చూస్తున్నాం. వీరికి తోడుగా, ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా రంగంలోకి దిగారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ గరుడ బ్యాచ్ మాట్లాడిన మాటలే మాట్లాడారు.

daggubati 23072018 2

వైఎస్‌ జగన్‌ ఉచ్చులో సీఎం చంద్రబాబు పడ్డారని అన్నారు. చంద్రబాబు ఎన్నికల కోసం యూటర్న్‌ తీసుకున్నాయని తెలిపారు. అవిశ్వాసం పెట్టడం కేవలం పత్రికల్లో హెడ్‌లైన్స్‌ రాసుకోవడానికే పనికొచ్చిందని వ్యాఖ్యానించారు. కేవలం బీజేపీని వ్యతిరేకించాలనే ఓట్ల రాజకీయం మాత్రమే సాగుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆవేదనతో ప్రజలకు ఏదైనా చెప్పాలని బయటకు వచ్చానన్నారు. ఏడు ముంపు మండలాలను కేంద్రం ఏపీలో కలిపినా వివక్ష చూపిస్తోందంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దుగరాజపట్నం పోర్టు, స్టీల్‌ ప్లాంట్‌పై అన్ని నివేదికలు సమర్పించి.. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అడిగి సాధించుకోవాలని సూచించారు.

daggubati 23072018 3

హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం సరికాదన్నారు. హోదా ఇవ్వకపోయినా మంచి ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని, ఎస్పీవీ ఏర్పాటుచేసుకుంటే రాయితీలు, ప్రోత్సాహకాలు త్వరగా వచ్చే వీలుంటుందని తెలిపారు. అయినా రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నాక హోదాపై మోజెందుకని ఎద్దేవాచేశారు. పరిపాలన అంటే ప్రెస్‌మీట్‌లు పెట్టడం, దీక్షలు చేయడం కాదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హామీలు నెరవేర్చనని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. మొత్తానికి, టార్గెట్ చంద్రబాబుగా, వారినికి ఒక ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టనున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.

అవిశ్వాసం పెట్టిన దగ్గర నుంచి, ఒకటి తరువాత ఒకటి, ఎదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి తరువాత ఒకరు, వచ్చి డైవర్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న హడావిడి చూస్తూనే ఉన్నాం. కాల్చండి, చంపండి, 144 సెక్షన్ పెట్టండి అని, ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి, ప్రజలను రెచ్చగొట్టి, అవిశ్వాసం తదనంతర పరిణామాలు డైవర్ట్ చెయ్యటంలో, మోడీని కాపాడటంలో బిజీగా ఉన్నారు. గల్లా, రామ్మోహన్ నాయుడుల స్పీచ్ గురించి, దేశమంతా మెచ్చుకుంటే, మనోడు మాత్రం వీక్ గా ఉంది అంటూ తీసి పడేసాడు. ఇప్పుడు, మరో వ్యక్తి కూడా తయారయ్యాడు. నేను రైతు సమస్యల పై అధ్యయనం చేస్తున్నా అని చెప్తూ, రైతు నేత అనో ఏమో కాని, ఈ రోజు ముద్రగడను కలిసారు. ఈ భేటీ పై విమర్శలు వినిపిస్తున్నాయి.

jd 23072018 2

జేడీ లక్ష్మీనారాయణ. రాష్ట్ర రాజకీయాల్లో పోషించబోయే పాత్ర గురించి కొంత ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు కిర్లంపూడి వెళ్లి మరీ మర్యాద పూర్వకంగా ముద్రగడను కలిశారు. మారుమూల గ్రామం పనిగట్టుకొని వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసేటంత ఉన్నత విలువలు ముద్రగడ లో ఏ మాత్రం ఉన్నాయో అందరికీ తెలుసు. ట్రైన్ లు తగలబెట్టే చరిత్ర ఉన్న ముద్రగడను, ఒక సమర్ధవంతమైన ఆఫీసర్ గా పేరు ఉన్న ఆయన కలవటం ఏంటో అర్ధం కాలేదు.  దీంతో వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈయన జెండా ఏదైనా ఎజెండా మాత్రం చంద్రబాబు ఓటమి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో పాత్ర రంగప్రవేశం. అహర్నిశలు రాష్ట్రం కోసం పనిచేసే ఒక ముఖ్యమంత్రి ని ఓడించటానికి ఇంతమంది ఏకమవ్వటం చూస్తుంటే, ఎలాంటి రాజకీయం చేస్తున్నారో అర్ధమవుతుంది. ముద్రగడతో , మోత్కుపల్లి భేటీ అవ్వటం.. ముద్రగడతో ఐవైఆర్ భేటీ అవ్వటం.. ముద్రగడతో విజయసాయి భేటీ అవ్వటం.. ముద్రగడతో, లక్ష్మీనారాయణ భేటీ అవ్వటం... ఏంటో ఇవన్నీ...

మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి, వారంలో 6 రోజులు ఒకెత్తు, శుక్రవారం ఒకెత్తు... ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, శుక్రవారం మాత్రం జగన్, నాంపల్లి కోర్ట్ కు రావాల్సిందే... ఎన్ని పనుల్లో ఉన్నా రావాల్సిందే... పోయిన శుక్రవారం చూసాం, రాష్ట్రంలో 5 కోట్ల మంది, అవిశ్వాస తీర్మానం చూస్తూ, మన రాష్ట్ర సమస్యల పై, మోడీ ఏమన్నా స్పందిస్తారేమో అని, టీవీలు చూస్తూ కూర్చుంటే, మనోడు నాంపల్లి కోర్ట్ లో ఉన్నాడు. చివరకు ఒక ట్వీట్ పెట్టి, రేపు ఉదయం 8:30 కి స్పందిస్తా అని చెప్పారు అంటే, శుక్రవారానికి, జగన్ కు ఉన్న సంబంధం అది. మరి, అసలు ప్రతి శుక్రవారం జగన్ కోర్ట్ లో ఏమి చేస్తాడు ? జడ్జి ఏమి ప్రశ్నలు వేస్తారు ? జగన్ చేసిన లూటీ గురించి ఎలా సమర్ధించుకుంటాడు ? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలని ఉంటుంది. కాని, లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవటం కష్టం. అయితే ఇప్పుడు కేంద్రం, సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయంతో, అన్ని కేసుల విచారణ లైవ్ చూడవచ్చు.

jagan 23072018 2

కోర్టుల్లో జరిగే వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేయాలనే ప్రతిపాదనకు కేంద్రం మద్దతు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రక్రియ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు నుంచే ప్రారంభం కావాలని పేర్కొంది. ప్రత్యక్ష ప్రసారం ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని.. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. ‘పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలి. అది కూడా సీజేఐ కోర్టు నుంచే ప్రారంభించాలి’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ వెల్లడించారు.

jagan 23072018 3

‘రాజ్యాంగ ధర్మాసనాలకు సంబంధించిన వ్యవహారాలు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు, ఇతరులకు ఆసక్తికరంగా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా‌ ప్రత్యక్ష ప్రసారం చేయండి. కోర్టు ప్రాంగణాల్లో తెరలు ఏర్పాటు చేసి వీటిని ప్రదర్శించాలి. కోర్టుతో సంబంధం లేకుండా చూసే వీలును కల్పించాలి’ అని ఏజీ వెల్లడించారు. అయితే ఈ వీడియో క్లిప్‌లు దుర్వినియోగం కాకుండా చూడాలని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ న్యాయస్థానాన్ని కోరారు. సోషల్‌ మీడియాకు ఈ వీడియోలు చేరితే వీటిని నియంత్రించడం కష్టసాధ్యమని న్యాయవాది విరాగ్‌ గుప్తా అన్నారు. ఇవన్నీ క్రోడీకరించి, ఒక నిర్ణయానికి రానున్నారు. అప్పుడు జగన్ తో పాటు, అందరి విచారణ లైవ్ లో చూడవచ్చు...

Advertisements

Latest Articles

Most Read