ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చాటుతూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు సౌగత్‌ రాయ్‌, దినేశ్‌ త్రివేది, సీపీఎం నేత మహ్మద్‌ సలీంతో పాటు పలు పార్టీల నేతలు బరిపరిచారు. టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్‌ ప్రసంగం విన్నాక రాష్ట్ర ప్రజల సమస్యలపై ఆయన ప్రగాఢ ఆవేదన తనకు తెలిసిందని.. అన్యా యం జరిగిన వారిలో ఆయనొక్కరే లేరని, ఈ దేశంలో ఆయనలాంటి బాధితులెందరో ఉన్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో అన్నారు.

parliament 21072018 2


‘21వ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఏపీ బలైంది. మాయమాటలు చెప్పి మోసగించడమే ఈ ఆయుధం. మనకు ఎలాంటి ప్రధానమంత్రి ఉన్నారో దీన్ని బట్టి అర్థమైంది. గల్లా ప్రసంగంలో ప్రతి ఒక్క పదాన్ని శ్రద్ధగా విన్నాను’ అని చెప్పారు. బీజేపీ, మోదీ ‘విభజించు-పాలించు’ సిద్ధాంతాన్ని పాటిస్తున్నందునే ఏపీకి అన్యాయం జరిగిందని ఖర్గే అన్నా రు. ఆంధ్రకు కేంద్రం అన్యాయం చేసిందన్న విషయంలో తాము ఏకీభవిస్తున్నామని, తమ నేత మమతా బెనర్జీ టీడీపీకి పూర్తి మద్దతు ఇస్తున్నారని టీఎంసీ ఎంపీ దినేశ్‌ త్రివేది చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు అకాలీదళ్‌ మద్దతిస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత చందుమజ్రా స్పష్టం చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించి విప్‌ కూడా జారీచేసింది. సభలో ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడారు.

 

parliament 21072018 3

మరో పక్క, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడులకు టీడీపీ నేతల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. రాష్ట్ర సమస్యలను పార్లమెంటు వేదికగా ప్రశంసనీయంగా వినిపించారని, తమకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరుపాళ్లూ నెరవేర్చారని వ్యాఖ్యానిస్తున్నారు. ‘అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవచ్చు. కానీ జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం వినిపించగలిగాం. కేంద్రాన్ని ఆత్మరక్షణలో పడేశాం’ అని ఒక మంత్రి మెచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో నేతలు ఆ ఇద్దరు ఎంపీల ఫోన్లకు అభినందన సందేశాలు పంపారు. నేరుగా ఫోన్‌ చేసి ప్రశంసించారు.

పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగంపై అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. నిండు సభలో మోదీ చేసిన మోసాన్ని కడిగిపారేసిన గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. కానీ ఇది పవన్ దృష్టిలో వ్యర్ధమైన ప్రసంగం అయ్యిందంటే. ఏ స్థాయిలో పవన్ రాజకీయ అవగాహన ఉందో అర్ధం చేసుకోవచ్చు. విమర్శించాల్సిన అంశాలలో విమర్శించవచ్చు, తప్పులేదు, కానీ కేంద్రాన్ని ఒత్తిడి తెస్తున్న సమయంలోనే సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వంపై మరింతగా పవన్ విమర్శలు గుప్పించడం సరైన రాజకీయం అనిపించుకోదు. పవన్ ప్రసంగం పై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ స్పందించారు.

anuradha 21072018 2

పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ "నిన్న పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలందరు.. రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ముక్తకంఠంతో లేవనెత్తారు. ట్వీట్టర్ పవన్ కళ్యాణ్, కన్ ప్యూజన్ పవన్ కళ్యాణ్.. చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేదు. తెలుగు దేశం గురించి హేళనగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంపై, సమస్యలపై అవగాహన లేదు. అవిశ్వాసంపై మద్దతు కూడగడతానన్న పవన్ ఎక్కడ ఉన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలపని పవన్ కళ్యాణ్...ఎంపీలపై కామెంట్ చేయడం సరైంది కాదు. హైదరాబాద్ లో ఇంటిలో కూర్చొని ట్వీట్ లు చేయడం కాదు. అనేక విధాలుగా పార్లమెంట్ లో మేము పోరాటం చేశాం. ఎంపీలు ఎంతో పోరాటం చేస్తుంటే.. ఎం చేశారంటూ ప్రశ్నించడం సరికాదు."

anuradha 21072018 3

"వ్యక్తిగత ప్రయోజనాలు మీకు.. మీ అన్నయ్య, మీ బావమరిది తెలిసినట్లు ఎవరికి తెలియదు. రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి పదవి కోసం మీరు ప్రజారాజ్యం పార్టీని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రి పదవులనే త్యాగం చేశాం. దేశం మొత్తం మీద మోదీని ప్రశ్నించింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. పవన్ కళ్యాణ్ మోడీని ఎందుకు ప్రశ్నించరు..? వ్యర్ధ ప్రసంగాలు చేసేది మీరు ?.. ఉత్తరాంధ్రలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు. టీడీపీ ఎంపీల ప్రసంగాలకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ వస్తుంది. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చిన్న నిరసన కూడా చెయ్యలేదు. ఆదర్శ కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. మీ ట్వీట్టర్ అకౌంట్ ను ఢిల్లీ నుంచి బీజేపీ డీల్ చేస్తుందా ? ట్విట్టర్ లో విమర్శలు కాదు.. ప్రజల్లోకి వచ్చి మోడీని నిలదీయ్యండి. పదవికోసం పార్టీని మూసేసిన చరిత్ర మీది. ఇప్పటి వరకు ఎవరైనా క్రెడిబులిటీ ఉన్న వ్యక్తులు మీ పార్టీలో చేరారా ?" అని అనురాధ పవన్ ను ప్రశ్నించారు.

ప్రధాని మోడీ కాని, మోడీ భక్తులు జగన్, పవన్ కాని, నిన్నటి నుంచి, ప్రత్యేక హోదా పై చంద్రబాబు మాటలు మారుస్తున్నారు, అని విమర్శలు చేసే, అసలు మనకు జరిగిన అన్యాయం పై మాత్రం, ఈ ముగ్గురూ స్పందించటం లేదు. ప్రత్యేక హోదా ఇస్తాను అని ముందు బీజేపీ చెప్పి, తరువాత దానికి సమానమైన ప్యాకేజి అంటే చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్యాకేజి కూడా ఇవ్వకపోతే, మాకు హోదానే కావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు మాట మార్చారో, కేంద్రం మాట మార్చిందో ఈ ముగ్గురూ చెప్పాలి. ఈ ప్రత్యేక హోదా ఒక్కటేనా మనకు రావాల్సింది ? ఇందులో చంద్రబాబు తప్పు ఉంది అంటూ, ఈ ఒక్క విషయం పైనే, మోడీ, జగన్, పవన్ మాట్లాడుతున్నారు. మరి బిల్ లో పెట్టిన 18 అంశాల సంగతి ?

modi 21072018 3

ఇంకా చెప్పాలి అంటే ప్రత్యేక హోదా అనేది, అనాటి ప్రధాని ఇచ్చిన హామీ. కాని బిల్ లో పెట్టిన 18 అంశాలు మనకు హక్కు. ఎవరు మాట మార్చినా, ఇవి మనకు వచ్చి తీరాలి. మరి కేంద్రం, ఇవి ఎందుకు ఇవ్వటం లేదు ? ఈ 18 అంశాల పై మాట్లడకుండా, పవన్, జగన్, కేవలం తమ రాజకీయాల కోసం, ప్రత్యేక హోదా అడ్డు పెట్టుకుని, మోడీని వదిలేసి, చంద్రబాబు పై దాడి చేస్తూ ఉంటే, మిగతా 18 అంశాలు సంగతి ఏంటి ? నిన్న ప్రధాని మోడి కూడా, తన ప్రసంగంలో, చంద్రబాబుని రాజకీయంగా ఇరికించటానికి, ప్రత్యేక హోదా ఒక్కటే మాట్లడారు. మరి మిగతావి ? కెసిఆర్ ఏంటో గొప్పోడు అని పొగిడిన మోడీ, మరి మా రాష్ట్ర విద్యుత్ బకాయలు గురించి ఎందుకు మాట్లడటం లేదు ? పవన్, జగన్, కెసిఆర్ ని, ఇవి ఎందుకు అడగరు ? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణా పై, మా బకాయలు ఇప్పించమని కేసు కూడా వేసింది.

modi 21072018 2

రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాలను కనీసం, ఒక్కసారైనా పవన్, జగన్, అడిగారా ? కేవలం రాజకీయం కోసం, ప్రత్యేక హోదా పట్టుకుని వేలాడుతూ, మోడీని కాపాడటానికి, చంద్రబాబు పై విమర్శలు చేస్తారు...

పురందేశ్వరి పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ఫైర్ అయ్యారు. ఆమెకు పది ప్రశ్నలు సంధించారు. "పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరి పట్ల యావత్‌ దేశమంతటా విమర్శలు ఎక్కుపెడుతుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు పురందేశ్వరి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శంచడం సమంజసం కాదు. తెలుగువారు ఎప్పటికీ గౌరవించే ఎన్టీఆర్‌ కుమార్తెగా.. తెలుగువారికి అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడకపోవటం ఏంటి.? కేంద్ర ప్రభుత్వం అపరిచితుడిలా వ్యవహరిస్తుంటే.. అంతకన్నా ఏమిస్తారని పురందేశ్వరి పేర్కొనటం సరికాదు. రాష్ట్ర ప్రజల నుంచి కేంద్రం వసూలు చేసిన సొమ్ములో 40శాతం ఇస్తూ.. ఏదో దారాదత్తం చేస్తున్నట్లు వ్యాఖ్యానించటం సరికాదు. కేంద్రం ఇతర రాష్ట్రాలతో సమానంగా నిధులు ఇచ్చింది తప్పా ప్రత్యేకంగా ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. పార్లమెంట్‌లోనే కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు రూ. 13వేల కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్పారు. సుప్రీంకోర్టులో అఫడవిట్‌, అవిశ్వాస తీర్మానంలోని ఒకటే చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని విమర్శించకుండా కేవలం రాజకీయ లబ్దికోసం పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు."

puran 21072018 2

"పురందేశ్వరికి పది ప్రశ్నలు... 1. గతంలో విశాఖ నుంచి గెలిచి మంత్రిగా అయి ఉత్తరాంధ్ర చిరకాల వాంఛైనా విశాఖ రైల్వేజోన్‌ను ఎందుకు సాధించలేకపోయారు? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభలో ఉండి ఏం చేశారు?... 2. తెలుగు ప్రజలకు అండగా ఉండాల్సిన వారు కేంద్రానికి వత్తాసు పలకటం వెనుక ఆంతర్యమేంటి.?... 3. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదని, కాఫర్‌ డ్యాం అవసరం లేదని అసంబద్దమైన వ్యాఖ్యలు చేయటం మీకు తగునా.?... 4. రాష్ట్రానికి అడుగుతున్న నిధులు రాష్ట్రం చెల్లించిన పన్నులు కాదా.?... 5 జనసేన ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో మేధావులు, రాజకీయనేతలు రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని పేర్కొన్నారు. దీనిపై ఎందుకు స్పందించరు?"

puran 21072018 3

"6. కేంద్రం యూసీల పేరుతో మోసం చేయాలని చూస్తున్న మాట వాస్తవం కాదా.?... 7. అధికార పార్టీలో ఉంటూ.. సొంత గడ్డకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుండా కేంద్రం తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరించటం మీకు తగునా.?... 9. ఎన్టీఆర్‌ కేంద్రాన్ని మిధ్యగా పేర్కొంటే.. మీరు కేంద్రం మిన్న అనటం ఎంత వరకు సబబు.?.. 9. కేంద్రం చేస్తున్నది మోసం అని మీకు తెలియదా.? తెలిసీ తెలియనట్లున్నారా.?... 10. రూ.350 కోట్లు వెనకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేసి తిరిగి ప్రభుత్వం అనుమతి లేకుండానే వెనక్కు తీసుకున్న కేంద్రాన్ని నిలదీయని మీరు రాష్ట్ర ప్రజల పక్షమా?... లేక మోదీ పక్షమా? : " అంటూ ముళ్లపూడి రేణుక, పురందేశ్వరిని ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read