నిన్న జీవీఎల్ మాట్లాడిన మాటలు, ఈ రోజు కేంద్రం సుప్రీం కోర్ట్ లో వేసిన అఫిడవిట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు. నిన్న జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, డీపీకి చెందిన ప్రతి వెధవ తమను భయపెట్టాలనుకుంటున్నారని, తాము భయపడే ప్రసక్తే లేదని, సోషల్ మీడియా పచ్చ చొక్కాలు జాగ్రత్తా అంటూ, నోటికి ఏది వస్తే అది మాట్లడారు. దీని పై కుటుంబరావు ధీటుగా స్పందించారు. బీజేపీ వాళ్లను వెధవ అంటే ఆ పదాన్ని కూడా అవమానించినట్లే అవుతుందన్నారు. బీజేపీ వాళ్లను వెధవ అని ఆ పదాన్ని తక్కువు చేసే ఉద్దేశం లేదన్నారు. బీజేపీని అందరూ భారతీయ జుమ్లా పార్టీ అంటున్నారని ఎద్దేవా చేశారు. జుమ్లా పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందనే భ్రమ ప్రజల్లో కల్పిస్తున్నారని చెప్పారు. సాగరమాల కింద రూ.1800 కోట్లు ఇచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకోసం రాష్ట్రానికి కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని కుటుంబరావు స్పష్టంచేశారు. కోస్టల్ ఎకనమిక్ జోన్ ఊసేలేదన్నారు. సాగరమాల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3750 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. 592 ప్రాజెక్టుల్లో ఏపీకి 104 ప్రాజెక్టులు కేటాయించామని చెప్పడం అబద్ధమన్నారు. కేంద్రానికి మేం రాసిన ఉత్తరాలు చూపిస్తారు.. మీ ఉత్తరాలు ఎందుకు చూపించరని నిలదీశారు.
ఎన్డీయే నుంచి తెదేపా బయటకు వచ్చాక ప్రధాని ఇంతవరకు నోరు విప్పలదేన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయం తెలుసు కాబట్టే ఆయన నోరు విప్పలేకపోతున్నారని అన్నారు. గృహ నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం హీరోనో తనకు అర్థం కావట్లేదనన్నారు కుటుంబరావు. సినిమా స్క్రిప్ట్ మాదిరిగా డైలాగులు చెబితే సరిపోతుందని ఆయన అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తుల వ్యక్తిత్వాలపై బురద చల్లి.. ఆ బురదను తానే అంటించుకున్నారని విమర్శించారు. విశాఖలో తిరుగుతూ రైల్వేజోన్‌పై ఒక్క మాటైనా పవన్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. అలాగే తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుకు తాను నోటీసులు పంపినట్టు చెప్పారు.