ఇది మన ప్రజాస్వామ్య దేశం... సాక్షాత్తు ఆనాటి ప్రధాని, చట్ట సభల సాక్షిగా, దేశంలో అందరు ఎంపీల సమక్షంలో ఇచ్చిన హామీకే దిక్కు దివానం లేదు.. కేవలం రాజకీయ కక్షతో, ఇప్పటి కేంద్రం, ఒక రాష్ట్ర ప్రజల ఆకాంక్షన చంపేస్తుంది.. ఏపికి విభజన హమీలు, ప్రత్యేక హోదా విషయం పై, సుప్రీం కోర్ట్ లో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోర్ట్, కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. దీని పై స్పందించిన కేంద్రం, సుప్రీంకోర్టులో మరో వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీకి విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇచ్చామని, ఇక ఇచ్చేదేం లేదన్న కేంద్రం ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. పొంగులేటి పిటిషన్‌లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది.

modi 04072018 2

ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అధికారికంగా సుప్రీంకోర్టుకు చెప్పింది. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కేంద్రం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ ఊసెత్తక పోవడం గమనార్హం. దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ కేంద్రం మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూలోటు రూ. 4116 కోట్లు మాత్రమేనని, ఇప్పటి వరకూ 3979 కోట్లు ఇచ్చామని కేంద్రం లెక్కలు చెప్పుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు ఇచ్చిన తరువాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు ఇస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

modi 04072018 3

విభజన హామీల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని.. పోలవరం ముంపుపై అధ్యయనం, బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టతనివ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో కేంద్రం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం గట్టి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యటానికి రెడీ అయ్యింది. హోదా ఎవరికీ ఇవ్వటం లేదని, ప్యాకేజి అని చెప్పి, చివరకు ప్యాకేజి ఇవ్వక, మిగిలన రాష్ట్రాలకు హోదా ఎలా ఇస్తుంది, వివరంగా, కోర్ట్ కు చెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. హోదా ఒక్కటే కాదు, విభజన చట్టంలో పెట్టిన 18 హామీల విషయంలో కూడా, కేంద్రం చేస్తున్న మోసాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది.

రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతల పై ఫైర్ అయ్యారు. మీ ధోరని ఇలా ఉంటే ఎలా అంటూ క్లాసు పీకారు. 2014 తరువాత, ఏపి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు, అటు టిడిపిలోకి, ఇటు వైసీపీ లోకి వెళ్ళిపోయారు. ఒకటి అరా తప్ప, పెద్దగా నేతలు ఆ పార్టీలో లేరు. ఉన్న నేతలు కూడా, సరిగ్గా పని చెయ్యక పోవటంతో, రాహుల్ గాంధి వారి మీద ఫైర్ అయ్యారు. మనం తప్పు చేసాం, శిక్ష అనుభవిస్తున్నాం, అదే విధంగా బీజేపీ మనకంటే ఎక్కువ తప్పులు చేస్తుంది, అవి మీరు సరిగ్గా ప్రజల్లోకి తీసుకు వెళ్ళటం లేదు అని మొదలు పెట్టి, జగన్ మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ, కాంగ్రెస్ పార్టీలో కొంత మంది వ్యావహర తీరు పై, మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ వేరు అని, జగన్ మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినా విషయం మర్చిపోయారా అని అక్కడ ఉన్న నేతలకు తలంటారు.

rahul 04072018

వైసీపీ లక్ష్యంగా రాజకీయ పోరాటం చేయాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే.. పాలకపక్షం పై దాడి మాత్రమే కాదు, సరిగ్గా పని చెయ్యని ప్రధాన ప్రతిపక్షం వైసీపీని పన్నెత్తుమాట అనకపోవడమే ప్రధాన తప్పిదంగా రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇదే సమయంలో దివంగత వైఎస్కీ.. జగన్‌కీ మధ్య మనస్థత్వాల్లో ఉన్న వైరుధ్యాలను జనానికి అర్థమయ్యేలా చెప్పాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా.. కాంగ్రెస్‌ సిద్ధాంతాల మేరకు పేద ప్రజల కోసం ప్రత్యేక పథకాలను రాజశేఖరరెడ్డి అమలు చేసిన విషయాన్ని ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని సూచించారు. ప్రధానంగా.. వైఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీకి జగన్‌ అందిస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా రాహుల్‌ నూరిపోశారు.

rahul 04072018

వైఎస్‌ ఏనాడూ కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని వీడలేదని.. మరణించే వరకూ కాంగ్రెస్‌ సైనికుడిగానే ఉన్నారని, కానీ జగన్‌ మాత్రం కాంగ్రె్‌సపై కక్షగట్టారని పేర్కొన్నారు. వైఎ్‌సకు, జగన్‌కు మధ్య మనస్థత్వాల్లో ఉన్న అంతరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా వైఎస్ పై కాంగ్రెస్ కు మాత్రమే సర్వహక్కులూ ఉన్నాయంటూ ప్రజలకు వివరించాలని రాహుల్‌ సూచించారు. వీటన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం ద్వారా పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లిన నేతలను వెనక్కు తీసుకురాగలగుతామని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ-వైసీపీ చెలిమిపై విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటును వెనక్కు రప్పించగలమని.. రహుల్‌ అన్నారు. మొత్తానికి రాజకీయంగా బలీయం కావాలంటే పాలక పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షం వైసీపీపై రాజకీయ పోరును పెంచాలని రాష్ట్ర నేతలకు రాహుల్‌ దిశానిర్దేశం చేశారు.

ఒక బాధ్యత లేని వ్యక్తి ప్రవర్తన, మన నిజ జీవితాల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం... విచక్షణ లేకుండా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా అంటూ, విపరీత మనస్తత్వం కలవారాని, మనం ఎంతో మందిని మన జీవితంలో చూస్తూ ఉంటాం... కాని, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఒక పెద్ద సినీ హీరో అయ్యిండి, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ బ్రతికేస్తున్నాడు... ఇక్కడ సమస్య పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు.... ఇలా పవన్ కళ్యాణ్, గాలిగా ట్విట్టర్ లో పోస్టులు పెడుతుంటే, అదే రకమైన భావజాలంతో ఉన్న తన ఫాన్స్ ఇంకా రెచ్చిపోతారు.. సమాజంలో ఇప్పటికే, విచ్చలవిడితనం పెరిగిపోయి ఉంది.. పవన్ లాంటి వాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే, ఇంకా తన ఫాన్స్ ఎలా రెచ్చిపోతారో అర్ధమవుతుంది... ఇలాంటి విపరీత ప్రవర్తనకు, పవన్ కళ్యాణ్ కు కొన్ని మీడియా సంస్థలు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే.

pk 04072018 2

తాజగా ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో పవన్‌ కల్యాణ్‌కు సమన్లు జారీ అయ్యాయి. స్వయంగా లేదా న్యాయవాది ద్వారా ఈ నెల 24న కోర్టుకు హాజరు కావాలని హైదరాబాద్‌ సిటీ సివిల్‌కోర్టు 3వ అదనపు చీఫ్‌ జడ్జి పవన్‌ను ఆదేశించారు. సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందంటూ ఫిలిం చాంబర్‌ ఎదుట సినీ నటి శ్రీరెడ్డి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి మండిపడ్డారు. ఆయనను తీవ్రంగా దూషించారు. ఆ దూషణలో పవన్‌ తల్లిని కించపరిచే పదం వాడారు. ఈ ఎపిసోడ్ ను రాజకీయంగా వాదేసాడు పవన్‌ కల్యాణ్‌.. ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తరువాత, చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షను డైవర్ట్ చెయ్యటానికి ఏప్రిల్‌ 20 తెల్లవారు జాము నుంచి 23 వరకు ట్విటర్లో అనుచిత ట్వీట్లు చేశారు.

pk 04072018 3

ఎవరో శ్రీ రెడ్డి అనే అమ్మాయి తిడితే, ఇదంతా చంద్రబాబు , లోకేష్, కొన్ని మీడియా సంస్థలతో కలిసి, ఇవన్నీ చేపిస్తున్నారని, రాజకీయం మొదలు పెట్టాడు. ట్వీట్‌తో పాటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫొటోను కూడా ట్విటర్లో ఉంచారు. దీంతో, పవన్‌ కల్యాణ్‌ పై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఆ ట్వీట్లు నిరాధారమని, తన, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా అవి ఉన్నాయని, వాటిని ఉపసంహరించుకోవాలని, ఆయన ఏ సామాజిక మాధ్యమం ద్వారా ఆరోపణలు చేశారో దాని ద్వారానే క్షమాపణలు చెప్పాలని తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసులు పంపించారు. పవన్‌ నుంచి స్పందన లేకపోవడంతో.. రాధాకృష్ణ రూ.10 కోట్లకు పవన్‌పై పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఈ కేసు పై కోర్ట్ కు వస్తున్నాడు పవన్. ఇక్కడ పవన్ కు డబ్బులు ఉంటాయి, లాయర్లు ఉంటారు కాబట్టి, ఆయనకు ఏమైనా సాగుతాయి. పవన్ ను చూసి రెచ్చిపోయే అతని ఫాన్స్ కు, ఇంట్లో వాళ్ళే దిక్కు. ఇలాంటి విపరీత పోకడలను సమాజం మీదకు రుద్దుతున్న పవన్, ఈ లీగల్ నోటీసులతో అయినా, గాల్లో మాటలు మాట్లాడకుండా, సవ్యంగా మాట్లడటాడని ఆశిద్దాం...

నాలుగేళ్ళు చంద్రబాబు శభాష్ అంటూ, గత మార్చ్ నుంచి ఉన్నట్టు ఉండి, చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడని విధంగా, పరుష పదజాలంలో చంద్రబాబుని తిడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు బీజేపీతో పోరాడుతుంటే, చంద్రబాబుని బలహీనపరుస్తూ, నేషనల్ మీడియాకు ఎక్కి మరీ చంద్రబాబుని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకు ఇంగితం లేదు అన్నారు... చంద్రబాబు ఇసుక కరా కరా తింటున్నారు అన్నారు... మేము రోడ్లు వేసాం అని లోకేష్ అంటుంటే, ఏ ఇది నీ తాత గాడి సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నావా ? మీ నాన్న నువ్వు కలిసి, కంకరు, సిమెంట్ కలుపుతున్నారా అనే దిగజారుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు పవన్... ఇక పవన్ సినిమా అభిమానులు అయితే, సోషల్ మీడియాలో చంద్రబాబుని, లోకేష్ ని ఎలా తిడుతున్నారో చెప్పే పని లేదు..

cbn pk 04072018 2

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వీరబాబుకు కిడ్నీ అత్యవసర ఆపరేషన్‌కు బడేటి ట్రస్టు ద్వారా రూ.5లక్షల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. మరో రూ.3లక్షలు సీఎం సహాయనిధి నుంచి అందించేందుకు హామీ ఇచ్చారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వీరబాబు చికిత్సకు రూ.8లక్షలు ఖర్చు అవుతుందని, తమ ట్రస్టు ద్వారా రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందించామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మరో రూ.3లక్షలు అందించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.

cbn pk 04072018 3

విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ... మానవీయ స్పందనలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ఎవరైనా వైద్యానికి ఆర్థిక సాయం కోసం వచ్చినప్పుడు వారి పరిస్థితిని ఆరా తీసి, అవసరాన్ని బట్టి ఎంత మొత్తం అన్నది రాస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో సుమారు 50వేల మందికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందించారు. వైద్య అవసరాలను బట్టి రూ.20వేల నుంచి రూ.20లక్షల పైవరకు సాయం మంజూరు చేశారు. ఇప్పటికి రూ.370కోట్లను అందించారు. గత ప్రభుత్వ హయాంలో 2009నుంచి 2012వరకు నాలుగేళ్లలో సుమారు 26వేల మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.127కోట్లు సహాయం అందింది. అదికూడా... సమైక్యాంధ్రలోని 23 జిల్లాలకు కలిపి. కానీ, ఈ మూడేళ్లలో 13జిల్లాల ఏపీకే 50వేల మందికి రూ.370కోట్ల సాయం చేశారు. గతంతో పోలిస్తే ఇది ఐదారు రెట్ల కంటే ఎక్కువ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఎదో మాట్లాడాలి కాబట్టి విమర్శించి చేతులు దులుపుకోవటం కాదు.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి... విమర్శలు హేతుబద్ధంగా ఉంటే, అందరికీ ఉపయోగం ఉంటుంది...

Advertisements

Latest Articles

Most Read