నిత్యం అబద్ధాలతో, గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో పాటు, బీజేపీ నాయకులకు ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గట్టి జర్క్ ఇచ్చారు.. మీలా అబద్ధాలు ప్రచారం చెయ్యటం కాదు, కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం త్వరలో వెలుగులోకి రాబోతోందన్నారు. నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో దాన్ని బయట పెడతామని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ధి చేకూర్చారన్న అంశం ప్రకంపనలు సృష్టించబోతోందన్నారు. గుర్తు పెట్టుకోండి.. కచ్చితంగా ప్రకంపనలు పుట్టిస్తాం అని భాజపా నేతలను హెచ్చరించారు. కేంద్రం చేసిన కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామన్నారు.
ఏపీ విషయంలో బీజేపీ నేతలు చెబుతున్న మాటలకు, వాస్తవంలో జరుగుతున్న పనులకు సంబంధం లేదని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తామన్న రాష్ట్రం తీసుకోవడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. ‘ఏపీకి ఇన్ని నిధులు ఇస్తున్నాం, ఇంత సమకూరుస్తున్నామని కేంద్రం చెబుతోంది గదా! సింపుల్ గా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేంద్రానికి చెందిన ఐదుగురు అధికారులు, రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అధికారులను నియమించి కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణం పంచనామా చేయమనండి! లెక్క తేలిపోతుంది! ఈ విషయం పై సవాల్ విసిరినా జీవీఎల్ స్పందించలేదని కుటుంబరావు ఆరోపించారు. కేంద్రం చాలా వివక్ష చూపుతోంది..కక్ష గట్టిందనే మాట వాస్తవం! రాష్ట్రానికి అవసరమైనప్పుడు కేంద్రం నిధులివ్వాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా సరైన సమయంలో నిధులు విడుదల చేయాలి. ఇప్పటికైనా కేంద్రం తేరుకుని.. నిజాలు ప్రజలకు చెప్పాలి’ అని చెప్పుకొచ్చారు.
2016లో దిల్లీ - ముంబయి పారిశ్రామిక కారిడార్‌కు రూ.495 కోట్లు కేటాయిస్తే.. దేశంలో ఉన్న మిగతా వాటికి కేవలం 4.5 కోట్లు మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. జీవీఎల్ సహా భాజపా నేతలెవ్వరూ వార్డు సభ్యులు కూడా కాలేరని విమర్శించారు. తొమ్మిది నెలల్లో అద్భుతంగా భాజపా జాతీయ కార్యాలయాన్ని నిర్మించారని, ఆ స్థాయిలో ఒక్క సంస్థ అయినా నిర్మాణం అయ్యేలా ఏపీకి సహకరించారా? అని నిలదీశారు. పారిశ్రామిక కారిడార్లు, యూసీలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. పీఎంవోలో ఫైల్ కదలాలంటే ఆరు నెలల సమయం పడుతోందని ఆరోపించారు. ఎయిర్ ఏషియా వ్యవహారంలో 85శాతం పని యూపీఏ-2లో పూర్తయిందని.. ఎయిర్ ఏషియా వ్యవహారానికి ఆమోదం తెలిపింది మోదీ కేబినెటేనన్నారు.