విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షలో పాల్గున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రులను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకు ముందు లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

cbn pk 05062018 2

‘పవన్‌ కల్యాణ్‌ మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడారు. బీజేపీకి టీడీపీ కటీఫ్‌ చెప్పిన తర్వాతే ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని మేం విమర్శిస్తుంటే... పవన్‌ మమ్మల్ని విమర్శిస్తున్నారు. దీనికి కారణమేమిటో చెప్పాలి అని అన్నారు. ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చాం, ఏ కారణం చేత ఇలా చేస్తున్నారో, కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి చుస్తే, బాధ ఆవేదన కలుగుతుంది. ప్రజల కోసం భరించక తప్పదు అని చంద్రబాబు అన్నారు.

cbn pk 05062018 3

‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు ఉపసంహరించుకున్న తర్వాతే ఆయనలో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిస్వార్థంతో మంత్రి పదవులను తృణప్రాయంగా త్యజించడం.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం తప్పా? రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు అని పవన్ ను ఉద్దేశించి అన్నారు. ‘ప్రజాసేవకే నా జీవితం అంకితం. ప్రతిపక్షాలు.. కొత్త పార్టీలు లేనిపోని విమర్శలు చేసినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు. మీ అండదండలుంటే కొండనైనా ఢీ కొడతా. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా’ అని చంద్రబాబు ప్రకటించారు.

నవనిర్మాణ దీక్ష జరుగుతున్న సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీనితో భయానక వాతావరణం నెలకొనటంతో సభలో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. సీఎం చంద్రబాబు వేదికపై ఉన్నచోటే కూర్చున్నారు. ఆయనపై వర్షం పడకుండా సెక్యూరిటీ సిబ్బంది గొడుగులు పట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇచ్చిన వినతిపత్రాలను సెల్‌ టార్చ్‌ వెలుగులో పరిశీలించారు.

cbn 05062018 2

శృంగవరపుకోటలో సోమవారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణదీక్ష సభకు భారీ వర్షం అంతరాయం కలిగించింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. ఈదురుగాలులకు సభా ప్రాంగణం చిగురుటాకులా వణికింది. రెండువైపులా రేకులు ఎగిరిపోవడంతో అదెక్కడ కూలిపోతుందోనని పలువురు హడలిపోయారు. వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా వర్షం నీరు పడడంతో ఆయన కుర్చీ మారగా భద్రతా సిబ్బంది గొడుగుపట్టాల్సి వచ్చింది. దాదాపు అరగంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి సభను ప్రారంభించి ఏకధాటిగా 1.20 గంటల పాటు ప్రసంగించారు.

cbn 05062018 3

అయితే కరెంటు పోయిన సందర్భంలో కూడా చంద్రబాబు రెస్ట్ తీసుకోకుండా, సెల్ లోని టార్చ్ లైట్ వేసుకుని, ఆయన వద్దకు వినతి పత్రాలు ఇచ్చే వారిని రమ్మని, సెల్ లైట్ వెలుతురులోనే, అవి చూసి ఆదేశాలు ఇచ్చారు. ఇవి చూసిన ప్రజలు, చంద్రబాబు కమిట్మెంట్ ను మెచ్చుకున్నారు. ఒక్క క్షణం కూడా వృధా కాకుండా, చంద్రబాబు పని చెయ్యటం చూస్తుంటే, మన లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోకూడదు అని, దానికి చంద్రబాబే ఆదర్శం అని అన్నారు. ఒక కమిట్మెంట్.. ఒక అడ్మనిస్ట్రేటర్.. ఒక విజన్.. ఒక దిక్సూచి.. వీటికి అర్ధం ఏంటో, ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విపక్ష పార్టీలకు సూటిగా సవాల్ విసిరారు. ఎటువైపు ఉండాలో వైసీసీ, జనసేన తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ వైపు ఉంటారో, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడతారో తేల్చుకోవాలని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు సూటిగా చేసిన ఈ ఛాలెంజ్‌తో రాజకీయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందా? బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని వైసీపీ, జనసేన ప్రకటిస్తాయా? కేంద్రంపై సమరానికి ప్రభుత్వంతో కలిసి వస్తాయా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు బీజేపీతో పొత్తుపెట్టుకుని కేంద్రంతో భాగస్వామిగా ఉన్న టీడీపీ, రాష్ట్రానికి ఏ మాత్రం సహాయం చెయ్యని బీజేపీతో ఇప్పుడు అన్ని బంధాలను తెంచేసుకుని ఆ పార్టీపై తాడే పేడే అన్నట్లుగా పోరాడుతోంది. అదే సమయంలో ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ.. బీజేపీతో బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. హోదా, విభజన హామీల విషయంలో ఆ పార్టీ ఏపీలో అధికార పార్టీనే విమర్శిస్తున్నారు కానీ, ఇవ్వాల్సిన కేంద్రంపై ఈగ వాలనీయడంలేదు. చివరికి మోదీని విమర్శించారని, నేరుగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చి అమితమైన అభిమానాన్ని ఆ పార్టీ నేతలు చూపిస్తున్నారు. అదే సమయంలో కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ మద్దతు ప్రకటించారు. బళ్లారి లాంటి జిల్లాలో వైసీపీ కార్యకర్తలే బీజేపీ బరువు బాధ్యతలు మోశారు. ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పడంలేదు. అలా అని విమర్శలు కూడా చేయడం లేదు.

cbn challange 05062018 2

ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతోపాటు ఎన్డీయేలో ఉన్న మరోపార్టీ జనసేన. హోదా విషయంలో మొదట్లో టీడీపీ, బీజేపీలతో తీవ్రంగా విభేదించి.. బీజేపీపై, మోదీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీలో బీజేపీ చచ్చిపోయిందన్నారు. తాను ఎన్డీయేలో లేనని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ హఠాత్తుగా పవన్ తన స్టాండ్‌ను మార్చేసుకున్నారు. ఏపీలోని అన్ని వర్గాలూ ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వాములైనప్పుడు పవన్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆ సమయంలోనే నాలుగో ఆవిర్భావ దినోత్సవ సభ పెట్టి హోదాపై మినహా అన్ని మాట్లాడారు. అప్పటి నుంచి పవన్ కేంద్రంపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. హోదా ఇవ్వాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారే గానీ అంతకుమించి డిమాండ్ నోటి వెంట రావడం లేదు. కొన్నాళ్ల క్రితం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీకి హోదా ఇవ్వకపోయినా పర్వాలేదని, నిధులు ఇస్తే చాలని అన్నారు. అప్పుడే మోదీకి తాను సన్నిహితుడునని, ఆయన అంటే తనకు అభిమానమని చెప్పుకొచ్చారు. ఆయన బీజేపీ ఆత్మీయుడైపోయారు.

cbn challange 05062018 3

టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చినప్పటి నుంచే పవన్ టీడీపీ వ్యతిరేకంగా మారారని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలు వద్దని చంద్రబాబు అన్నారు. లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. దీనిపై నేరుగా సీఎం వైసీపీ, జనసేనకు సవాల్ విసిరారు. అయితే బీజేపీతో కలిసి నడుస్తున్నట్లు బహిరంగంగా చెప్పుకోవాలని, లేకపోతే రాష్ట్రం కోసం పోరాడేందుకు కలిసి రావాలని అన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ గెలవడం కన్నా చంద్రబాబును ఓడించడమే టార్గెట్ అని ఈ విషయాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి ఒకరు మీడియాకు చెప్పారు. అందుకే కొత్త కొత్త రాజకీయ సమీకరణాలకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఏపీలో బీజేపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈసారి తనకు మద్దతు ఇచ్చే పార్టీలైనాసరే తాను లేకుండా కలిసి పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కౌంటర్ గానే చంద్రబాబు సవాల్ చేసినట్లు సమాచారం. దీనిపై వైసీపీ, జనసేనలు ఎలా స్పందిస్తాయోనని టీడీపీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

 

 

ఐదు కోట్ల ప్రజల కోసమే నవనిర్మాణ దీక్ష చేపట్టామని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, పథకాల అమలు తీరుపై రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజానీకం కోసమే భాజపాతో పొత్తు పెట్టుకున్నామని.. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆనాడు ప్రధాని మోదీ అన్ని అంశాలపై హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ తర్వాత మోదీ మాట మార్చారని.. రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. అయితే కేంద్రం న్యాయం చేస్తుందని ఎంతో సహనంతో వేచి చూశామని.. హామీల సాధనకు పోరాటమే మార్గమని ఎన్డీయే కూటమి నుంచి బయటకి వచ్చినట్లు పేర్కొన్నారు.

cbn 05062018 2

‘ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా రాజీనామా డ్రామాలు ఆడుతోంది. ఎన్నికలు రాని సమయం చూసి రాజీనామాల నాటకాలు ఆడుతున్నారు. వైకాపా నేతలకు ధైర్యం ఉంటే మోదీ, భాజపాపై పోరాడాలి. మోదీ ప్రభుత్వం ఏపీపై కుట్ర పన్నింది. ఈ కుట్రలో భాగంగానే వైకాపా నేతలు, పవన్‌ కల్యాణ్‌ నాపై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని బలహీన పరిచే విధంగా వీరు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారు. అయితే ఈ కుట్రలు వేరే రాష్ట్రాల్లో చెల్లుబాటు అవుతాయేమో కానీ.. ఏపీలో సాగవు. వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తుపెట్టుకునే పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలి.’ అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

cbn 05062018 3

‘కేంద్రంతో రాజీ లేదు.. ధర్మపోరాటం చేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలను వదిలిపెట్టలేదు. కేంద్రం, ఆర్‌బీఐ ఒప్పుకోకపోయినా రుణమాఫీ అమలు చేశాం. మహిళా సంఘాల రుణాలు రద్దు చేశాం. సాగునీటి పథకాలకు ప్రాధాన్యత ఇచ్చాం. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించేందుకు శ్రీకారం చుట్టాం. పండించే పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తీసుకున్నాం ’ అని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను, అవకాశవాద రాజకీయాలకు పాల్పడే పార్టీలను రాష్ట్రంలో చిత్తుగా ఓడించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

Advertisements

Latest Articles

Most Read