దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ పై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది.. మరో పక్క ప్రాంతీయ పార్టీలు అనూహ్యంగా బలపడుతున్నాయి... సొంత పార్టీలోనే మోడీ-అమిత్ షా పై వ్యతిరేకత మొదలైంది... దీంతో ఇప్పటి నుంచే అమిత్ షా ఎన్నికల వ్యూహాలకి పదును పెట్టారు.. యోగా గురువు రాందేవ్ బాబాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం కలుసుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి మద్దతివ్వాలని రాందేవ్‌ను అమిత్‌షా కోరారు. బీజేపీ చేపట్టిన 'కాంటాక్ట్ ఫర్ సపోర్ట్' (మద్దతు కోసం సంప్రదించడం) కార్యక్రమంలో భాగంగా రాందేవ్‌ను షా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ '2014 ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతిచ్చిన వారినందరినీ మేము కలుస్తున్నాం.
తాము సాధించిన విజయాలు, చేసిన పనులు తదితరాలను వారికి వివరిస్తున్నాం. 2019లోనూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం' అని షా తెలిపారు. రాందేవ్ బాబాను కలవడమంటే లక్షలాది మంది ప్రజలను (ఆయన అనుచరులు) కలవడమేనని, వచ్చే ఎన్నికల్లో తమ మద్దతుంటుందని ఆయన హామీ ఇచ్చారని వివరించారు. ఇది ఇలా ఉంటే రాం దేవ్ బాబా కూడా, మోడీ- అమిత్ షా లను ఆకాశానికి ఎత్తారు. అసలు మోడీ లేకపోతే మన దేశం ఎక్కడికో వెళ్లి ఉండేది అంటూ, చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వాన్ని, గత నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను రాందేవ్ బాబా ఈ సందర్భంగా ప్రశంసించారు.
దేశాన్ని మోదీ కొత్త దిశగా తీసుకెళ్లారని, గత నలుగేళ్లలో 'అంతర్జాతీయ యోగా డే' ద్వారా మనమంతా గర్వపడేలా చేశారని అన్నారు. జీఎస్‌టీ వంటి పన్నువిధానం వంటివి ప్రవేశపెట్టడం ద్వారా 'టాక్స్ టెర్రరిజం' నుంచి విముక్తి కల్పించారని, ఎల్పీజీ కనెక్షన్ల ద్వారా లక్షలాది మంది మహిళల కన్నీళ్లు తుడిచారని అన్నారు. గత 70 ఏళ్లలో అమెరికా, జపాన్, రష్యా, ఇజ్రాయెల్ సహా ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన నేతలంతా గౌరవించిన మొదటి ప్రధాని మోదీ అంటూ ప్రశంసించారు. ఇంతకుముందు ఏ ప్రధాని కూడా ఇలాంటి గౌరవం పొందలేదని రాందేవ్ అన్నారు. మొత్తానికి పతంజలి రాం దేవ్ బాబా గారు, మోడీ కి జై అంటూ, ప్రజలని మళ్ళీ మోడీనే గెలిపించాలని పిలుపిచ్చారు. ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అంటే 2019 దాకా ఆగాల్సిందే...