ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ. 15.50 లక్షల విరాళాన్ని అందజేసిన తెనాలి పట్టణం ఐతానగర్ కు చెందిన రైతులు... పట్టిసీమ పూర్తితో సాగు నీటి వనరులు పుష్కలంగా అందజేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్జ్ఞతలు తెలిపిన రైతులు... తెనాలి రైతులు విరాళాలివ్వడం స్పూర్తి దాయకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు... ప్రజాదర్బార్ లో తెనాలి రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు... పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2019 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నీళ్ళందిస్తామన్నారు.... రాష్ట్రంలో కరవును తరిమేస్తానన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, "పంటలను కాపాడుకుంటాం. కృష్ణా డెల్టానే కాకుండా నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కూడా నీరందిస్తాం. రాష్ట్రంలో అయిదు నదుల అనుసంధానం చేయగలగడం ఏపీకే సాధ్యమైన విషయం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూతొమ్మిది జిల్లాలకు సాగు, తాగు నీటికి కొరత లేకుండా చేస్తాం"
"కృష్ణా నదిలో నీరు రావడం కష్టమైన స్థితిలో పట్టిసీమ పూర్తితో కోస్తా రైతుల కష్టాలు తీర్చాం. తెనాలి రైతుల స్పూర్తి కేంద్రానికి కనువిప్పు కావాలి. భారత్ లో ఏపీ నెంబరు వన్ కావాలి. రాష్ట్రప్రజల సహకారంతో ఇది సాధ్యం అవుతుంది.ప్రతిపక్షం అడ్డుకున్నా, కేంద్రం నిధులివ్వకున్నా పోలవరం ఆగదు. రాజధాని నిర్మాణానికి ఒక్క పిలుపుతో రైతులు 33వేల ఎకరాలిచ్చారు. పులివెందులకూ నీళ్ళిచ్చాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విరాళాలిచ్చి ప్రభుత్వానికి బాసటగా నిలవాలి. విభజన చట్టం అమలులో కేంద్రం రిక్తహస్తం చూపింది.రావాల్సిన నిధులు అడిగితే మనపైనే బీజేపీ ప్రభుత్వం ఎదురుదాడి చేయడం సరికాదన్నారు."
15 తర్వాత ఎక్కడికో పంపుతామని బీజేపీ అధికార ప్రతినిధి బెదిరిస్తున్నారు. పద్ధతి లేని రాజకీయ విధానాన్ని పాటించడం సహించమన్నారు. రాజకీయాలు హుందాతనంగా ఉండాలి. ఇచ్చిన హామీలు చెప్పిన మేరకు అమలు చేయాలి. రాష్ట్రప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులను కూడా ఇవ్వరా. కేంద్రం బెదిరింపులకు బెదరం. మాకు అన్యాయం జరిగితే కొండనైనా ఎదురిస్తాం, పిండి చేస్తాం. ఎన్టీఆర్ స్పూర్తితొ ముందుకు వెళతాం. మంచి వాతావరణానికి నాందిపలికుదాం.ఆదర్శ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుదాం. దేశంలో ఏపీని నంబరు వన్ గా అభివృద్ధి చేద్దాం. రైతుల చొరవ స్పూర్తి అభినందనీయం. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఖండించిన రైతులు పోలవరం పూర్తయితే రాష్ట్రంలోని మాలాంటి లక్షలాది రైతు కుటుంబాల జీవితాలు బంగరమయం అవుతాయన్న రైతులు.
పోలవరం నిర్మాణానికి అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం వద్ద నిరసన తెలిపిన రైతులు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా చిత్తశుద్ధితో పని చేస్తున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలబడతామన్న రైతులు. తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో 150 మందికి పైగా తెనాలి నుంచి వచ్చిన రైతులు. పోలవరం నిర్మాణం నిధుల సమీకరణలో సీఎం చంద్రబాబుకు అండగా ఉంటామన్న రైతులు తమవంతు భాగస్వామ్యంగా రూ. 15.50 లక్షల విరాళాన్ని సేకరించుకుని తెచ్చి సీఎం చంద్రబాబుకు అందజేసిన రైతులు. పట్టిసీమ ద్వారా మూడేళ్ళుగా పంటలు పండించుకుని లబ్దిపొందుతున్న రైతులు విరాళాలిచ్చారని ఆలపాటిరాజేంద్రప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి కనీసం వంద రూపాయలైనా రైతులు విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు.