అన్నీ అనుకున్నట్టే స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నాయి... కర్ణాటక ఎన్నికలు ముగియగానే, ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తాం అంటూ గత కొన్ని రోజులుగా బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారు... అలా చెప్పినట్టు గానే, ఈ రోజు కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియగానే, ఆంధ్రా అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు... మీకు అమరావతి ఎందుకు, మయసభ కట్టుకుంటారా అని, ఎగతాళి చేసింది ఈయనే... ఇలా ఆంధ్రా పై అడ్డగోలుగా వాదించినందుకు, బహుమానంగా, రాజ్యసభ ఇచ్చి సత్కరించారు అమిత్ షా... అందుకే ఆ విశ్వాసం చూపిస్తూ, ఆంధ్రా పై మరింతగా విరుచుకు పడుతున్నాడు జీవీఎల్... సరిగ్గా కర్ణాటక ఎన్నికల ప్రచార హడావిడి ముగిసిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ పై వ్యాఖ్యలు చేసారు...
ఆంధ్రప్రదేశ్ లో, కొన్ని రోజుల్లోన్నే అనూహ్య పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు... రాజకీయంగా అన్ని పార్టీలు, ఈ అనూహ్య పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై కూడా విపరీత వ్యాఖ్యలు చేసారు... చంద్రబాబు నాయుడు అవినీతి చేసారని, దాని అంతు చూస్తాం అంటూ పాత పాటే పాడారు... జనవరి నెల నుంచి, ఇదే మాట చెప్తూ, సిబిఐ అని, లోకేష్ ని లోపల వేస్తాం అంటూ, హడావిడి చెయ్యటం, సాక్షి వాడు ఇదే వార్త బ్యానేర్ ఐటెం వెయ్యటం, చింతలబస్తీ బ్యాచ్, బీహార్ బ్యాచ్ ఆనంద పడటం, చూస్తూనే ఉన్నాం... చంద్రబాబు మరింతగా, మోడీ పై విరుచుకు పడుతున్నారు కాని, ఎక్కడా ఈ ఉడత ఊపులకు వెనక్కు తగ్గలేదు...
అంతే కాదు, జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ, ఆంధ్రాలో రాబోయే ఆరు నెలల్లో భాజపాకి మహర్దశ రాబోతోందని, ఆంధ్రప్రదేశ్ ని ఏలేది మేమే అంటూ, జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నామని, ఎడ్యూరప్పపై ఏ అభియోగాలు లేవని, ఆయన చాలా క్లీన్ అని, అందుకే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసాం అంటూ, చెప్పుకొచ్చారు.. కర్ణాటక రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక సిద్ధరామయ్య పై విచారణ జరుగుతుందన్నారు. ఎడ్యూరప్ప జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన అవినీతిపరుడు అయిపోతారా అంటూనే, జగన్ కూడా ఇదే బాపతు అనే విధంగా, మాట్లాడి వీరి బంధాన్ని బయట పెట్టారు.. మొత్తానికి, జీవీఎల్ మాటలు వింటుంటే, గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుంది... వీళ్ళు ఆంధ్రాలో చేసేది ఏమి లేదు, కనీసం చంద్రబాబుని టచ్ కూడా చెయ్యలేరు.. ఎందుకో ఈ గాంభీర్యం...