గాలి జనార్ధన్ రెడ్డి... గాలి జనార్ధనరెడ్డి... జగన్ మోహన్ రెడ్డికి దేవుడు ఇచ్చిన అన్నయ్య... ఇద్దరూ కలిసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసి కొల్లగొట్టారో అందరికీ తెలిసిందే... ఇద్దరూ జైలు జీవితం అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు... వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ చూసుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ సంపదను కొల్లగోట్టేసారు... మైనింగ్ లో, గాలి అక్రమ సంపాదన గురించి చెప్పే పనే లేదు... బంగారపు కుర్చీలతో సహా, గాలి విచ్చలవిడితనం అందరం చూసాం... రాజశేఖర్ రెడ్డి అండ చూసుకుని, ఆ రోజుల్లో గాలి, మొత్తం సహజ సంపద కొల్లగొట్టాడు... అయితే, 2010లో, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై, హై కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది...
ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ ఆపెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది... ఇదే విషయం పై గాలి బ్యాచ్ సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళింది... అయితే మే 11, 2010లో సుప్రీం కోర్ట్ అత్యుతున్నత జడ్జి తీసుకున్న నిర్ణయం చర్చనీయంసం అయ్యింది.. సరిగ్గా రిటైర్మెంట్ కి ఒక్క రోజు ముందు, ఓబులాపురం మైనింగ్ కంపెనీకి, మళ్ళీ మైనింగ్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు... అయితే అప్పట్లో దీని పై పలు అనుమానాలు ఉన్నా, ఆధారాలు ఏమి లేకపోవటంతో, ఎవరూ ఏమి మాట్లాడలేని పరిస్థితి... అయితే, ఈ రోజు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న వేళ, ఇదే విషయం పై, కర్ణాటక టీవీ ఛానల్ చేసిన ఒక స్టింగ్ ఆపరేషన్, ఇప్పుడు అతి పెద్ద సెన్సేషన్ అయ్యింది...
కర్ణాటక డిప్యూటీ సీఎం అభ్యర్థి , గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు శ్రీరాములు ఆ టివి ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయాడు.. అక్రమ మైనింగ్ మళ్ళీ ఓపెన్ చెయ్యటానికి, సుప్రీం జడ్జికి 160 కోట్లు లంచం ఇచ్చినట్టు చెప్తూ, ఆ స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయాడు... గాలి జనార్ధన్ రెడ్డి, తన బెయిల్ కోసం, 100 కోట్లు ఇస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే... ఇప్పుడు కేవలం అనుమతులు కోసం 160 కోట్లు లంచం ఇచ్చినట్టు, గాలి సన్నిహితుడు చెప్తున్న విషయం చూస్తుంటే, దిమ్మ తిరుగుతుంది... ఇది ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కి సంబంధించిన కేసు కాబట్టి, ఈ 160 కోట్ల మీద విచారణ జరిపితే, ఇంకా పెద్ద తలకాయలు, ఆ రోజుల్లో YSR సన్నిహితులు, జగన్ హస్తం, అన్నీ బయటకు వచ్చే అవకాసం ఉంది... మొత్తానికి, ఎన్నికలకు 48 గంటల ముందు, ఈ విషయం అతి పెద్ద సెన్సేషన్ అయ్యింది... చివరకు, ఇది ఎటు వెళ్తుందో చూడాలి... చివరగా, ఇలాంటి వారిని గెలిపించమని, చెప్తున్న నరేంద్ర మోడీ గారికి, ధన్యవాదాలు...