భవానీ ఐల్యాండ్‌లో సరికొత్త పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ ఆర్కెస్ర్టాను శీఘ్రగతిన ఐల్యాండ్‌లో ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. రూ.16.5లక్షల వ్యయంతో ఓపెన్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ ఆర్కెస్ర్టాను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా ఎలక్ర్టానిక్‌ తబలా వంటివి ఏర్పాటుచేశారు. వీటిని రోజ్‌గార్డెన్‌ సమీపంలోని పాత్‌వేల వెంబడి ఏర్పాటుచేశారు. భవానీ ఐల్యాండ్‌కు వచ్చేవారిని ఇవి ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ సంగీత పరికరాలను లండన్‌ నుంచి భవానీ ఐల్యాండ్‌ కార్పొరేషన్‌ అధికారులు దిగుమతి చేసుకున్నారు.

bhavani island 11052018 2

ఈ సంగీత పరికరాలను ఐల్యాండ్‌కు వచ్చినవారు ఎవరైనా ఉచితంగా వాయించవచ్చు. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సందర్భంగా చీఫ్‌ సెక్రటరీ సతీమణి భవానీ ఐల్యాండ్‌కు వచ్చిన సందర్భంలో వీటిని ప్రారంభించటం జరిగింది. పిల్లల ను ఈ సంగీత పరికరాలు ఎంతగా నో ఆకట్టుకుంటున్నాయి. భవానీ ఐల్యాండ్‌కు వచ్చే పిల్లలు వీటిని ప్లే చేస్తున్నారు. ఏర్పాటు చేసిన సంగీత పరికరాలన్నీ ఎలక్ర్టానిక్‌వి కావటంచేత ఐల్యాండ్‌ అంతా ఈ ధ్వనులు వినిపిస్తున్నాయి. ద్వీపంలో ఇదో సరికొత్త అనుభూతిని పంచుతోంది. దీంతో పాటు ద్వీపంలో కాన్ఫరెన్స్‌ బైక్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒకేసారి ఏడుగురు సైకిల్‌ను తొక్కే అవకాశాన్ని ఈ కాన్ఫరెన్స్‌ బైక్‌ కల్పిస్తోంది. కాన్ఫరెన్స్‌ బైక్‌ను రూ. 4లక్షల వ్యయంతో చైనా నుంచి కొనుగోలు చేశారు.

bhavani island 11052018 3

సింగిల్‌గా కాన్ఫరెన్స్‌ బైక్‌ను విక్రయించటానికి చైనా అంగీకరించపోయినా.. అనేక వ్యయప్రయాసల కోర్చి దీనిని కొనుగోలు చేశారు. కొద్దిరోజుల కిందటే కాన్ఫరెన్స్‌ బైక్‌ అందుబాటులోకి వచ్చినా... ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్రస్తుతం దీనిని అందుబాటులోకి తీసుకు వచ్చారు. భవానీ ఐల్యాండ్‌ లోని పాత్‌వేలలో దీనిపై ఎక్కి తిరిగేవిధంగా అవకాశం కల్పించారు. పాత్‌వేలలో ఏడుగురు ఒకేసారి సైకిల్‌ తొక్కటం.. అది ముందుకు కదలటం ఎంతో ఆకర్షణగా ఉంది. సీ ఐల్యాండ్‌ పార్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావటానికి బీఐటీసీ అధికారులు టెండర్లు పిలిచారు. వచ్చే నెలలో దీనికి సంబంధించి టెండర్లు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

టిడిపి విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నాడు అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.. వైసీపీ ఎంపీల రాజీనామాలను జూన్ ‌2 తర్వాత ఆమోదించే అవకాశం ఉందని, ఈ మేరకు సమాచారం ఉందని చెప్పారు.. ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు... ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు... తెలంగాణలో ఒక సారి 25 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే... మనం ఏడు సీట్లు గెలుచుకున్నామని సమావేశంలో గుర్తుచేశారు. వైసీపీ, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, కర్ణాటకలో ఎన్జీవో నేత అశోక్‌బాబుపై దాడి చేసింది వైసీపీ వారేనని ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని, ప్రజలకు అన్ని విషయాలను తెలపాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

cbn elections 11052018 2

"రాష్ట్రానికి హోదా ఇస్తామని 3సభల్లో మోడి చెప్పారు.. అన్యాయం చక్కదిద్దుతామని మోడి మాట ఇచ్చారు. పదేళ్లు హోదా ఇస్తామని బిజెపి మేనిఫెస్టోలో పెట్టింది. నాలుగేళ్లుగా హోదా గురించి అడిగాం,29సార్లు ఢిల్లీ వెళ్లి ఒత్తిడి తెచ్చాం. అయినా నిర్లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోంది.అందుకే ధర్మపోరాటం ప్రారంభించాం. పటేల్ విగ్రహానికి రూ.2,500కోట్లు,రాజధానికి రూ.1500కోట్లు ఇస్తారా..? రూ.1500కోట్లతో ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణం సాధ్యమేనా..? స్వల్పంగా నిధులు ఇచ్చి వాటికీ యూసీల పేరుతో పేచీ పెడతారా..? ఇది రాష్ట్రంలో ప్రతిఒక్కరి సమస్య.ఏ ఒక్కరి సమస్య మాత్రమే కాదు.అన్ని పార్టీలు,ప్రజాసంఘాలు సమన్వయంగా పనిచేయాలి,రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి" అంటూ చంద్రబాబు తెలిపారు.

cbn elections 11052018 3

"ఏపికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది.మనకే ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సగటు మనిషికి పూర్తి అవగాహన ఉంది.వైకాపా లాలూచీని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. కేంద్రం సహకరించినా,సహకరించక పోయినా అభివృద్ది ఆగిపోరాదు. 15వ ఆర్ధికసంఘం టివో ఆర్ అర్ధరహితంగా ఉన్నాయి. జనాభా పెరిగితే నిధులు పెంచుతామనడం ధర్మమేనా..? జనాభా నియంత్రణ పాటించడం రాష్ట్రాల తప్పిదమా..? జనాభాను బట్టి ఎంపీ సీట్లు కూడా తగ్గిస్తామంటారా..? మేము చేయని తప్పులకు మా హక్కులను కోల్పోవాలా..?" అంటూ చంద్రబాబు ప్రశ్నించారు...

కర్నాటక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను ఒడించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా శ్రీవారిని దర్శించుకోవడానికి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయన శ్రీకృష్ణ అతిథి గృహం వద్దకు రాత్రి 8.40 గంటలకు చేరుకోగానే తిరుమల జేఈవో కె.ఎస్‌ శ్రీనివాసరాజు పుష్ఫగుచ్చం అందించి స్వాగతం పలికారు. అతిథిగృహంలో ఆయనకు టిటిడి అధికారులు ప్రత్యేక బస ఏర్పాట్లను చేశారు. ఆయనకు పెద్ద ఎత్తున భధ్రతా ఏర్పాట్లను చేయడంతో మీడియాను కూడా దరిదాపుల్లోకి పంపలేదు. ఆయన వెంట స్థానిక బిజెపి నేతలు భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్‌ ఉన్నారు. అమిత్ షా ఈ రోజు ఉదయం, తిరుమల శ్రీ వారని దర్శించుకున్నారు....

alipiri 11052018 1

అయితే, తిరుమల శ్రీవారిని దర్శించుకుని, క్రిందకు వచ్చిన అమిత్ షాకు, అలిపిరి వద్ద నిరసనల సెగ ఎదురైంది... అమిత్ షా వచ్చే క్రమంలో, అలిపిరి వద్ద ఆందోళనతో నిరసన తెలపటానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అక్కడకు చేరుకున్నారు... మమ్మల్ని మోసం చేసారు అంటూ ప్లెకార్డులు పట్టుకుని, నిరసనన తెలియ చేస్తున్నారు... అమిత్ షా గో బ్యాక్ అంటూ ఆందోళన.. అయితే, పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలో పాల్గునటంతో, తిరుమల నుంచి కిందకు రావటానికి అమిత్ షా మరికొంత సమయం తీసుకుంటున్నారు... కింద అందరినీ క్లియర్ చేసే దాకా, అమిత్ షా కిందకు రారు అంటూ, అమిత్ షా సెక్యూరిటీ, తిరుపతి పోలీసులుకు సమాచారం అందించారు...

alipiri 11052018 1

దీంతో పోలీసులు, అలిపిరి వద్ద ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాం అని, అమిత్ షా కు మా నిరసన తెలియచేస్తామని ఆందోళన కారులు చెప్తున్నారు.. అయితే, అక్కడ వాతావరణం ఉద్రిక్తితకు దారి తియ్యటంతో, పోలీసులు వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. వారిని అక్కడ నుంచి పంపించి, క్లియరెన్స్ ఇచ్చే దాకా, అమిత్ షా తిరుమల నుంచి కిందకు వచ్చే అవకాసం కనిపించటం లేదు... మొత్తానికి, తెలుగుదేశం పార్టీ, మరో సారి, ఢిల్లీ నేతలకు చుక్కలు చూపిస్తుంది... అమిత్ షా లాంటి పవర్ఫుల్ నేతకు, ఆంధ్రోది దమ్ము ఏంటో చూపిస్తున్నారు... వీరిని చూసైనా, పవన్, జగన్, ఇప్పతకైనా మోడీ పై పోరాడాలి...

2019 లో టీడీపీ ఫినిష్ అంటూ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. 2019లో టీడీపీ పని అయిపోతుందని బీజేపీ నేతలు అంటున్నారని, తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. బీజేపీ నేతలవి ప్రగల్భాలేనని అన్నారు. ‘‘ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు.. 2019లో తెలుగుదేశం పార్టీ ఫినిష్.. అయిపోయింది. ఇంకొకపక్క మనకు చుక్కలు చూపిస్తామని మాట్లాడారు. ఈనెల 15వ తేదీ తర్వాత మనకు చుక్కలు చూపిస్తామని, ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికే పరిస్థితికి వచ్చారంటే... ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నమన్న అంశం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని’’ చంద్రబాబు అన్నారు. ఎవరూ తెలుగు దేశం పార్టీని ఏమీ చేయలేరని.. ఆ విషయం బీజేపీ గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.

tdp 11052018 1

తాను న్యాయం చేయమని అడిగామని, కేంద్రం న్యాయం చేయలేదని, అన్యాయం చేసిందని, ఏపీ కూడా దేశంలో భాగమేనని చంద్రబాబు అన్నారు. తమకూ హక్కులున్నాయన్నారు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేశారని, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దుతానని, అన్ని విధాల ఏపీకి అండగా ఉంటానని నరేంద్రమోది హామీ ఇచ్చారని, ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన రాజధాని కడతామని, ఢిల్లీ కూడ చిన్నబోయిట్టు చేస్తామని చెప్పి... పటేల్ విగ్రహానికి రూ. 2500 కోట్లు ఇచ్చి, ఏపీకి రూ. 1500 కోట్లు ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు.

tdp 11052018 1

రాజధాని ఎలా కట్టాలని ప్రశ్నించారు. రైతులు ఇచ్చిన స్సూర్తితో రూ. 50 వేల కోట్ల విలువైన భూమి ల్యాండ్ పూలింగ్ చేస్తే... కేంద్రం రూ. 1500 కోట్లు ఇచ్చి.. యూసీలు పంపలేదని తమపై బురద జల్లే కార్యక్రమం చేస్తోందని సీఎం మండిపడ్డారు. ఆ రాజధాని వస్తే ఎక్కువ డబ్బులు కేంద్రానికే పోతాయని ఆయన అన్నారు. మరో పక్క జీవీఎల్‌ వ్యాఖ్యల పై, మంత్రి సోమిరెడ్డి కూడా స్పందించారు... ఎంపీ జీవీఎల్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. చంద్రబాబుకు కాదు.. జీవీఎల్‌కే త్వరలో చుక్కలు కనిపిస్తాయన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. మోదీ, అమిత్‌షాకు ప్రజలు బుద్ధిచెప్పాలని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read