వైఎస్ వివేక కేసులో, నిన్న ఒక్క రోజే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కోర్టు ఆదేశాల ప్రకారం, అఫిడవిట్లు అన్నీ , ఆయా పార్టీలకు ఇవ్వాలని చెప్పటంతో, సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ రోజు వైసీపీ ఆడిన డ్రామా, దాన్ని చంద్రబాబు మీదకు తోసేయటం, ఇదంతా ఎంత కట్టు కధ అల్లరో చూసి, అసలు వివేక కేసులో వీళ్ళ ప్లానింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. నిన్న పులివెందుల సిఐ శంకరయ్య చెప్పిన విషయాలు, అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి. అవినాష్ రెడ్డి తనకు ఫోన్ చేసి వివేక గుండెపోటుతో చనిపోయారని చెప్పినట్టు సీఐ శంకరయ్య చెప్పారు. వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి అందరూ కలిసి ఆధారాలు చెరిపేసారని తెలిపారు. తనకు ముందు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి రమ్మన్నారని, తాను సిబ్బందితో అక్కడకు వెళ్లానని, ఈ లోపే దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు ఆలస్యం అయ్యింది అంటూ అరిచారాని సిఐ తెలిపాడు. ఆ తరువాత లోపలకు వెళ్లి చూస్తే ఇళ్లు మొత్తం రక్తం మరకలు ఉన్నాయని, వెంటనే అవినాష్ రెడ్డి దగ్గరకు వచ్చి, ఇది గుండెపోటు కాదని చెప్పానని సిఐ శంకరయ్య చెప్పాడు. వెంటనే అక్కడే ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి నోరు మూసుకుని ఉండు అని తనని బెదిరించారని, సైలెంట్ గా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపాడు.

avinashreddy 230222022 2

అయితే అక్కడ ఉన్న మరో అనుచరుడితో, ఇది గుండెపోటు కాదని చెప్తుంటే, అంతా పెద్దోళ్ళు చూసుకుంటారు అంటూ తనకు చెప్పాడని అన్నారు. ఇక అప్పుడే కానిస్టేబుల్ తో అక్కడ సీన్ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తూ ఉండగా, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి గట్టిగా గట్టిగా అరిచాడని, దీంతో వీడియో తీయటం ఆపేసామని చెప్పాడు. తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మొత్తం నడిపించాడని, భారతి తండ్రికి చెందిన గంగిరెడ్డి ఆస్పత్రి నుంచి సిబ్బంది తెచ్చి కుట్లు వేసారని, మొత్తం క్లీన్ చేసిన తరువాత, రిఫ్రిజిరేటర్‌ బాక్స్‌ తెప్పించారని, అయితే అందులో పెట్టేందుకు తాను అంగీకరించ లేదని, ఫిర్యాదు చేయాలని, పోస్ట్ మార్టం చేయకుండా ఇలా ఫ్రీజర్ లో పెట్టకూడదని వాదిస్తే, కేసు లేదు ఏమి లేదు అని అవినాష్ రెడ్డి చెప్పాడని సిఐ తెలిపాడు. అయితే తాను గట్టిగా ఎదురు తిరగటంతో, నామమాత్రంగా ఒక ఫిర్యాదు రాసిచ్చారని తెలిపాడు. బడీని ఫ్రీజర్ లో పెట్టి, పూలు కప్పేసి, గాయాలు కనిపించకుండా, మొత్తం వ్యవహారం కానిచ్చేయాలని అవినాష్ రెడ్డి చూసాడని సిఐ తెలిపారు.

మాజీ మంత్రి వైఎస్ వివేక కేసులో, రోజుకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా, వివేక మాజీ డ్రైవర్, అప్రూవర్ గా మారిన దస్తగరి, గత సెప్టెంబర్ లో సిబిఐకి రాసిన వాంగ్మూలం ఈ రోజు బయట పడింది. ఈ రోజు పులివెందుల కోర్టులో నలుగురు నిందితులను సంబంధించి, వాళ్ళ అభియోగ పత్రాలు, వారు రాసిన ఫిర్యాదులు అన్నీ కూడా, సిబిఐ అధికారులు , కోర్టు ఆదేశాల మేరకు, సంబధిత న్యాయవాదులు అందరికీ అందచేసారు. అందులో భాగంగా, దస్తగిరి రాసిన వాంగ్మూలం ఇప్పుడు బయటకు రావటం సంచలనంగా మారింది. గత ఏడాది ఆగష్టులో పొద్దుటూరు కోర్టులో, దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. అది ఇచ్చిన తరువాత, అతనకి అనేక ప్రలోభాలతో పాటు, బెదిరింపులు కూడా వచ్చాయి. తనను లొంగదీసుకునేందుకు అనేక విధాలుగా చాలా మంది ప్రయత్నాలు చేసారని, వైసీపీకి చెందిన వ్యక్తులు తనను సంప్రదించినట్టు దస్తగిరి, సిబిఐకి రాసారు. అందులో ప్రధానంగా, వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న భరత్ యాదవ్ అనే వ్యక్తి, తరుచూ దస్తగిరి ఇంటికి వచ్చే వాడని, సిబిఐకి ఏ వివరాలు చెప్పావు, ఏ స్టేట్మెంట్ ఇచ్చావ్, ఏమి చెప్పావ్, అవన్నీ కూడా, అవినాష్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలియ చేయాలని, పదే పదే ఇంటికి వచ్చి వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపారు.

dastagiri 22022022 2

అయితే తాను సిబిఐ కనుసన్నల్లో ఉన్నానని, తాను ఎక్కడికీ రాలేనని దస్తగిరి పేర్కొన్నట్టు, చెప్పారు. అయితే ఒకసారి దస్తగిరి ఇంటి వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్దకు రావాలని బలవంత పెట్టటంతో, దస్తగిరి అక్కడకు వెళ్ళటంతో, అక్కడ భరత్ యాదవ్, న్యాయవాది ఉన్నారని, అప్పుడు తనను ప్రలోభ పెట్టారని, సిబిఐకి తప్పుడు సమాచారం ఇవ్వాలని, నీకు ఎంత డబ్బు కావాలి అంటే అంత ఇస్తామని, నీకు పది నుంచి 20 ఎకరాలు ఇస్తామని, ఇప్పుడే రాసి ఇస్తామని, ఎంత కావలి అంటే అంత ఇస్తామని, ఇక నుంచి సిబిఐకి ఏమి చెప్పవద్దని ఒత్తిడి చేసినట్టు దస్తగిరి రాసి ఇచ్చాడు. మరోసారి దస్తగిరి ఇంటికి, భరత్ యాదవ్ వచ్చి, అవినాష్ రెడ్డి తోట వద్దకు రావాలని, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి పంపించారని అక్కడకు వస్తే అన్నీ మాట్లాడుకుందామని చెప్పినట్టు చెప్పాడు. తనను భరత్ యాదవ్ ఫాలో అవుతూనే ఉన్నాడని, ఎక్కడకి వెళ్ళినా తన కదిలకలు తెలుసుకుంటున్నారని, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో భరత్ యాదవ్ చెప్పాడు. ఇప్పుడు ఈ వార్త సెన్సేషన్ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యర్ధి పార్టీ అంటే చాలు, శత్రువుని చూసినట్టు చూస్తున్న రోజులు ఇవి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలను, చంద్రబాబు నాయుడుని, అధికార వైసీపీ పార్టీ ఎలా చేస్తుందో చూస్తున్నాం. చంద్రబాబు హోదాకి కాదు కదా, చంద్రబాబు వయసుకి కూడా విలువ ఇవ్వకుండా వైసీపీ పార్టీ చేస్తున్న చేష్టలు, మరింత గ్యాప్ పెంచుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి లెక్క లెక్క సెట్ చేస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. వైసీపీ వైఖరితో, రాజకీయ వైరం రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ తరుణంలో, ఈ రోజు చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు, అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ రోజు మంత్రి గౌతం రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు, జరుగుతున్న రాజకీయ విష క్రీడ పక్కన పెట్టి, ఒక రాజ నీతిజ్ఞుడులాగా స్పందించిన తీరు, అందరి ప్రశంసలు అందుకుంది. రాజకీయ వైరం, వైసిపీ తమ పైన చేస్తున్న వ్యక్తిగత దాడి, ఇవన్నీ పక్కన పెట్టి మరీ చంద్రాబాబు వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. చంద్రబాబు గౌతం రెడ్డి కుటుంబ సభ్యులని పరామర్శించి, వారిని ఓదార్చారు. మరీ ముఖ్యంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి దగ్గర కూర్చుని ఓదార్చారు.

mekapati 21022022 2

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, గౌతం రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. గౌతం రెడ్డి ఎంతో హుందాగా ప్రవర్తించే వారని, ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. అలాగే గౌతం రెడ్డి దుబాయ్ వెళ్ళి పారిశ్రామిక సదస్సులో పాల్గున్న వార్తలు కూడా చూసినట్టు చంద్రబాబు చెప్పారు. ఇంత చిన్న వయసులో చనిపోవటం బాధాకరం అని అన్నారు. అంతే కాదు, ఇది అయిపోయిన తరువాత, టిడిపి మీటింగ్ ఒకటి పెట్టుకుంటే, ఆ మీటింగ్ మొదలు పెట్టగానే, గౌతం రెడ్డి మృతికి సంతాపం ప్రకటించి, మీటింగ్ మొదలు పెట్టారు. ఇదే సందర్భంలో గతంలో వైసీపీ వ్యవహరించిన తీరుని, ప్రజలు గుర్తు చేసుకంటున్నారు. భుమా నాగరెడ్డి గుండెపోటుతో చనిపోతే, చంద్రబాబు ఒత్తిడి పెట్టి చంపేశారని ప్రచారాలు చేసారు. అలాగే ఎమ్మెల్యే కిడారి నక్సల్స్ దా-డి-లో చనిపోతే, చంద్రబాబు కాపాడుకోలేక పోయారు అన్నారు. ఇక కోడెల, తనను వేధిస్తున్నారని ఆ-త్మ-హ-త్య చేసుకుంటే, చంద్రబాబు పట్టించుకో లేదని, అందుకే పోయాడని అన్నారు. ఇలా వైసీపీ వ్యవహరించిన తీరుని, ఈ రోజు టిడిపి వ్యవహరించిన తీరుని, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. ఇదేదో క్రిమినల్ కేసు , లేక అవినీతి కేసు అనుకునేరు. కాదు కాదు, ఒక మీటింగ్ లో పరుష పదజాలం ఉపయోగించారు అంట. దానికి అయ్యన్న మీద కేసు నమోదు చేసారు. మరి కొడాలి నాని, వంశీ, ద్వారంపూడి, అంబటి, అనిల్ కుమార్, వీళ్ళు మాట్లాడిన భాష పైన, బూతులు పైన కేసులు ఉండవా అంటే, ప్రభుత్వానికే తెలియాలి. ప్రతిపక్ష నాయకులు నోరు తెరిస్తే చాలు కేసు, కాలు బయట పెడితే చాలు అరెస్ట్ అనే విధంగా పరిస్థితి తయారు అయ్యింది. ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై, ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. చివరకు ఆయన పైన రేప్ కేసు కూడా పెట్టారంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే, ఈ నెల 18వ తారీఖున అయ్యన్నపాత్రుడు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వెళ్లారు. అక్కడ టిడిపి నేత ముళ్ళపూడి బాపిరాజు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగుదేశం సీనియర్ నేతలు అందరూ కలిసి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి అయ్యన్నపాత్రుడు కూడా వెళ్లారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తరువాత, అక్కడే ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసారు. ఆ సభలో నేతలు ప్రసంగించారు.

ayyanna 22022022 2

ఇదే మీటింగ్ లో అయ్యన్నపాత్రుడు కూడా ప్రసంగం చేసారు. తనదైన స్టైల్ లో అయ్యన్నపాత్రుడు, పంచులు మీద పంచులు వేసారు. డీజీపీని రాత్రికి రాత్రి తీసి పడేసాడు అని, ఇలా అనేక విషయాల పై, బూతులు మంత్రులు పైన, అరగంట మంత్రులు పైన, ఇలా వైసీపీ పంచులు పేల్చారు. ఇదే క్రమంలో, ఆయన తరుచూ నాకొడుకు అనే పదం వాడారు. ఇంకేముంది, ఇది ఒక్కటి చాలు కదా, వైసీపీ రంగంలోకి దిగింది. నాలుగు రోజుల తరువాత, ఇప్పుడు వచ్చి, కేసు పెట్టమని పోలీసుల పై ఒత్తిడి తెచ్చారు. పై స్థాయి నాయకులు ఒత్తిడి చేయాటంతో, పోలీసులు కూడా కేసు నమోదు చేసారు. జగన్ మోహన్ రెడ్డిని, అయ్యన్నపాత్రుడు అసభ్యపదజాలంతో దూషించారని, ఆయన పైన 153(A), 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మరి అయ్యన్నపాత్రుడుని అరెస్ట్ చేస్తారో, ఏమి చేస్తారో చూడాలి. అయితే గతంలో కూడా ఇలాగే అయ్యన్న పైన కేసులు నమోదు అయ్యాయి. అయ్యన్నపాత్రుడు మాత్రం, తగ్గేది లేదని, ఏమి చేస్తారో అది చేసుకోండని సవాల్ చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read