రేపు ఢిల్లీలో ఏమి జరగబోతుంది ? దేశం మొత్తం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుంది.. ఢిల్లీ వేదికగా మోదీపై టీడీపీ సమరం తీవ్రం చేసి, అవిశ్వాసం పెట్టి, దేశంలోని అన్ని విపక్షాల మద్దతు కూడగట్టిన నేపధ్యంలో, ఏమి జరుగుతుందో అని అందరూ చూస్తున్నారు... అయితే, ఇప్పటికిప్పుడు మోడీకి ఇబ్బంది ఏమి లేకపోయినా, పార్లమెంట్ లో చర్చ జరిగితే, మోడీ విశ్వాసం లేదు అని, అనేక రాజకీయ పార్టీలు పార్లమెంట్ వేదికగా చెప్పి, వివిధ రాష్ట్రాలకు మోడీ చేసిన అన్యాయం వివరిస్తే, దేశం మొత్తం ఇది చూస్తుంది... అందుకే, ఎలాగైనా అవిశ్వాసం తప్పించాలాని, మోడీ - అమిత్ షా ప్లాన్ వేస్తున్నారు...
దీని కోసం, రెండు పార్టీలను ఉపయోగించనున్నారు... శుక్రవారం కూడా, ఇలాగే చేసారు, రేపు కూడా ఇలాగే చేసే అవకాసం ఉందని చెప్తున్నారు... శుక్రవారం కూడా, తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో చదివి వినిపించారు. వాటికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని స్పీకర్ చెప్పడంతో కాంగ్రెస్, సీపీఎం సహా వివిధ పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. దీంతో వాటిపై చర్చ చేపట్టేందుకు స్పీకర్ సిద్ధమైన సమయంలో తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభ ఆర్డర్ లో లేదని, సభ వాయిదా వేసారు స్పీకర్...
శుక్రవారం ఎలా అయితే చేసారో, రేపు కూడా అలాగే చేస్తారని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి... ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాసం ఇచ్చి, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, గల్లా జయదేవ్ వాయించిన వాయింపుకి, ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నారు... మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయన్నే కాదు, జగన్ లాంటి వాడితో మోడీ స్నేహం గురించి కూడా ఏకి పడేసారు... ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకూడదు అని బీజేపీ ప్లాన్... తెరాస, అన్నాడీఎంకే సభ్యులతో, మరో రెండు మూడు రోజులు ఆందోళన చేపించి, సభ నిరవధిక వాయిదా వేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.. మరి, చెల్లలు కవితకి, బాబాయి కెసిఆర్ గారికి, పవన్ కళ్యాణ్ గారు కొంచెం చెప్పి, వారిని అవిశ్వాసానికి సపోర్ట్ చేసే విధంగా చెయ్యాల్సిందిగా మనవి...