దేశ రాజకీయాలు మార్చేస్తున్నా, మోడీ లేదు, సోనియా లేదు, నేనే ఢిల్లీని ఏలుతా అంటూ, నాకు మాయావతి ఫోన్ చేసింది, ఇంకా ఎవరో ఫోన్ చేసారంటూ హడావిడి చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు గుర్తుండే ఉంటాయి... అప్పట్లో, చూసారా కెసిఆర్ ఎలా పోరాడుతున్నారో, చంద్రబాబుకి ధైర్యం లేదు అంటూ ఇక్కడ కొంత మంది హడావిడి చేసారు.. పవన్ కళ్యాణ్ లాంటి నేతలు అయితే, ట్విట్టర్ లో, హాట్స్ ఆఫ్ చెప్పారు... ఇక హోదా పై మద్దతు తెలిపారని, కవితను చెల్లలు అంటూ, ట్వీట్ చేసారు పవన్...

kcr 16032018 2

అంతే కాదు, అవిశ్వాసం పెట్టండి, నేను మీకు మద్దతు తీసుకువస్తా, ఢిల్లీ వస్తా, తెరాస మద్దతు ఇస్తుంది అని అన్నారు.. కాని, కెసిఆర్ అలాంటి వాడు కాదు అని ఇప్పటికైనా, పవన్ తెలుసుకోవాలి... కెసిఆర్ అనేవాడు రోజుకి ఎన్ని మాటలు మారుస్తాడో, పవన్ కి తెలియదు ఏమో... పవన్ గారు ఇప్పటికైనా కెసిఆర్ నైజం తెలుసుకుంటారని ఆశిద్దాం.. అయితే, ఇక్కడ కెసిఆర్ చేసిన హడావిడి మాత్రం మర్చిపోకూడదు... మోడీని అన్ని మాటలు తిట్టి, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండి అంటే, వెనక్కు వెళ్లారు...

kcr 16032018 3

అవిశ్వాసం పెడుతుంది మా రాష్ట్ర సమస్య మీద కాదు, జాతీయ సమస్య పై కాదు, మాకు ఆ అవిశ్వాస తీర్మానం అనవసరం అని తెరాస పార్టీ ప్రకటించింది... పార్లమెంట్ చేసిన చట్టం, జాతీయ సమస్య కాదా ? సరే, మరి ప్రత్యెక హోదాకు మద్దతు అంటూ, మరి అదే విషయం పై, ఎందుకు మద్దతు ఇవ్వరు ? చెల్లలు కవిత గారు, బాబాయి కెసిఆర్ గారు, మాకు మద్దతు ఇవ్వరా ? మోడీ మీద రికార్డెడ్ గా, మీరు అంటే, మాకు విశ్వాసం లేదు అని చెప్పటానికి భయమా ? అందుకే అనేది సొల్లు ఏముంది అవడైనా చెప్తాడు... దమ్ము ఉండాలి....

చంద్రబాబు ఒక్క అడుగు ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ... చంద్రబాబుకు సహనం నశిస్తే, దేశంలో రాజకీయం ఎలా ఉంటుందో తెలిపే ఉదాహరణ ఇది... చంద్రబాబు అడిగింది ఏంటి ? మా హక్కులు అడిగారు.. బిల్ లో పెట్టినవి ఇవ్వండి చాలు అన్నారు... నాలుగేళ్ళు పోరాడారు... చివరకు ఏమి ఇవ్వలేదు అని మోడీ తో పోరాటానికి సిద్ధమయ్యారు... కేంద్రంలో మంత్రులు బయటకు వచ్చారు... వెంటనే ఢిల్లీ నాటకాలు మొదలు పెట్టింది... ఇక్కడ కొంత మందితో లాలూచీ పడి, రాష్ట్ర ముఖ్యమంత్రిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది... ఒక్కడంటే ఒక్కడు, మోడీ అనే పేరు కూడా ఎత్తకుండా, విపక్షాలు నాటకాలు ఆడుతుంటే, చంద్రబాబు రోజుకు ఒక అడుగుతో, మోడీకి జర్క్ లు ఇస్తున్నారు...

cbn 16032018 1 2

ఈ రోజు మోడీ పై అవిశ్వాసం పెడుతున్నారు... ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నారు... ఈ క్రమమంలో దేశ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి... చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడుని, కొంత మందిని అడ్డుపెట్టుకుని, ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎలా ఉంటుందో, జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ సెన్సేషన్ న్యూస్ ప్రసారం చేస్తుంది... దేశ రాజకీయాలను కుదిపే నిర్ణయం చంద్రబాబు తీసుకోనున్నారు ఆ కధన సారంశం... రాష్ట్ర ప్రయోజనాలు అడిగితే, ఇక్కడ కొంత మందిని అడ్డుపెట్టుకుని, తమిళనాడు తరహా కుట్రలు చేస్తే, చంద్రబాబు ఎలా జూలు విదులుస్తారో ఈ కధనం చెప్తుంది...

cbn 16032018 1 2

ఆ కధనం ప్రకారం, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి వివిధ ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వం వహించే అవకాశాలున్నాయంటూ రిపబ్లిక్‌ టీవీ గురువారం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఇప్పటికే 7 పార్టీలు టీడీపీకి మద్దతు ప్రకటించాయని తెలిపింది. మే నెలలో చంద్రబాబు అధికారికంగా ఈ కూటమి గురించి ప్రకటిస్తారని పేర్కొంది. యూపీ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ)తో మాట్లాడిన అనంతరం ఎన్డీయే నుంచి కూడా వైదొలగనున్నట్లు చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు ఏకమై ఫెడరల్‌ ప్రంట్‌ ఏర్పరిస్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చంటూ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో చర్చలు కడు జరుగుతున్నాయని సమాచారం...

విజయవాడలో ‘ఆదరణ పథకం’ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు... ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై, ప్రజల మధ్య వారికి సూటి ప్రశ్నలు వేసారు... కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై విమర్శలు గుప్పించడం ఏంటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్ల పాటు కనపడని అవినీతి పవన్ కల్యాణ్‌కు ఈ రోజు కనపడిందా? అని నిలదీశారు. తనను విమర్శిస్తే పవన్ కు వచ్చే లాభం ఏంటని అన్నారు. 

cbn adarana 15032018

రాష్ట్రానికి ప్రస్తుత్వం, ఉన్న ఈ కష్ట సమయంలో ఎవరయినా మాట్లాడాల్సింది మన హక్కులపై అని, నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు... హక్కుల కోసం పోరాడకుండా తనను విమర్శిస్తున్నారని తెలిపారు... నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఏ రోజూ ఎవరికీ భయపడలేదని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరానని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము పోరాడుతున్నామని చెప్పారు... రాష్ట్ర విభజన పేరుతో ఆపరేషన్ చేసి తల్లిని చంపారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ తల్లిని కాపాడాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు అని అన్నారు... తమిళనాడు తరహా కుట్ర చేస్తున్నారని, నా మీద కేసులు పెడతా అంటున్నారని, నేను ఎవరికీ భయపడను అని, రాష్ట్రం జోలికి వస్తే చూస్తూ ఊరుకొను అని చెప్పారు...

cbn adarana 15032018

అంతకు ముందు, అసెంబ్లీ స్పందిస్తూ, త్త వ్యక్తులు, పార్టీలు లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, వారి బండారం త్వరలోనే బయటపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదని హితవు పలికారు. రేపో, ఎల్లుండో అన్నీ బయటపెడతా. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాం. లాలూచీ పడి రాష్ట్ర హక్కులను తాకట్టు పెడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు అన్నారు...

ఈ రోజు ఉదయం అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు రెండు కీలక నిర్ణయాలు తీసుకుని, అటు మోడీతో పాటు, ఇటు మోడీ కొత్త స్నేహితులకు కూడా దిమ్మ తిరిగే అడుగు వేసారు... లోక్ సభలో ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఎంపీలను ఆదేశించి షాక్ ఇచ్చారు... నిన్నటి వరకూ తమ అవిశ్వాసానికి మద్దతిస్తారని ఆశించి.. మద్దతిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో హోదా కోసం తామే అవిశ్వాసం పెట్టామని చెప్పుకోవాలన్న వైసీపీ, ఆయన కొత్త స్నేహితులు ఆశలపై తాజా నిర్ణయంతో చంద్రబాబు నీళ్లు చల్లారు.

cbn 16032018 2

చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వైసీపీ, ఆయన కొత్త స్నేహితులు డైలమాలో పడ్డారు. వైసీపీ కుట్రపూరితంగానే అవిశ్వాసం పెడుతోందని భావించే చంద్రబాబు మద్దతుపై యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎన్డీఏతో కూడా తెగతెంపులు చేసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా జరుగున్న పరిణామాలతో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్టీయేకు గుడ్ బై చెప్పింది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలతో రాజీనామా చేయించిన టీడీపీ అధిష్టానం చివరకు ఎన్డీయేలో కొనసాగరాదని నిర్ణయం తీసుకుంది.

cbn 16032018 3

సాయంత్రం అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీయేతో తెగదెంపుల విషయంపై పార్టీ ముఖ్యులతో చర్చించారని, అయితే.. తెగదెంపులకే ఎక్కువగా మొగ్గు చూపడంతో చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పారని వార్తలు వెలువడుతున్నాయి. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, కొత్త వ్యక్తులతో రాష్ట్రం పై ఎలా కుట్ర జరుగుతుంది, అలాగే జరుగుతున్న రాజకీయ మార్పుల గురించి చెబుదామని ఆయన అన్నారు. ఇక ఎన్డీయే నుంచి తాము వైదొలిగామన్న సంగతిని స్పీకర్ కు, రాష్ట్రపతికి తెలియజేయాలని చంద్రబాబు ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read