ఒక్క రోజులో దేశ రాజకీయాలను చంద్రబాబు ఎలా మర్చేసారో చూసాం.... మా రాష్ట్రానికి మోసం చేసారు... మోడీ పై మాకు విశ్వాసం లేదు... చట్టంలో ఉన్నవి కూడా అమలు చెయ్యటం లేదు అంటూ చంద్రబాబు చెప్పారో లేదో... దేశ రాజకీయాలలో ఒక కుదుపు వచ్చింది... అందరూ మోడీ వైఖరికి వ్యతిరేకంగా, చంద్రబాబుకి మద్దతు ఇస్తున్నారు.... కాని, మన రాష్ట్రం కోసం అంటూ వచ్చిన పవన్ మాత్రం, తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసం ఒక డ్రామా అంటూ, జాతీయ మీడియాతో మాట్లాడుతూ, మనం పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలహీన పరిచే కార్యక్రమం పెట్టుకున్నారు...
చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, తాను పెట్టమంటేనే అవిశ్వాసం పెట్టారని చెప్పారు.. అంతే కాదు, మళ్ళీ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తూ, అవినీతి అని, చంద్రబాబు విశ్వాసం కోల్పాయారు అని, ఇలా అన్ని విధాలుగా, కించ పరుస్తూ మాట్లాడారు... జాతీయ స్థాయిలో, మోడీ లాంటి వాడిని డీ కొడుతున్న వేళ, దేశం మొత్తం చూస్తున్న నేషనల్ మీడియాలో, చంద్రబాబుని బలహీన పరుస్తూ, మోడీకి అనుకూలంగా మాట్లాడారు పవన్... 4 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా నేషనల్ మీడియాతో మాట్లాడని పవన్, ఇప్పుడు వచ్చి, జాతీయ స్థాయిలో చంద్రబాబుని తక్కువ చేసి మాట్లాడి, మోడీ మీద చేస్తున్న యుద్ధంలో బాబుని బలహీన పరుస్తున్నారు..
ఇదే సందర్భంలో మోడీని ఒక్క మాట కూడా అనలేదు... కేవలం ఒక సందర్భంలో మాత్రం, మోడీ ప్రస్తవన తీసుకువచ్చి, నేను గుజరాత్ వెళ్లి మోడీని కలిసాను, అప్పుడే స్పెషల్ స్టేటస్ గురించి చెప్పను అని చెప్తూ, స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని మోడీ ప్రామిస్ చేసారు అన్నారు పవన్... అయితే, ఏమైందో ఏమో, వెంటనే కవర్ చేసుకుంటూ, మోడీ స్పెషల్ స్టేటస్ మీద ప్రామిస్ చెయ్యలేదు, అది మన్మోహన్ సింగ్ చేస్తే, ఇప్పుడు మోడీ చెయ్యాల్సి వస్తుంది అంటూ కవర్ చేసారు... ఇంతలా ఎందుకు మోడీని కవర్ చేస్తున్నారో పవన్ కే తెలియాలి... ఢిల్లీ మీద ఆంధ్రప్రదేశ్ యుద్ధం చేస్తున్న ఇలాంటి టైంలో, పవన్ జాతీయ మీడియాకు ఎక్కి, మోడీని సమర్ధిస్తూ, చంద్రబాబుని కించ పరచటం, దేనికి సంకేతమో, ప్రజలు అర్ధం చేసుకుంటారు...