వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర అర్ధాంతరంగా వాయిదా వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవటం చర్చనీయంసం అయ్యింది.. వాస్తవానికి రేపు శుక్రవారం, కోర్ట్ కి వెళ్ళాల్సి ఉంది... అయితే, గురువారం సాయంత్రం వరకు పాదయత్ర చేసి, సాయంత్రం హైదరాబాడ పయానం అయ్యే వారు... ఈ రోజు, గురువారం, ఒక రెండు కిలో మీటర్లు నడిచి, అర్ధాంతరంగా, వాయిదా వేసి, హైదరాబాద్ వెళ్ళిపోయారు... అక్కడ ఉన్న జగన్ సిబ్బంది కూడా, విషయం పూర్తిగా తెలియక తికమక పడ్డారు... గురువారం ఉదయం పీసీపల్లి మండలం అలవలపాడు నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. రామాపురం, గుడెవారిపాలె మీదుగా సాగిన పాదయాత్ర హజీజ్‌పురం వద్ద ముగిసింది.

jagan vayida 22022018 2

ఇలా అర్ధాంతరంగా ముగియటానికి కారణం, జగన్ కేసులో, ప్రధాని మోడీతో పాటు, మరో నలుగురు కేంద్ర మంత్రులకి నోటీసులు రావటమే కారణంగా తెలుస్తుంది... ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో అర్ధంకాక, ఈ విషయం ఎలా తేల్చుకోవాలి అనే విషయంలో, జగన్ హైదరాబాద్ లో, తన జే బ్యాచ్ తో సమావేశం కానున్నారు... ప్రధాని మోడీని మచ్చిక చేసుకున్న టైంలో, ఈ నోటీసులు డైరెక్ట్ గా ప్రధానికే రావటం, ఆయన పరువుతో పాటు, దేశం పరువు కూడా పోవటంతో, ఈ విషయం తీవ్రత ఎలా తగ్గించాలి, ఎలా డైవర్ట్ చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని కోసం, జగన్ పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు...

jagan vayida 22022018 3

షడ్యుల్ ప్రకారం, పాదయాత్రలో భాగంగా గురువారం హజీస్‌‌పురంలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లడంతో సభ రద్దైంది... దీంతో అక్కడ ఏర్పాట్లు చేసినవారు నిరుత్సాహ పడ్డారు... ఇలాంటి నాయకుడు, రోజు నీతులు చెప్తూ, చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ని తిడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ, ఇంకా రోడ్లు మీద తిరుగుతున్నారు అంటే, ఇంకా సిగ్గు అనేది లేకుండా, ఇలాంటి వాడిని వెనకేసుకుని వస్తున్నారు అంటే, మన ఖర్మ అనుకోవటం తప్ప, ఏమి చెయ్యగలం..

జగన్ మోహన్ రెడ్డితో కలిసి వెళ్ళటానికి, తహతహలాడుతున్న నరేంద్ర మోడీకి, జగన్ తో కలవక ముందే, 70mm సినిమా కనిపిస్తుంది... మనోడి రేంజ్ ఏంటో తెలిసి కూడా, అలాంటి వాడితో స్నేహ హస్తం కోసం, తపించిపోతున్న మోడీకి, ఇది షాక్ లాంటిందే... జగన్ చేసిన దోపిడీ ఎఫెక్ట్ వల్ల, మోడీకే కాదు, మరో ముగ్గురు కేంద్ర మంత్రులకు కూడా చుట్టుకుంది... అప్పుడెప్పుడో జగన్ చేసిన స్కాంలు, ఇప్పుడు మోడీ, కేంద్ర మంత్రులకు చుట్టుకోవటం ఏంటి అనుకుంటున్నారా ? దీని వెనుక పెద్ద స్టొరీనే ఉంది... ఒక రకంగా చెప్పాలంటే, జగన్ లాంటి వాడితో స్నేహం ఎంత ప్రమాదమో, మోడీకి ముందే తెలిసేలా చేసింది విధి... మరి, మోడీ, ఇప్పటికైనా మారతారో లేదో చూడాలి...

jagan22022018 2

వివరాల్లోకి వెళ్తే, ఇందూ టెక్ సెజ్ లో, మనోడు సిబిఐ కేసులో బుక్ అయ్యి ఉన్నాడు.. ఇదో పెద్ద స్కాం అని, ఇందు శ్యాం ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్, జగన్ ఎలా దోచింది, సిబిఐ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసింది... ఇందు శ్యాం ప్రసాద్ రెడ్డికి భూములు అప్పగించి, ఆ భూములు తాకట్టు పెట్టి, మొండి లాండరింగ్ ద్వారా జగన్ కంపనీలలో పెట్టుబడులు పెట్టారని, సిబిఐ బుక్ చేసేంది... అయితే, మారిషస్ కి చెందిన Carissa Investments LLC అనే కంపెనీ ఇందూ టెక్ సెజ్ లో, 49% వాటా కలిగి ఉండి, FDI ద్వారా పెట్టుబడులు పెట్టింది...

jagan22022018 3

జగన్ ఇందూ టెక్ సెజ్ లో స్కాం చేసాడు అని తేలటంతో, ఇప్పుడు అది ముందు వెళ్లకపోవటంతో, Carissa Investments, మారిషస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.. ఇరు దేశాలకు సంబందించింది కాబట్టి, మారిషస్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ కోర్ట్ లో ఫిర్యాదు చేసింది... Carissa Investmentsని మోసం చేసారని, 50 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించమని కోరింది... దీంతో, ఇంటర్నేషనల్ కోర్ట్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఫైనాన్సు మినిస్టర్, లా మినిస్టర్, కామర్స్ మినిస్టర్, అర్బన్ అఫైర్స్ మినిస్టర్ కు నోటీసులు జారీ చేసింది... జగన్ చేసిన స్కాం వల్ల, ఇప్పుడు ప్రధాని, నలుగురు కేంద్ర మంత్రులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది...

బుందేల్ ఖండ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరాల జల్లు కురిపించారు... రూ. 20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.... బుందేల్ ఖండ్‌కు ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ ప్రకటించడంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు... అయితే ఏపీ తమకు న్యాయం చేయాలని ఇంత ఆందోళన చేస్తున్నా... పట్టించుకోని మోదీ బుందేల్ ఖండ్‌కు మాత్రం ప్యాకేజీ ప్రకటించారు... ఇది ఏపీ ప్రజల్ని మరింత ఆగ్రహానికి గురుచేస్తోంది... తాము ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోని ప్రధాని బుందేల్‌కు ప్యాకేజీ ప్రకటించడం మరింత రగిలిపోయేలా చేస్తోంది...

modi 21022018 2

లఖ్‌నవూలో పెట్టుబడుల సదస్సులో మోదీ ఈ ప్రకటన చేశారు. ఏపీలో విభజన హామీల అమలు కోసం ఉవ్వెత్తున ఆగ్రహావేశాలు ఎగిసిపడుతున్నాయి. తమకు కొత్తగా ఏమీ వద్దు... విభజన హామీలు అమలు చేస్తే చాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు నెరవేర్చాలని ఏపీ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తోంది. లోక్‌సభలో ఎంపీలు ఆందోళనకు దిగి తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించారు. అయినా ఎప్పుడూ చెప్పే మాటలే మోదీ సర్కార్ చెప్పింది. ఎక్కడ నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదు. ఉభయ సభల్లోనూ ప్రకటన చేసిన కేంద్రమంత్రులు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.

modi 21022018 3

ఇలాంటి సమయంలో బుందేల్ ఖండ్‌కు ప్రత్యేకంగా రూ. 20 వేల కోట్ల ఫ్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు ఇస్తామని ప్రకటించారు. ఆ లెక్కన రూ. 24 వేల 500 కోట్లు 7 జిల్లాలకు కలిపి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రూ. 1050 కోట్లు మాత్రమే ప్రకటించి, ఇచ్చారు. అయితే హోదా వల్ల కలిగే రాయితి ప్రయోజనాలు కూడా ఇవ్వలేదు.... వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అన్నారు. అదీ కనిపించలేదు. ఇదే సమయంలో బుందేల్ ఖండ్‌కు రూ. 20వేల కోట్ల ప్యాకేజీతో రక్షణ పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నట్లుగా లక్నో పెట్టుబడుల సదస్సులో మోదీ ప్రకటించారు. ఏపీ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నా కేంద్రంలో చలనం లేదు.. తాజాగా బుందేల్ ఖండ్‌ ప్రకటన చుస్తే,కేంద్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు కనిపిస్తుంది...

దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన ప్రపంచ శ్రేణి కార్ల దిగ్గజ సంస్థ కియా భారతదేశంలో తొలిసారిగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కార్ల తయారీ కేంద్రం ప్రస్థానానికి తొలి అడుగు పడుతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి (అమ్మవారిపల్లి) గ్రామంలో 44వ జాతీయ రహదారి పక్కన నెలకొల్పుతున్న కియా కంపెనీకి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.13వేల కోట్ల వ్యయంతో 600 ఎకరాల విస్తీర్ణంలో హూండయ్ సంస్థ అనుబంధంతో ఏర్పాటు చేస్తున్న కియా కార్ల ఉత్పత్తి కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 13 వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

kia 22022018 2

2017 జూన్‌లో కియా కంపెనీకి అవసరమైన భూమి పనులు మొదలయ్యాయి. 2019 ద్వితీయార్ధంలో కార్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఏడాది సెప్టెంబర్ నాటికి తొలి కారు ఉత్పత్తి చేయడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ఏడాదికి దాదాపు 3 లక్షల కార్లు తయారు చేయాలన్నది కియా సంస్థ లక్ష్యం. అలాగే టౌన్‌షిప్, అనుబంధ సంస్థలు, శిక్షణ సంస్థ తదితరాలను మరో 1200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. కియాకు కేటాయించిన 600 ఎకరాల్లో దాదాపు 550 ఎకరాల్లో గ్రౌండ్‌వర్క్ పూర్తయింది.

kia 22022018 3

నాలుగు రాష్ట్రాల పోటాపోటీ... కియా మన దేశానికి రావాలని నిర్ణయించుకున్నాక ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలు కూడ పోటీ పడ్డాయి. అభివృద్ది చెందిన గుజరాత్, ఆటోమొబైల్ రంగంలో ముందున్న మహారాష్ట్రను కాదని మన రాష్ట్రానికి తీసుకురావడం చంద్రబాబు మరో (కీలక) విజయం.... మూడు జిల్లాల మధ్య పోటీ... నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలలో భూమి లభ్యత, రోడ్, విమాన సౌకర్యాల దృష్ట్యా అనంతపురం వైపు మొగ్గు. కాని గొల్లపల్లి రిజర్వాయర్ లో కృష్ణా జలాలు లేక పోవడంతో చెప్పిన టైం కంటే వేగంగా రిజర్వాయర్ ను నింపిన అధికారులు....

kia 22022018 4

kia 22022018 5

భూమి సేకరణ... వివిధ దశలలో.. మొదట 475 ఎకరాలు, తరువాత 600 ఎకరాల భూ సేకరణను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులను ఒప్పించి, మంచి ధరను చెల్లించి వేగంగా చదును చేసి కియాకు అప్పగించిన కలెక్టర్లు, ఇతర అధికారులు.... కియా వేగం... ముఖ్యమంత్రి, ప్రభుత్వం, స్థానిక అధికారులు, అర్ధం చేసుకొని సహకరించిన రైతులు.. ఇవన్నీ చూసి కియా సైతం అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయడానికి నిర్మాణంలో వేగం పెంచింది. రివైజ్డ్ టార్గెట్ ప్రకారం 2019 దీపావళికి (ముందుగా అనుకున్నది 2022కు) దేశంలోని రోడ్లపై ‘అనంతపురం కియా’ కార్లు. అంతే కాదు కియా పరిశ్రమలన్నిటిలోకి టెక్నాలజీ పరంగా కార్ల తయారీ సంఖ్య పరంగా అతి పెద్ద పరిశ్రమ.

విజయవాడలో బుధవారం నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల్లో గందరగోళం నెలకొంది. నేతల మధ్య భేదాభిప్రాయాల కారణంగా ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హంగామా సృష్టించారు .దీనికి గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశం వేదికైంది. సమావేశానికి హాజరైన మల్లాది విష్ణు అలకబూని వేదికపైకి వెళ్లేందుకు ససేమిరా అన్నారు. దీంతో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, పార్ధసారధి ఎన్నిసార్లు పిలిచినా మల్లాది విష్ణు పైకి వెళ్లకుండా భీష్మించుకుపోయారు..స్వయంగా వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి బతిమాలినా ఫలితం లేకుండా పోయింది.

radha 21022018 2

మరోవైపు వంగవీటి రాధా అనుచరులు నానా హంగామా సృష్టించారు. రాధాను సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై రాధా, జై రంగా అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒకింత అసహనానికి గురైన మల్లాది విష్ణు..ఆపండయ్యా అంటూ వారించారు. రాధాని రెండు రోజులుగా పిలుస్తున్నామని, కాసేపట్లో వస్తారని సామినేని ఉదయభాను సముదాయించారు. మొత్తం మీద వంగవీటి రాధా ఆలస్యంగానైనా సమావేశానికి రావడంతో గందరగోళం సద్దుమణిగింది.

radha 21022018 3

ఇప్పటికే రాధా, జగన్ వైఖరి పై గుర్రుగా ఉన్నారనే అభిప్రాయం ఉంది... పార్టీ మారుతున్నారు అనే ప్రచారం కూడా ఉంది... గౌతం రెడ్డి విషయంలో జగన్ ఆడిన డ్రామాలు, అలాగే రాధాకి సీట్ ఇవ్వకుండా, తప్పించే ప్లాన్ వెయ్యటం, రంగాను అన్ని తిట్టిన గౌతం రెడ్డిని బహిరంగంగా జగన్ కలవటం, ఇవన్నీ రాధాకు ఇబ్బందిగా మారాయి... టైం తీసుకుని, అడుగు వేస్తా అని ఇప్పటికే రాధా తన అనుచరుల దగ్గర ప్రకటించారు.. వైసిపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా, రాధా ఆక్టివ్ గా పాల్గునటం లేదు..

More Articles ...

Advertisements

Latest Articles

Most Read