మాములుగా అయితే, ప్రతి శుక్రవారం మాత్రమే జగన్ డైరీలో హాలిడే... పాదయాత్ర అయినా, ఏ యాత్ర అయినా, దేశంలో ఎక్కడ ఉన్నా, శుక్రవారం మాత్రం, నాంపల్లి కోర్ట్ లో వచ్చి హాజరు వెయ్యాలి... అలాంటి జగన్ కు, ఈ వారం మాత్రం, రెండు రోజులు హాలిడేస్ లభించాయి... ఒకటి గురువారం, రెండోది శుక్రవారం... శుక్రవారం సంగతి అందరికీ తెలిసిందే... గురువారం మాత్రం, రాష్ట్ర బంద్ సందర్భంగా,జగన్ కూడా హాలిడే తీసుకోనున్నారు... తనతో పాటు ఉండే వారు అందరూ బంద్ లో పాల్గునాలి అని, నేను హాలిడే తీసుకుంటాను అని జగన్ చెప్పినట్టు సమాచారం...
నిజానికి రేపటి బంద్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కి పిలుపు ఇచ్చాయి... ఈ పిలుపు ప్రతిపక్ష పార్టీగా జగన్ ఇస్తారు అని అందరూ అనుకున్నారు... కాని, జగన్ విచిత్ర పరిస్థితి వలన, పిలుపుకి బదులు, ఎవరో పిలుపిచ్చిన బంద్ కు మద్దతు ఇస్తున్నారు... బంద్ కారణంగా గురువారం నాడు పాదయాత్ర ఆపనున్నారు. ఈ బంద్ లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జగన్ పిలుపునిచ్చాడు... అయితే పాదయాత్ర చేస్తూ, ఎక్కడికక్కడ ధర్నా చేద్దామని నాయకులు చెప్పగా, వారి పై జగన్ తీవ్ర ఆగ్రహం చూపించారు.... నాకు ఏమి చెయ్యాలో తెలుసు, మీరు బంద్ చెయ్యండి అంటూ, వారి పై కోపగించుకున్నారు...
మరో పక్క, వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన బంద్ శాంతియుతంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులను ఆదేశించారు... పోలీసులు సంయమనంతో వ్యవహరించాలన్నారు... రాష్ట్రానికి సాయం చేయకపోవడం అన్న సమస్య ఢిల్లీలో ఉందని, బంద్ చేస్తామంటున్న పార్టీలు అక్కడ ఒత్తిడి తేవాలని అభిప్రాయపడ్డారు.... రాష్ట్రం అసలే నష్టపోయిందని, మళ్లీ బంద్‌లతో ఇబ్బందులు కల్పించే పరిస్థితి రాకూడదని అన్నారు....