నిన్న జగన్ విశాఖ పర్యటనలో భాగంగా ప్రజలు చాల ఇబ్బందులకులోనైన సంగతి తెలిసిందే. పోలిసుల ఓవరాక్షన్ వల్ల జనాలు గంటల తరబడి రోడ్ల మీదే ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. దాదాపుగా రెండు గంటలు తాఫిక్ ఆపటంతో, ప్రజలు తీవ్ర అసహనానికి లోనయ్యారు. మరికొంతమంది అయితే పోలీసులకు ఎదురుతిరిగి మాట్లాడారు. ఆ వీడియోలన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జగన్ వస్తే షాపులు అన్ని మూయించాల్సిన అవసరం ఏముందని, దారి పొడుగునా బారికేడ్లు కట్టాల్సిన పని ఏంటని, జనాలని అన్ని గంటల పాటు రోడ్ల మీద ఆపితే ఎలా నాయి కూడా జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయా, లేక పోలీసులే కావాలని ఇంత అతగా ప్రవర్తిస్తున్నారా అనేది కూడా తెలియాలి. సామాన్యంగా సియం సెక్యూరిటీ అంటే ప్రభుత్వమే చూస్తుంది కాబట్టి, ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన అదేశాలే అనుకోవాలి. అయితే నిన్న జగన్ విశాఖ వచ్చింది, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమానికో, లేక ఏదైనా పరిశ్రమ ఓపెనింగ్ కో అనుకుంటే, సరేలే రాష్ట్రం కోసం అని అడ్జెస్ట్ అవుతాం. ఇక్కడ జగన్ వచ్చింది ఏమో ఒక ప్రైవేటు కార్యక్రమానికి, శారదా పీఠంలో పర్సనల్ పూజలు చేయటానికి.
అయితే నిన్న జరిగిన పరిణామంతో, విశాఖ ప్రజలు మొత్తం ప్రభుత్వాన్ని తిట్టారు. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు ఈయన విశాఖలో వచ్చి కూర్చుంటే, అసలు మమ్మల్ని బయటకు కూడా రానివ్వరు ఏమో అని అభిప్రాయ పడుతున్నారు. విషయం పెద్దది అవ్వటం, ప్రజలు పోలీసులు మీద కూడా తిరగబడటంతో, ప్రభుత్వంలో చలనం వచ్చింది. అసలకే మోసం వస్తుందని భావించారు. అందుకే ప్రభుత్వం వైపు నుంచి మీడియాకు లీకలు ఇచ్చారు. అసలు నిన్న జరిగిన ఘటన జగన్ గారికి తెలియదు అని, విషయం తెలిసిన వెంటనే జగన్ గారు పోలీసులు పైన ఫైర్ అయ్యారని, అసలు ఎందుకు అలా జరిగింది, నా కోసం ట్రాఫిక్ ఆపటం ఏంటి అంటూ, ఫైర్ అయ్యి, విచారణ చేయమని డీజీపీని ఆదేశించారు అంటూ, మీడియాకు లీకులు ఇచ్చారు. తన కోసం ప్రజలను గంటలు గంటలు ఆపటం ఏమిటి, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టారు, ఇది ఇంకో సారి జరగకూడదు అంటూ, జగన్ ఫైర్ అయ్యి, ప్రజలకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని చెప్పినట్టు మీడియాకు చెప్పారు.