ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అరాచకాలు చేస్తుందంటూ రాజ్యసభలో తెలుగుదేశం ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ విరుచుకు పడ్డారు. ఆయన ప్రసంగిస్తూ మా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ,ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కల్పించుకోక పోతే తమ రాష్ట్రం ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అస్త వ్యస్త విధానాలతో ఎంతో నష్టపోయామని అన్నారు. అప్పులు మీద అప్పులు చేస్తూ, పన్నులు మీద పన్నులు వేస్తూ, నాశనం చేస్తున్నారని అన్నారు. చివరకు గవర్నర్ కు తెలియకుండా, గవర్నర్ పేరు ఉపయోగించి అప్పులు తీసుకుని వచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో అన్నీ తనఖా పెట్టేస్తున్నారని, అప్పులతో రాష్ట్రం నడుస్తుందని అన్నారు. సామాన్య ప్రజల మీదే కాకుండా సినిమా వాళ్ళ మీద కూడా ఈ జగన్ కక్ష్య పూరితంగా ప్రవర్తిస్తున్నారని కూడా విమర్శించారు. హీరో పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా అడుగడుగునా అడ్డు పడుతున్నారని కనకమేడల విమర్శించారు. సినిమాల విషయంలో కూడా కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళ్తున్నారని అన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ పైన కక్ష సాధింపు చేయటానికి మాత్రమే, ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని, ఎక్కడ చూసినా అవినీతే అని, ఇసుకలో, భూముల్లో, మద్యంలో, మైన్స్ లో ఇలా మొత్తం అవినీతిమయం చేసారని అన్నారు. చివరకు ఎప్పుడూ లేనిది రాష్ట్రంలో డ్రగ్స్ లాంటివి కూడా తీసుకుని వచ్చారని అన్నారు. గంజాయి క్యాపిటల్ అయ్యిందని అన్నారు. చివరిగా గుడివాడలో కాసినో లాంటి పెట్టి మా రాష్ట్ర పరువు తీస్తున్నారని, ఏకంగా ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మొత్తం వ్యవహారం నడుపుతున్నారు అంటూ, క్యాసినో గురించి కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఇంతలో వైసిపి ఎంపీలు, కల్పించుకుని ఆయనను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. కనకమేడల మాట్లాడుతున్నంత సేపు విజయసాయి రెడ్డి ,మిగతా MPలు అడ్డు పడుతూనే ఉన్నారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, తమ పాలనలోనే ప్రజలు హాపీ గా ఉన్నారని , చంద్రబాబు పాలన కంటే జగన్ పాలన చాలా రెట్లు నయమని అరుస్తూనే ఉన్నారు. కాని వాస్తవం ఏంటి అనేది ప్రజలకు తెలుసు కదా.