సమర్ధవంతమైన అధికారిగా, డీజీపీగా సేవలు అందించి రిటైర్డ్ అయిన నండూరి సాంబశివరావుని, ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలిపెట్టటం లేదు... రిటైర్డ్ అయినా సరే, ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం అని భావించి, ఆయనకు కొత్త పోస్ట్ ఇచ్చారు... విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా నండూరి సాంబశివరావ నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్ర డీజీపీగా ఆయన పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో డేరింగ్ పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, ఉత్తమ విలువలు, మానవతావాదికావడంతో ఆయనకు పోలీసులే కాకుండా ఇతర డిపార్టుమెంట్లలో పనిచేసే అధికారులు కూడా ఈనాకు అభిమానులుగా మారిపోయారు...
సాంబశివరావుకి, విశాఖకు ఎక్కువ అనుబంధం ఉంది. గతంలో ఇక్కడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. విశాఖలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసి పోలీసులు ప్రజల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించారు. అనంతరం ఆయన రాష్ట్ర ఆర్టీసీ ఎండిగా కూడా బాధ్యతలు చేపట్టి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేసారు. తరువాత ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగా రాష్ట్ర ప్రజలకి విశేష సేవలందించి ప్రభుత్వంచే మన్ననలు పొందారు. పదవీ విరమణ అనంతంర ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పడైనా తన సేవలను స్వీకరించవచ్చని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ఎలాంటి సేవలు చేసేందుకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లు తెలియజేసారు. గతంలో విశాఖతో ఏంటో అనుబంధం ఉన్న ఆయన తిరిగి విశాఖకు రావడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను గంగవరం పోర్టుకు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, ఆయన శ్రేయోభిలాషలు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే చంద్రబాబు సాంబశివరావుని, సమాచార హక్కు కమీషనర్ గా నియమిస్తారు అనే వార్తలు వచ్చాయి... దానికి ప్రతిపక్ష నేత జగన్ కూడా వచ్చి, ప్రభుత్వంతో చర్చించాలి... అయితే జగన్ మాత్రం ఇప్పటికి రెండు సార్లు ఆ మీటింగ్ కి రాలేదు... ఈ నేపద్యలో అది తేలే వ్యవహారంలాగా లేదు అని భావించి, చంద్రబాబు, ఈయనను గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా నియమించారు.