గవర్నర్‌ నరసింహన్‌ పై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. అటు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీజేపీ ఎమ్మల్యే విష్ణు కుమార్ రాజు, ఈ గవర్నర్ మాకు వద్దు అంటూ దండం పెడుతున్నారు... గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణా పక్షపాతి అని, కెసిఆర్ ఏమి చెప్తే అది వింటారు అనే ప్రచారం ఉంది... తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన నాలా బిల్, గవర్నర్ తిప్పి పంపారు... నాలా అంటే, అగ్రికల్చర్‌ టు నాన్‌ అగ్రికల్చర్‌ కన్వర్షన్‌... వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మళ్లించే చట్టం... పరిశ్రమలకు భూములు అవసరం అయిన నేపధ్యంలో ఈ బిల్ చాలా అవసరం... ఈ భూమి మార్పిడి ఫీజు తగ్గింపు, ఇతర కీలక సవరణలపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లు పై రాజముద్ర వేసేందుకు గవర్నర్‌ నిరాకరించారు. తిప్పి పంపిస్తూ, క్లారిటీ కావలి అని చంద్రబాబుకి లెటర్ రాసారు..

govermer 11012018 2

గతంలో ఇదే అంశంపై సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కూడా గవర్నర్‌ ఆమోదించలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపైనా పాత అభ్యంతరాలే లేవనెత్తి... తిరుగుటపాలో పంపించారు. అయితే గవర్నర్‌ కు రూల్స్‌లోనే అన్నీ చెబుతామంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... గవర్నర్‌ అభ్యంతరాలపై వెంటనే వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి రెవెన్యూశాఖను ఆదేశించారు... గత ఏడాది జూన్‌లో ఆర్డినెన్స్‌ తయారు చేసి గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. ఆర్డినెన్స్‌లోని అంశాలు అసంబద్ధంగా, అస్పష్టంగా ఉన్నాయంటూ గవర్నర్‌ అనేక అభ్యంతరాలను లేవనెత్తారు... ర్డినెన్స్‌ను ఆమోదించలేదు..

govermer 11012018 3

ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ భూమి చట్టం-2016 సవరణ బిల్లును ఆమోదించింది. ఆర్డినెన్స్‌లో పొందుపరిచిన అంశాలే ఈ బిల్లులోనూ ఉన్నాయి. ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన తర్వాత... డిసెంబర్‌ మొదటి వారంలో గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. దీనినీ గవర్నర్‌ తిప్పిపంపించారు. అయితే ఇదే రకమైన తెలంగాణా బిల్ గవర్నర్ ఆమోదించారు అని, ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి, ఈ వివక్ష మంచిది కాదు అని విష్ణు కుమార్ రాజు అంటున్నారు... మరి ఇప్పుడు ప్రభుత్వం పంపించే వివరణతో గవర్నర్ ఏకీభవిస్తారో, లేక అడ్డు పుల్ల వేస్తారో చూడాలి...

వీర్రాజు గుర్తున్నాడా ? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అన్నాడు... ఈయన అమిత్ షా కోటింగ్ కు అండర్ గ్రౌండ్ ఒకి వెళ్ళాడు... ఇప్పుడు ఈయన స్థానం బర్తీ చెయ్యటానికి ఇంకో ఆయన వచ్చాడు... ఈయన ఏకంగా, రాష్ట్రాన్ని కట్ చేస్తా అంటున్నాడు... నేను మగాడినై అందరి అంతు చూస్తా అంటున్నాడు... ఆయనే మాణిక్యాలరావు...ఇంతకీ ఎవరు ఈ మాణిక్యాలరావు అంటారా ? ఈయన ఆంధ్రప్రదేశ్ లో ఒక మంత్రి... బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మల్యే... చంద్రబాబుకి అలవాటే కదా, ఎదురు పదవులు ఇచ్చి తిట్టించుకోవటం... ఈ కోవలకే ఈయన కూడా... చంద్రబాబు మంత్రి మండలిలో ఉంటూ, మంత్రిగా పని చేస్తూ, ప్రభుత్వాన్ని తిడతారు... సరే ప్రభుత్వాన్ని అంటే, రాజకీయం... ఎవరైనా ప్రభుత్వాన్ని నిందించవచ్చు... కాని ఈయన మాత్రం, ఆంధ్ర రాష్ట్రాన్ని కట్ చేస్తాడు అంట... వీళ్ళు చేసుకునే రాజకీయాలకి, రాష్ట్రం పరువు తీస్తున్నారు... రాష్ట్రం జోలికి వస్తే, నవ్యాంధ్ర ప్రజలు మీకే కట్ చేస్తారు మాణిక్యాలరావు గారు...

manikyalarao 11012018 2

చూడటానికి ఎంతో డీసెంట్ గా ఉండే ఈయన, పక్కన ఆడవాళ్ళను పెట్టుకుని ఏమి వాగాడో తెలుసా.... "గుXX మీద తంతారు" అంటున్నాడు... మగాడినై రెచ్చిపోతా అంటున్నారు... ఇవన్నీ ఒక మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం సిగ్గు చేటు... మొన్న గజల్ శ్రీనివాస్ ఉత్తముడు అని బిరుదు ఇచ్చి, తెల్లారినాక సారీ చెప్పూరు... ఇప్పుడు కూడా, తన స్థాయి మరిచి మాట్లాడిన మాటలకు మంత్రి గారు క్షమాపణ చెప్తారేమో చూద్దాం... అయినా, రాజకీయాల్లో సవా లక్ష ఉంటాయి... అక్కడ లోకల్ గా ఉండే వారి మీద ఈయన వ్యాఖ్యలు చేసుకోవాలి... ఈయన ప్రభుత్వం నడిపే దాంట్లో ఒక్కడిని అని మర్చిపోయి ప్రభుత్వాన్ని నిందిస్తారు... ఆంధ్రప్రదేశ్ ని కట్ చేస్తా అంటారు... ఏంటి ఇది ? ఇప్పటికే కట్ చేసింది చాలు... కిందా మీద పడి, పైకి లేవటానికి నానా చావు చస్తున్నాం... ఇంకేమి కట్ చేస్తారు సార్...

manikyalarao 11012018 3

అసలు విషయం ఏంటి అంటే, నిన్న తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం జన్మభూమి గ్రామసభ జరిగింది. జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుతో మంత్రికి రాజకీయ వైరం ఉంది... వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మంత్రి నిగ్రహం కోల్పోయి మాట్లాడారు. "నన్ను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా. నన్ను కట్‌ చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్‌ చేస్తా.. చాలా స్పష్టంగా చెబుతున్నా, సహనానికి హద్దులు ఉంటాయి.. కచ్చితంగా కుక్కకాటుకు చెప్పు దెబ్బ ఉంటుంది" అని అన్నారు. బాపిరాజు వర్గం, నాకు అవమానం చేస్తుంది అని మంత్రి అన్నారు... అయితే బాపిరాజు మాట్లాడుతూ, నేను ఏమి చెయ్యలేదు అని,మంత్రి అపోహపడుతున్నారు. ఏదేమైనా, ఈ రాజకీయ గొడవలో, రాష్ట్రాన్ని అవమాన పరచటం ఎవరూ సహించారు... మంత్రి గారు, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి...

చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారా ? దేశంలోనే ఇప్పటి వరకు ఎవరూ తీసుకోని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోనున్నారా ? ఈ డెసిషన్ తీసుకుంటే, ప్రజా ప్రతినిధులు ఊరుకుంటారా ? ఇంతకీ ఆ సాహసోపేతమైన నిర్ణయం ఏంటి అనుకుంటున్నారా ? ఇది సాక్షాత్తు మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పిన విషయం... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని చట్టం తెస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ. కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబాబు కూడా దీనిపై చర్చించారని ఆమె చెప్పారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్‌ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

cbn 10012018 1 1

మంత్రి, అఖిల ప్రియ ఈ విషయం బహిరంగ సమావేశంలో చెప్పి నిజంగానే సంచలనం సృష్టించారు అని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జి.ఒ.ను విడుదల చేయబోతున్నారని, ప్రజా ప్రతినిధులు తమ పిల్లలు చదువు కోసం ఇక ప్రభుత్వ పాఠశాలకు పంపించాలనే నిబంధన తీసుకువస్తున్నాం అని చెప్పారు... నిజానికి ఇది కనుక అమలు చేస్తే, ఇది సంచలనాత్మక నిర్ణయం అవుతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఒక సెన్సేషన్ అవుతుంది... ప్రభుత్వ స్కూల్స్ అంటే, పేదలు చదువుకునే స్కూల్ మాత్రమే అనే భావన ప్రజల్లో ఉంది... పేదలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా, ప్రైవేటు స్కూల్స్ లో చదివిస్తున్న పరిస్థితి..

cbn 10012018 1 1

అయితే ఈ నిర్ణయం పై ప్రజా ప్రతినిధులు ఎలా స్పందిస్తారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంసం అయ్యింది.... తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ కి పంపించటానికి, వీరు ఒప్పుకుంటారా ? చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయం అమలు కాకుండా చేస్తారా ? లేక చంద్రబాబు అనుకున్నది చేస్తారా ? ఇలా అమలు అయితే చంద్రబాబు సొంత మనవడు కూడా ఇలాగే గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది... ఇప్పుడు ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ తయారు చేస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సుదీర్ఘ కాలం తరువాత, ప్రధాని మోడీతో భేటీ కానున్న సంగతి తెలిసిందే... ఈ నెల 12న మొదట అనుకున్నా, సంక్రాంతి పండుగ హడావిడి నేపధ్యలో, భేటీ 17వ తేదీకి వాయిదా పడింది... అయితే ఈ లోపు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది... ప్రధానితో భేటీకి ముందే చంద్రబాబు అన్ని విషయాల మీద క్లారిటీ తీసుకుంటున్నారు... ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి చంద్రబాబు లేఖ రాసారు... ప్రత్యేక ప్యాకేజీ, ఈఏపీ కింద రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల గురించి లేఖలో ఆయన పేర్కొన్నారు.

modi 10012018 2

ఈఏపీ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు వెంటనే ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరు ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా రూ.16725 కోట్లు ఇవ్వాలని, రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాల నిర్మాణానికి రూ.3341 కోట్లు.. అమరావతి గ్రీనింగ్ డెవలప్‌మెంట్‌కు రూ.1484 కోట్లు.. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రోడ్ల నిర్మాణానికి 3200 కోట్లు.. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1000 కోట్లు.. రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.3200 కోట్లు.. పట్టణ నీటి సరఫరాకు రూ.4500 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు లేఖలో కోరారు.

modi 10012018 3

అయితే ఇవన్నీ చంద్రబాబు వ్యూహాత్మకంగా చేస్తున్నారు... ప్రధానితో భేటీకి ముందే కేంద్రానికి అన్ని విషయాల పై క్లారిటీ ఇస్తున్నారు... మీరు మాకు ఇది ఇస్తాం అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు అని చెప్తున్నారు... అలాగే ఇప్పటికే పోలవరం పై, రైల్వే ప్రాజెక్ట్ ల పై కూడా కేంద్రానికి క్లారిటీ ఇచ్చారు... ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ప్రధాని ముందు పెట్టనున్నారు చంద్రబాబు... ప్రధానితో భేటికి ముందే అన్ని విషయాలు కేంద్రానికి చెప్తే, ప్రధాని కార్యాలయానికి కూడా సంపూర్ణ సమాచారం ఉంటుంది అని, తద్వారా ప్రధానితో మీటింగ్ సమయంలో అన్ని విషయాల మీద అవగాహనతో ఉంటారు అనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది.. ముఖ్యమంత్రి కృషి ఎంత వరకు ఫలిస్తుందో, కేంద్రం ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read