ముఖ్యమంత్రి పదవి కోసం పాదయాత్ర చేస్తున్న జగన్, ఇవాళ పాదయాత్రకు ఎర్లీ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చిన వెంటనే, రోడ్డు మార్గలో బెంగళూరు బయల్దేరి వెళ్లారు.. వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి నేటి యాత్రను ప్రారంభించిన జగన్ తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. కాసేపటి క్రితం ఆయన పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఈ రోజు జగన్ ఎర్లీ బ్రేక్ ఇచ్చారు.
దీంతో అక్కడి నుంచి జగన్ నేరుగా బెంగళూరుకు బయల్దేరారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో రేపు (శుక్రవారం) సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. ఈనాటి 46వ రోజు పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆయన యాత్ర 5.1 కిలోమీటర్ల మేర సాగింది. అయితే జగన్ ముందుగా బెంగళూరులోని తన ప్యాలస్ కు వెళ్లి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని, అక్కడ నుంచి రాత్రికి ఎయిర్ పోర్ట్ కు వెళ్లి, హైదరాబాద్ వెళ్లనున్నారు.
రేపు ఉదయం అక్రమంగా ఆస్తులు వెనకేసుకున్న కేసులో ప్రతి శుక్రవారం కోర్ట్ కి రావాలి... 11 కేసుల్లో A1గా ఉన్న జగన్, బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారం ఇప్పటికే జగన్ ఒక రోజు పాదయత్రకు సెలవు పెట్టారు. క్రిస్మస్ పండుగకు సెలవు పెట్టారు... మూడు రోజుల్లో తిరగకుండానే మరో వీకెండ్ సెలవు పెట్టి బెంగుళూరు ప్యాలస్ కు, అక్కడ నుంచి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ బంగాళాకు చేరుకొని, రేపు సిబిఐ కోర్ట్ లో హాజారు కానున్నారు. ఒక పక్క బెయిల్ మీద బయట తిరుగుతూ, ప్రతి వారం కోర్ట్ కి వెళ్తూ, రోజుకి ఒక అంతర్జాతీయ నిఘా సంస్థలో అక్రమాలు చేసాడని పేరు తెచ్చుకుంటూ, ఈయన అవినీతి మీద పోరాటం చేస్తాను అనటం, అన్నిటికి అంటే హైలైట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...