వైస్ జగన్ పాదయత్ర జరుగుతున్న విషయం తెలిసిందే... అయితే అది పాదయత్ర లేక ముద్దుల యాత్ర అనే విమర్శలు కూడా వస్తున్నాయి... దానికి తోడూ జగన్ కూడా అలాగే, కనిపించిన ప్రతి వారికి ముద్దులు పెడుతూ, ముందుకు పోతున్నారు. జగన్ అనంతపురం పాదయాత్రలో ఇలాంటే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగన్ కదిరి నియోజకవర్గంలోని, ఎన్పీకుంట మండలంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ అనూహ్య ఘటన జరిగింది. జగన్ పాదయాత్ర సాగుతున్న వేళ, ఓ మహిళ ఉన్నట్లుండి జగన్ మీదకు దూకడం సెక్యూరిటీ వర్గాలను కలవరపెట్టింది. జగన్ ను ముద్దాడేందుకు ఓ మహిళ సెక్యూరిటీ వలయాన్ని చేధించుకుని మరి దూకేందుకు ప్రయత్నించింది. సెక్యూరిటీ వలయాన్ని చేధించుకుని ఒక్కసారిగా దూకడంతో జగన్ సిబ్బంది ఆమెని జగన్ కు ముద్దు పెట్టకుండా ఆపారు.

jagan 29122017 1

అయితే జగన్ మాత్రం ముందు ఏమి జరుగుతుందో అర్ధం కాక, ఖంగారు పడినా, తేరుకుని, ఆ మహిళ ఉత్సాహాన్ని గమనించిన జగన్ సిబ్బందిని వారించాడు. ఆ మహిళని విడచి పెట్టాలని కోరాడు. ఆమెను దగ్గరకు తీసుకుని యధావిధిగా తన ట్రేడ్ మార్క్ ఓదార్పు స్టైల్లో నుదుటి మీద ముద్దాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎక్కడైనా సెలబ్రిటీలు, అందులోనూ రాజకీయ నాయకులతో అయితే, వారిని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వటానికో, లేకపోతే ఫోటో దిగటానికి ఉత్సాహపరుస్తునారు. కాని, జగన్ కు మాత్రం, ఆయన నుంచి తన ట్రేడ్ మార్క్ ఓదార్పు స్టైల్లో ముద్దు కోసం, ఆయన అభిమానులు ఉత్సాహం చూపుతూ ఉంటారు.

jagan 29122017 1

అయితే వీటి పై సొంత పార్టీ మహిళా కార్యకర్తలే జగన్ ను పలు సందర్భాల్లో అలా చెయ్యటం తప్పు అని చెప్పారు... హిందూ ధర్మం ప్రకారం పెళ్లి అయినా తరువాత మహిళలు పరాయి పురుషుని పక్కన కూర్చోవడానికి ఆలోసిస్తారు... ఇలాంటి ముద్దుల సంస్కృతి రాజాకీయాల్లో ఎప్పుడూ లేదు... వృద్దులు, మహిళలు, అమ్మాయిలకు 'ముద్దుల"తో కొత్త "విదేశీ సంస్కృతి" కి "వైస్ జగన్" తెర తీసారు అని, అలా చెయ్యకుండా వీలైనంత వరకు వారికి shake hand ఇవ్వండి.. కాని ముద్దులు పెట్టకండి.. ముద్దులు పెట్టటం అనేది బాబాలు, మత ప్రబోధకులు.. చేసే పని.. మీరు చెయ్యటం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాది." అంటూ జగన్ కు వాళ్ళ పార్టీ అభిమానులే ట్వీట్ చేశారు.

గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భారతీయ ఆర్థిక సంఘం (ఐఈఏ) శతవార్షిక సదస్సు రెండో రోజున ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడిగా పని చేసిన కౌశిక్‌ బసు పాల్గున్నారు. సదస్సులో ఆయన ప్రసంగించారు. తాను ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి అనుభావాలను కౌశిక్‌ బసు వివరించారు. కేవలం ఇద్దరు రాజకీయ నాయకులు మాత్రమే తనతో దేశ ఆర్థికాంశాలపై నిస్వార్థంగా చర్చించేవారని.. వారిలో ఒకరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. మరొకరు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ అని తెలిపారు.

koushik 29122017 2

రాజకీయ నేతలు రాజకీయాలే మాట్లాడతారని.. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచిస్తారని, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆయనతో పలుసార్లు సమావేశమయ్యానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై భరోసా వ్యక్తం చేసిన ఆయన, ఆర్థిక సంస్కరణల అమలు విషయాలపై ఆలోచించే అతికొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరని ప్రశంసించారు. కొత్త రాష్ట్రంగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీ, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతోందని కితాబిచ్చారు. న్యూయార్క్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లీషు భాష మాట్లాడే వారి తర్వాత తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అన్నారు

koushik 29122017 3

ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ, దీని వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు తగ్గిందని, నోట్ల రద్దు ఇప్పటికీ సామాన్యులపై ప్రభావం చూపుతోందన్నారు. ఉగ్రవాదులు నకిలీ నోట్లను వ్యవస్థలోకి తీసుకొస్తే వాటిని ఏరివేయాలే తప్ప.. మొత్తం నోట్లన్నీ మార్చేయాలనుకోవడం తప్పని.. ఈ నిర్ణయంతో ఆ నోట్లు కూడా ప్రధాన స్రవంతిలోకి వచ్చాయని చెప్పారు. ఈ త్రైమాసికం తర్వాత నోట్ల రద్దు ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ గురించి ప్రస్తావిస్తూ..ఇది దేశానికి అవసరమే కానీ, అమలు తీరు సక్రమంగా లేదని విమర్శించారు.

గత మూడున్నరే కాలంలో ఆంధ్రప్రదేశ్‌ని, సీఎం చంద్రబాబును ప్రశంసించని జాతీయ ప్రముఖులు లేరు. డిజిటల్ విప్లవం అని అందరూ మాటల దగ్గరే ఉంది పొతే, మన ముఖ్యమంత్రి చేతలతో చూపించి, ప్రపంచానికి చూపిస్తున్నారు. టెక్నాలజీ వాడకంలో మిగిలిన సీఎంల కన్నా ముందు ఉండే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పరిపాలనలో పారదర్శకత పెంచేలా టెక్నాలిజిని వాడుకుంటున్నారు అంటూ రాష్ట్రపతి, నేషనల్ మీడియా, ప్రముఖులు అందరు ట్విట్టర్ లో చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగిస్తున్న తీరుని మోత మోగిస్తున్నారు. నార్త్ ఇండియాలో ఉన్న వారితో పాటు, తమిళనాడు, కర్ణాటక వారు కూడా సోషల్ మీడియాలో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

cbn 28122017 2

పరిపాలనలో టెక్నాలజీ వాడుకోవడం ఎలా… వాడితే ఎలాంటి లాభాలుంటాయ్ అనే విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. డాష్ బోర్డ్ నుంచి వర్చువల్ రివ్యూ వరకూ... రియల్ టైం గవర్నెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్... అంతే ఇవన్నీ చూస్తున్న ఫైనాన్షియల్ ఎక్ష్ప్రెస్స్ లాతని నేషనల్ మీడియా కూడా ఆశ్చర్యంతో చూస్తున్నాయి. టెక్నాలజీని ప్రేమించడం వేరు… ఉపయోగించడం వేరు…అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వేరు. ఈమూడింటినీ కలగలిపి ప్రపంచానికి చూపిస్తున్నారు చంద్రబాబు...

cbn 28122017 3

అప్పటి మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్‌ దగ్గర నుంచి, ఇవాల్టి ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రియల్ టైం గవర్నెన్స్, కోర్ డాష్ బోర్డు ఫైబర్ నెట్, దాకా చంద్రబాబు టెక్నాలజీని వాడుకుంటూ పాలనలో తీసుకు వస్తున్న సంస్కరణలు చూసి ముచ్చట పడిన వారే. అందుకే చంద్రబాబు అనగానే హైటెక్ బాబు అనే పేరు అందరి మదిలో మెదలడం ఖాయం. చంద్రబాబు పరిపాలనలో ప్రత్యేకత అదే... అభివృద్ధిలో టెక్నాలజీ హంగులు ఉపయోగించడం కేవలం బాబుకే చెల్లింది... చంద్రబాబు సుందరవదనారవిందం చూసి పరిశ్రమలు రావని నోటికొచ్చిన కూతలు కూసిన అవినీతి యువసామ్రాట్‌ దీనికి నీ బదులేంటి?

ఒక పక్క పార్లమెంట్ లో ఉమ్మడి హైకోర్టు విభజన అంశంపై రెండు రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు గోల గోల చేస్తున్నారు. ఇవాళ కేంద్రం దీని పై సమాధానమిస్తూ, హై కోర్ట్ ఏర్పాటుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అని చెప్పింది. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అని, తొందరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని కేంద్రం సమాధానం ఇచ్చింది. దానికి తెరాసా ఎంపీలు చంద్రబాబుకి ధన్యవాదులు చెప్తూ, జడ్జీల నియమాకాలు చేపట్టవద్దు అని కేంద్రాన్ని కోరారు. ఇంతలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మైక్ అందుకున్నారు... హైకోర్ట్ ఒక్కటేనా ? మిగతా ఉమ్మడి ఆస్తులు సంగతి ఏంటి ?

sujana 28122017 2

విభజన హామీలో మిగతా వాటి సంగతి ఏంటి అని గళమెత్తారు... అంతే కాదు, స్పెషల్ స్టేటస్, ప్యాకేజ్, అమరావతికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, నియోజకవర్గాల పెంపు, ఇతర హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. పీకి ఇచ్చిన విభజన హామీలు చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన పార్లమెంట్‌లో ప్రస్తావించారు. విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన హామీలు అంటే హైకోర్ట్ విభజన ఒక్కటేనా అంటూ కేంద్రాన్ని వైస్ చౌదరి నిలదీశారు...

sujana 28122017 3

ఈ సందర్భంలో స్పీకర్ మధ్యలో కలిపించుకుని, మీరు కేంద్ర మంత్రి అనే సంగతి గుర్తుపెట్టుకోండి, కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడండి అని అన్నారు. అవును.. నాకు గుర్తింది... నేను కేంద్ర మంత్రి హోదాలోనే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వివరిస్తున్నా అన్నారు.... విషయం చెయ్యి దాటుతుంది అనుకున్నారో ఏమో, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలగచేసుకున్నారు. విభజన సమస్యలు ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలన్నారు. అవసరమైతే కేంద్రం సహాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ తప్పుకుండా నెరవేర్చుతామని రొటీన్ డైలాగ్ చెప్పారు. హైకోర్టు అంశం మాత్రం సుప్రీంకోర్టు చూసుకుంటుందన్నారు. అయితే, కేంద్ర మంత్రిగా ఉంటూ సుజనా చౌదరి ధిక్కార స్వరం వినిపించటం చూస్తుంటే, కేంద్రంతో రాష్ట్రానికి గ్యాప్ పెరుగుతుంది అనే విషయం స్పష్టమవుతుంది...

Advertisements

Latest Articles

Most Read