చంద్రబాబుని రాజకీయంగా ఎలా అయినా దెబ్బ కొట్టి, తన పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నాడు వైఎస్ జగన్... అనుకున్నట్టుగానే ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్లాన్ చేశాడు... ప్లాన్ అయితే చేసి రంగంలోకి దిగాడు కాని, ఎప్పటిలాగే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు... చంద్రబాబుని కోలుకోలేని దెబ్బ తియ్యాలి అనుకుని, చంద్రబాబు సొంత జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపాడు జగన్... దీని కోసం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దింపారు... ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారం, పక్కగా నడిపించారు, కాని చివరకు ఆపరేషన్ ఆకర్ష్‌కు వికటించింది... ఎప్పటిలాగే జగన్ ఇక్కడ కూడా దొరికిపోయి అభాసుపాలయ్యాడు..
చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్‌రెడ్డికు వైసీపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది... టీడీపీని వీడి వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా వర్తమానం పంపింది. జీవీ శ్రీనాధ్ రెడ్డి ఇంటికి స్వయంగా పెద్దిరెడ్డి వెళ్లారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ చేస్తామని, జీవీ కుటుంబ టెండర్లకు తమ వర్గం అడ్డురాదని అన్నారు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయనతో గంటన్నరపాటు ఏకాంతంగా మాట్లాడారు. శ్రీనాధ్ రెడ్డి ఏ నిర్ణయం చెప్పకపోయినా, ఆయన తమ పార్టీలోకి వచ్చేసినట్టుగానే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారం హడావుడి చేసింది.
శ్రీనాథ్ రెడ్డిని పెద్దిరెడ్డి కలిసిన మరుసటి రోజు ఉదయం నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నాటకీయంగా పూల బొకేలు, కేకులు తీసుకొని గంటగంటకు కొందరు వంతున శ్రీనాథ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను కలిసి హడావుడి చేశారు. ఏదో జరుగుతందనే సంకేతం వచ్చేలా చేయడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఇదంతా కేవలం మైండ్ గేమ్‌లో భాగమేనని టీడీపీని వీడే ప్రసక్తే లేదని ప్రాణం ఉన్నంత వరకూ ఇదే పార్టీలో కొనసాగుతానని శ్రీనాథ్ రెడ్డి తేల్చిచెప్పారు. సీఎం చంద్రబాబుకు శ్రీనాథ్‌రెడ్డి కుడి భుజం లాంటివారని చిత్తూరు జిల్లాలో టీడీపీ బలపడుతోందనే వైసీపీ ఇలా మైండ్‌గేమ్ ఆడుతోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి, ముఖ్యమంత్రికే ఝలక్ ఇద్దాం అనుకుని, బొక్క బోర్లా పడ్డాడు జగన్...