హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్టహాసంగా జరుగుతున్న తెలుగు సభలకు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖులను ఆహ్వానించినా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందలేదు. దీనిపై పలువురు మండిపడ్డారు కూడా... ఎన్ని విమర్శలు వచ్చినా కెసిఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలవటానికి ఇష్టపడలేదు... అయితే ఈ విషయంపై చంద్రబాబునాయుడు స్పందించారు.

cbn 16122017 1

తెలుగువారంతా కలిసి ఉండాలని... తెలుగు భాష బాగుండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో మూడు రోజులుగా దళిత నేతలకు జరుగుతున్న శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన శుక్రవారం రాత్రి హాజరయ్యారు. అక్కడే మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సభలకు మిమ్మల్ని పిలవలేదు కదా! మీ కామెంట్‌ ఏమిటి?’’ అని ఓ విలేఖరి ప్రశ్నించగా...

cbn 16122017 1

‘‘నన్ను పిలవకపోయినా ఫర్వాలేదు. తెలుగువారం ఎక్కడ ఉన్నా మన భాషను గౌరవించుకోవాలి. భాషను కాపాడుకోవాలి. తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతుంది. తెలుగువారంతా కలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష. ఎవరు ఎక్కడ ఉన్నా మనమంతా తెలుగు వారమన్న స్ఫూర్తి పోకూడదు’ అని చంద్రబాబు బదులిచ్చారు. కెసిఆర్ ఎంతగా అవమానించాలి అని చూసినా, చంద్రబాబు మాత్రం చాలా హుందాగా, వివాదాలకు తావు లేకుండా, ఒక స్టేట్స్ మెన్ లా స్పందించి, అందరి మన్ననలు అందుకున్నారు...

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద మీరు చేస్తున్న పని మంచిదే... తెలుగు మహాసభలు అని చెప్పగానే, సరిహద్దులకు అతీతంగా తెలుగువారందరూ పాల్గొనేలా చేసి రాష్ట్రాలుగా విడిపోయినా.. జాతిగా, సాంస్కృతికంగా కలిసే ఉన్నాం అన్న స్పృహను కల్పిస్తారు అని అందరం భావించాం... సరే, మీ రాజకీయ ప్రయోజనం కోసం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఎప్పుడూ చిన్న చూపు చూస్తేనే మీకు మనుగడ అని అందరికీ తెలిసిందే... కాని, మీరు ప్రపంచ తెలుగు మహాసభలలో, మీరు గతంలో చేసిన ఈ మూడు పనులకు క్షమాపణ చెప్పి, ఏమైనా చేసుకోండి... అప్పుడు మీకు గౌరవం పెరుగుతుంది...

kcr telugu 15122017 1

మీరు తెలంగాణా ఉద్యమాలు చేస్తున్న రోజుల్లో, మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అక్షపనీయం.. ఒక్కసారి ఈ వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకుని, మీకు ఇవాళ తెలుగు మహాసభలు నిర్వహించే అర్హత ఉందేమో ఆలోచించండి... తెలుగు తల్లి కాదు, దెయ్యం అని అన్నారు గుర్తుందా? తెలుగు తల్లి ఎవరికి తల్లి అన్నారు, గుర్తుందా? మా భాష వేరు అన్నారు గుర్తుందా? అసలు తెలుగు తల్లి మాకు తల్లే కాదు.. తెలంగాణా తల్లి అంటూ వేరే విగ్రహం తయారు చేసుకున్నారు గుర్తుందా ? మరి ఇప్పుడు ఈ తెలుగు భాష ఎవరిదీ? మరి మీరు ఆ తెలుగు తల్లికి క్షమాపణ చెప్పకుండా, ఎలా ఈ మహాసభలునిర్వహిస్తారు ?

kcr telugu 15122017 1

రెండవది... "మా తెలుగు తల్లి మల్లెపూవు దండ" గీతం ఎవరి కోసం ? ఆ పాట మేము ఎందుకు పాడాలి ? ఆ గేయాన్ని ఎవరూ పాడవద్దు... స్కూల్ పుస్తకాల్లో ఈ గేయం ఉన్న పేజీలు చింపివెయ్యాలి అన్నారు గుర్తుందా ? మరి ఇప్పుడు ఈ తెలుగు భాష ఎవరిది ? మూడవది... తెలుగు భాషకు 56 అక్షరాలు ఉన్నాయి... మా తెలంగాణా భాషకు 31 అక్షరాలు అవసరం లేదు, మాకు 25 అక్షరాలు చాలు అని, తెలుగు భాషని అవమానించలేదా ? మరి ఇప్పుడు ఈ తెలుగు భాష ఎవరిదీ ? మీరు గతంలో చేసిన ఈ మూడు పనులకు క్షమాపణ చెప్పండి కెసిఆర్ గారూ, అప్పుడే తెలుగు అనే పదానికి మీరు ఏమి చేసినా సార్ధకత ఉంటుంది...

నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయడానికి సుముఖంగా ఉన్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్రం తెలియజేసిన సంగతి తెలిసిందే. అలా ప్రత్యేక కోర్టులు ఏర్పడి ప్రజాప్రతినిథుల నేరాల విచారణ జరిగితే, ఇప్పటికే ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్లి సంతకం పెడుతున్న ప్రతిపక్షనాయకుడు జగన్, పరిస్థితి వర్ణనాతీతం.... సుప్రీం కోర్ట్ నిర్ణయంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మార్చి లోపు ఏర్పాటు చెయ్యక తప్పదు... క్రిమినల్ కేసులు ఉన్న చట్టసభల సభ్యులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ తప్పించుకోవాలంటే చట్టసభలకి రాజీనామా చెయ్యక తప్పదు. దేశ వ్యాప్తంగా ఉన్న కేసులు ఉన్న నాయకులు ఇదే ఆలోచనతో ఉన్నారు...

jagan court 15122017 2

దేశంలో కేసులు ఉన్న ప్రజా ప్రతినిదుల్లో అందరిలో కంటే, జగన్ మీద ఉన్న కేసులు, జగన్ మీద ఉన్న అవినీతి అభియోగాలు ఎక్కువ... అందుకే జగన్ కూడా, ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చెయ్యక తప్పదు అంటున్నారు... జగన్ కూడా రాజీనామా ఆలోచన చేస్తున్నాడు అని, అయితే తను ఒక్కడే రాజీనామా చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి, ఎదో ఒక భావోద్వేగ అంశం ముడిపెట్టి తన పార్టీలో ఉన్న ఎమ్మల్యేలు, ఎంపిలు అందరితో రాజీనామాలు చేపించే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం... జగన్ తో పాటు, విజయసాయిరెడ్డికి కూడా ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుంది... ఎందుకు అంటే, జగన్ A1 అయితే, విజయసాయి A2..

jagan court 15122017 3

సిబిఐ కేసుల విచారణ, ఎన్నికల వరకు ఎదో ఒక విధంగా, వివిధ మార్గాల్లో లేట్ చెయ్యటానికి జగన్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాడు... అనుకోకుండా, సుప్రీమ్ ఈ నిర్ణయం ప్రకటించటంతో జగన షాక్ అయ్యాడు... ఎందుకు అంటే, ఇక్కడ ఏ ఒత్తిడులు పని చెయ్యవు... అందుకే రాజీనామా ప్లాన్ వేస్తున్నాడు జగన్... రాజీనామా చేస్తే, తాను ప్రజా ప్రతినిధి కిందకు రాను అని, అప్పుడు సుప్రీమ్ చెప్పిన విధానం తనకు వర్తించదు అని జగన్ ఆలోచన... ఇక్కడ జగన్ ఆలోచిస్తుంది మాత్రం ఒకటి ఉంది... రాజీనామా చేస్తే, స్పీకర్ ఆమోదిస్తారా లేదా అని... స్పీకర్ ఆమోదించకపోతే ఇరుక్కుంటాం అని జగన్ ఆలోచన.. దీని మీద, మరో 15-20 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.. ఈ లోపు ఎదో ఒక అంశం, హాట్ టాపిక్ చేసి, దాన్ని సాకుగా చూపి, రాజీనామాలు చెయ్యాలని అనే ఆలోచనలో ఉన్నారు...

గోదావరి-పెన్నా అనుసంధానానికి ముందడుగు పడింది. 320 టీఎంసీల గోదావరి మిగులు జలాలను పెన్నాకు తరలించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి లైడార్, హైడ్రోగ్రాఫిక్ సర్వే పూర్తికాగా, జియోటెక్నికల్ అధ్యయనం ముగింపుదశకు వచ్చింది.గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు-సాగు నీరు, పరిశ్రమలకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పథకం పూర్తయితే ఆరు జిల్లాల్లోని పట్టణాలకు, గ్రామాల్లోని చెరువులకు, ఇతర రిజర్వాయర్లకు గోదావరి మిగులు జలాలు తరలించేందుకు వీలు కలుగుతుంది.

cbn penna 15122017 2

గోదావరి-పెన్నా సంగమ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకువాప్‌కాస్ లిమిటెడ్(WAPCOS)నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు పూర్తికావడానికి సుమారురూ. 80 వేల కోట్ల వ్యయం కానుందని, 320 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా తరలించేందుకు 3,625 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ‘వాప్‌కాస్’ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.ఈ మహత్తర పథకం పూర్తికావాలంటే32 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి వుందని, ఇందులో 7 వేల ఎకరాల అటవీ భూమి వుందని తెలిపారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ మధ్యలో రెండు సొరంగాలు తవ్వాలని, బొల్లపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రికి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి సంగం బ్యారేజ్ వరకు 701 కి.మీ. మేర కాలువలు నిర్మించాల్సి వుంటుందని చెప్పారు.

cbn penna 15122017 3

వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కొమ్మమూరు కాలువ మీదుగా పెదగంజాంకు,అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు,ఆ తర్వాత సంగం బ్యారేజ్‌కు తరలించడంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.సత్వర ఫలితాలు సాధించేలా దశలవారీగా గోదావరి-పెన్నా అనుసంధానం పూర్తి చేయాలని, కాలువల నిర్మాణ వ్యయం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా మొదటి దశ కిందప్రస్తుతం వున్న కాలువలు, రిజర్వాయర్ల ద్వారా వీలైనంత వేగంగా ఎంతమేర జలాలను తరలించవచ్చో అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ సంగమం సంపూర్ణమైతే రాష్ట్రంలో సుమారు 1,500 టీఎంసీల వరకు జలాలను నిల్వ చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read