"మూడెద్దులు ఉన్నవాడు ఎప్పుడు చెడిపోడు.... మంచి నోరు ఉన్నవాడెవ్వడు అభాసుపాలు కాడు" ఇప్పుడు ఈ సామెత ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకుల విషయంలో పూర్తిగా రివర్స్ అయింది... అధికార పక్షంతో స్నేహంగా ఉన్నాం, అధికారం అనుభవించవచ్చు అనుకున్న వారు కొందరు... పోనీ అలా కాకపోతే ఇలా అనుకుని చంద్రబాబు తమ మాట వినకపోతే తమ మాట వినే నాయకుల గురించి ఇక్కడివి అక్కడికి మొస్తే చంద్రబాబు మీద ఒత్తిడి తేవచ్చు అనుకుని హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేసి బోల్తా పడ్డారు.

మంచి నోరు మొదట్లో ఉన్నా వారి తత్వమో ఏమో తెలియదు గాని, అది పూర్తిగా మారి వారిని అభాసు పాలు చేసిందండంలో ఎలాంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని అక్కడి నుంచి చంద్రబాబు మైలేజ్ తగ్గుతుందని ఒక పాట రాసి బిజెపి అగ్రనాయకత్వం ముందు ఆలపించారు. దూరపు కొండలు నునుపు అన్నట్టు చంద్రబాబు గురించి తెలిసి కూడా వీరి మాటలు నమ్మిన బిజెపి అగ్ర నాయకత్వం చంద్రబాబు సామర్ధ్యానికే పరీక్ష పెట్టింది.

తీరా చూస్తే నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో కాలికి ఎదురు దెబ్బ తగిలినట్టు ఇక్కడి వారు అక్కడి వారు బాధ పడ్డారు.. అప్పటి నుంచి అధికార పార్టీ మీద విమర్శలు చేసిన కొందరు రాష్ట్ర స్థాయి నాయకులు అయితే వచ్చే ఎన్నికలకు పార్టీ జెండాలు కుట్టే పనిలో బిజీగా ఉండగా, మరికొందరు అయితే తెలుగుదేశం నాయకులను చూసి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుకుంటున్నారట... ఏది ఎలా ఉన్నా చంద్రబాబు దెబ్బ మాత్రం వారికి గట్టిగానే తగిలిందని స్పష్టంగా అర్ధమైంది... చంద్రబాబు వద్దని బిజెపి నేతల వద్ద ఫ్లకార్డులు చూపించిన వారు మరి ఏమంటారో చూడాలి.

మనం చేసేది సరైనది... మనం వెళ్లే మార్గం సక్రమమైనది అని నిత్యం భావించే వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైకాపా నాయకులు ఎక్కువగా ఉంటారు... వారు వెళ్లే మార్గం సరైనది కాకపోయినా ఎదుటి వాడు మంచి చేస్తున్నా వితండవాదంతో ముందుకు వెళ్లడం వారికి వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికి తెలిసిన విషయమే... ఇప్పుడు రాజధాని భవనాల సూచనల విషయంలో ప్రభుత్వం ప్రముఖ దర్శకుడు రాజమౌళిని సంప్రదించడంతో వారి తత్వం మరోసారి బయటపడింది....

వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే తన పరువుతో పాటు పార్టీ భవిష్యత్తు కూడా గంగలో కలిసిపోతుందని భావించిన ప్రతిపక్ష నేత జగన్ వచ్చే ఎన్నికలకు గాను తన ఎన్నికల సలహాదారుగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని నియమించుకున్నారు... పార్టీలో ఎవరితో ఎప్ప్పుడు మాట్లాడాలి అనే చిన్న చిన్న విషయాలను కూడా జగన్ ప్రశాంత్ ని నమ్ముకునే చేస్తున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు భర్త మాట కాదని భార్య ఏమి చేయని విధంగా జగన్ ప్రశాంత్ మాటని కాదని ఏమి చేయట్లేదనేది అందరికి తెలిసిన విషయమే...

అంత వరకు బాగానే ఉంది... ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విషయానికి వస్తే ఇటీవల రాజధాని భవనాల విషయంలో చంద్రబాబు రాజమౌళి సలహాలను తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.. సలహాలు మాత్రమే.. నార్మన్ ఫోస్టర్ డిజైన్స్ లలో, తెలుగు సంప్రదాయం అద్దటం కోసం, మన చరిత్ర ఆనవాళ్ళు ఆ డిజైన్స్ లో అద్దటం కోసం రాజమౌళి సలహాలు మాత్రమే ఇస్తారు... ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నేతలు చంద్రబాబుని కాలకేయ నాయకుడిగా పోలుస్తూ రాజధానిని కాలకేయ సామ్రాజ్యంగా పోలుస్తూ విమర్శలు చెయ్యడం మొదలు పెట్టారు... గెలిచి ఏదో చేద్దాం అని ప్రశాంత్ ని నియమించుకుంటే తప్పు లేనప్పుడు కేవలం సలహా కోసం రాజమౌళిని సంప్రదిస్తే తప్పు ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు...

ఎయిమ్స్‌ .... ఈ పేరు వినగానే అత్యాధునిక వైద్యసేవలు గురుకొస్తాయి. విభజన వరాల్లో ఒకటిగా మంగళగిరి ప్రాంతంలో ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. 2015 డిసెంబరు 19న శంకుస్థాపన చేసిన, ఇరవై మాసాల అనంతరం కేంద్రం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.1680 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ ఆసుపత్రితో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.

ముందుగా రూ.600 కోట్లకు పైగా వ్యయంతో రెండు ప్యాకేజీలుగా ఎయిమ్స్‌ నిర్మాణ పనులకు టెండర్లను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. రూ.300 కోట్ల వ్యయంతో ఓపీ విభాగంతోపాటు సిబ్బంది క్వార్టర్లు, మరో రూ.300 కోట్ల వ్యయంతో ఆసుపత్రి భవనాలు, వైద్య కళాశాల భవనాలను నిర్మించనున్నారు. ఇప్పటికే రూ.8.5 కోట్ల వ్యయంతో ప్రతిపాదిత ఎయిమ్స్‌ స్థలం 192 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. తొలిదశలో 40 భావనాలు కట్టనున్నారు.

ఈ ఏడాది నుంచే ఎయిమ్స్‌ మొదటి సంవత్సరం mbbs తరగతలు ప్రారంభం కానున్నాయి. తాత్కలింగా విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభం కానున్నాయి.

ఎయిమ్స్‌లో ఏమేం వుంటాయంటే..
960 పడకలతో కూడిన సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, ఏటా వంద సీట్లతో కూడిన వైద్య కళాశాల, ఏటా 60 సీట్లతో కూడిన నర్సింగ్‌ కళాశాల, కార్యనిర్వాహక బ్లాకు, ఆయూష్‌ బ్లాకు, ఆడిటోరియం, నైట్‌ షెల్టర్‌, హాస్టళ్లు, నివాసిత భవన సముదాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత అధునాతన పద్ధతుల్లో నిర్మించనున్నారు. ఆసుపత్రిలోని 960 పడకలను మూడు ప్రధాన విభాగాలుగా విభజిస్తారు. స్పెషాలిటీ విభాగాలకు 500 పడకలు, సూపర్‌ స్పెషాలిటీ విభాగాలకు 300 పడకలు, ఇతర విభాగాలకు కలిపి 160 పడకల వంతున కేటాయించారు.

ఎయిమ్స్‌ ప్రాంగణం విభజన ఇలా..
193 ఎకరాల విస్తీర్ణం కల ఎయిమ్స్‌ ప్రాంగణాన్ని కేటాయించారు. ఆసుపత్రి దాని ఆధారిత అనుబంధ సేవా విభాగాలకు కలిపి లక్షా 31వేల చదరపు మీటర్లు, సంస్థలు, బోధన విభాగాలకు కలిపి 41వేల చదరపు మీటర్లు, నివాసిత భవన సముదాయాలకు 53వేల చదరపు మీటర్లు వంతున కేటాయించారు.

రాష్ట్రంలో విశాలమైన నేషనల్ హైవేలకు తోడు, ఇప్పుడు వాటర్ ట్రాన్స్పోర్ట్ (జల రవాణా) కూడా తోడవ్వనుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ముక్త్యాల నుంచి విజయవాడ దాకా 90 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో జల రవాణాకు అక్టోబరు 3న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గుననున్నారు.

100 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చెయ్యనున్నారు. 40 కోట్లు జలరవాణా మార్గానికి, మిగతా 60 కోట్లతో, ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురం వద్ద మూడు టెర్మినళ్లను నిర్మిస్తారు. విజయవాడలోని దుర్గాఘాట్‌, భవానీ ద్వీపం, కృష్ణా జిల్లాలోని వేదాద్రి, గుంటూరు జిల్లాలోని అమరావతి వద్ద ప్రయాణికుల రవాణా కోసం ఫ్లోటింగ్‌ టెర్మినళ్లు నిర్మిస్తారు.

జల రవాణాలో సరుకు రవాణాతో పాటు, ప్రయాణికులు కూడా ఈ రూట్ ఉపయోగించుకోవచ్చు. అటు పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుంది. జగ్గయ్యపేట నుంచి రాజధానికి రోడ్డు మార్గంలో రవాణా చేయాలంటే సుమారు 140 కిలోమీటర్లు వెళ్లాలి. అదే జల రవాణా మార్గంలో 70 కిలోమీటర్ల ప్రయాణంతోనే రాజధానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకయ్యే ఖర్చులో మూడో వంతు ఖర్చుతోనే జలరవాణా చేయవచ్చు.

Advertisements

Latest Articles

Most Read