ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి, హైదరాబాద్ నుంచి పాలన తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే ముందుగా స్పందించిన పార్టీ ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైకాపా . ఇక్కడి నుంచి పాలన జరుగుతుంది, అందుకోసం తాత్కాలిక భవనాలను నిర్మించి వాటిల్లో సచివాలయం , అసెంబ్లీ నిర్వహించాలని భావిస్తే ప్రతిపక్షం అడ్డు తగులుతూ వాటిని వ్యతిరేకించింది. తాత్కాలికం అనేది ఎందుకు అని ప్రశ్నించింది.
అంత వరకు బాగానే ఉంది.. ఇప్పుడు ఆ పార్టీనే ప్రభుత్వాన్ని అనుసరించడం మొదలు పెట్టింది. ఏకంగా తమ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్రానికి తరలించాలని దానిని రాజధాని ప్రాంతంలో పెట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడి మార్గ నిర్ధేశకుడు ప్రశాంత్ కిషోర్ జగన్ కి సూచించారట. దీని వెనుక ప్రధాన కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం. వాస్తవానికి ఏ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత ఆ రాష్ట్రంలోనే ఉండి ప్రభుత్వం పై పోరాడుతూ ఉండాలి.
కానీ జగన్ మాత్రం పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉంటూ తన పార్టీ కార్యాకలాపాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అది కూడా పార్ట్ టైం ప్రతిపక్ష నేత తరహాలో... ఇక్కడ భూ లోకంలో ఏ సమస్య వచ్చినా పరలోకానికి వెళ్లి సమస్యలను వివరించాలి అన్న తరహాలో జగన్ పార్టీ వ్యవహార శైలి ఉంది. ఈ విషయంలో పార్టీ నేతల్లో కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్న సంగతి అందరికి తెలిసిందే..
దీనిని గమనించిన ప్రశాంత్ కిషోర్ అసలే నీటి బుడగలా ఉన్న పార్టీ పరిస్థితి, హైదరాబాద్ నుంచి ఆదేశాలు అంటే ఎప్పుడో పగిలేది ఇప్పుడే పగులుతుందని భావించి, వెంటనే కార్యాలయాన్ని ఇక్కడికి తరలించి జగన్ ని ఇక్కడే ఉండమని సూచించారట. దీనితో ప్రశాంత్ మాట కాదు అనని జగన్, వెంటనే తమ నేతలతో ఈ మాట చెప్పగానే వారు బందరు రోడ్డులో ఒక స్థలాన్ని చూసి అక్కడే ఒక కొత్త భవన నిర్మాణాన్ని చేపడుతున్నారట... దీనిపై ఒక కన్నేసిన తెలుగుదేశం నేతలు జగన్ ఫోటోని చూసి నవ్వుకుంటున్నారట.