తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి కింది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 1. రాష్ట్రంలో వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు 34 మంది వరకు చనిపోయారు, 10 మంది గల్లంతయ్యారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. పదిపెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హెలికాఫ్టర్ లో ఏరియల్ రివ్యూ చేసి చేతులు దులుపుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను అందించడంలో విఫలమయ్యారు. దాదాపు 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పెద్దఎత్తున పశువులు చనిపోయాయి. వరదలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో జగన్ రెడ్డి విఫలమయ్యారు. దీంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ అజాగ్రత్త వల్లే, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంతి మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అసాధారణం. గతంలో ఎప్పుడూ ఈ విధగా జరగలేదు. ఆర్టీజీఎస్ ను సరిగా వినియోగించుకోలేదు. టీడీపీ ఆధ్వర్యంలో బృందాలు బాధితులకు అన్ని విధాల అండగా నిలవాలని సమావేశంలో తీర్మానించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారు 23, 24 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
2. రాజధానిపై జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోంది. ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు రాష్ట్ర ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతుంది. 3. వివేకానందరెడ్డిని ఆయన అల్లుడే చం-పిం-చా-డ-ని కట్టుకథలు అల్లిస్తూ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ దుర్మార్గాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని సమావేశంలో నేతలు నిర్ణయించారు. 4.ప్రజా సమస్యలు, అవినీతి, వివేకానందరెడ్డి హత్య నుంచి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించేందుకే ప్రతిపక్ష నేత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని, కౌరవ సభ అని, జగన్ రెడ్డి ఉన్మాద చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. 5. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. కోరం ఉన్నప్పటికీ ఎన్నిక నిలిపివేయడం దుర్మార్గం. రాష్ట్రంలో అడ్డగోలు పాలనకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఉ-న్మా-దు-ల పాలనలో ఇలాంటివే చోటుచేసుకుంటాయని నేతలు అభిప్రాయపడ్డారు. 6. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2020-21కు గాను రూ.2,625 కోట్లు, 2021-22కు గాను రూ.969 కోట్లు, మొత్తంగా రూ.3,594 కోట్లు ప్రభుత్వ దారిమళ్లించి దుర్వినియోగం చేసుకున్నది. ఇది చట్ట విరుద్ధం. స్థానిక సంస్థల సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్ లు, మేయర్ల అధికారాలలకు గండికొట్టడమే అవుతుంది. ఒకవైపు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్, మేయర్ల వ్యవస్థ అధికారాలను దురాక్రమణ చేయడమే కాకు రెండోవైపు కేంద్రం చ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3,500 కోట్లు దారిమళ్లించడం జగన్ రెడ్డి ప్రభుత్వం వికేంద్రీకరణకు గండి కొట్టడమే.