ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్ది సేపటి క్రితం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో, మూడు రాజధానుల బిల్లు పై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హైకోర్టులో కొద్ది సేపటి క్రితం, హైకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణకు రాగానే, ప్రభుత్వ తరుపు న్యాయవాది, మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని సంచలన ప్రకటన చేసారు. నిన్నటి వరకు రాజధాని రైతులు తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, శ్రీరాం, త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ ప్రారంభం అవుతూ ఉండటంతోనే, ఆయన రాష్ట్ర హైకోర్టులో, ఈ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని, దీని పైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. అయితే ఆయన స్టేట్మెంట్ విషయం పై స్పష్టత లేకపోవటంతో, కోర్టు మరోసారి ప్రశ్నించింది. మళ్ళీ అడ్వొకేట్ జనరల్ చెప్తూ, మూడు రాజధానుల బిల్లు ఏదైతే ఉందో, సిఆర్డీఏ రద్దు చేయటం, ఈ రెండు బిల్లులు కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని, ప్రభుత్వం ఈ విషయం పై అసెంబ్లీలో స్పష్టత ఇస్తుందని చెప్తున్నారు.

jagan 22112021 2

మరి ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏమిటి, మళ్ళీ ఏమైనా వారే రూపంలో వస్తారా ? లేక జగన్ మోహన్ రెడ్డి ఏమి చేస్తారు అనేది చూడాల్సి ఉంది. గత 700 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావటం లేదు. ఇప్పటికే న్యాయస్థానం టు దేవస్థానం అంటూ ప్రకటన చేసి, నడుస్తున్నారు. అలాగే వీరికి కూడా ఇబ్బందులు కలుగ చేసారు. అయితే మరో కీలక పరిణామం అమిత్ షా వచ్చి, బీజేపీ నేతల పై అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. తరువాత బీజేపీ నేతలు కూడా కదిలారు. అమిత్ షా నిర్ణయానికి, ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయానికి లింక్ ఉందా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల బిల్లులు వెనక్కు తీసుకుంది. ఈ నేపధ్యంలోనే, దీని వెనుక ఏమి జరిగింది అనేది చూడాలి. జగన్ ఏమి ప్రకటన చేస్తారో చూడాలి. దీని వెనుక ఏమైనా మతలబు ఉందా అనేది చూడాల్సి ఉంది. కోర్టులో చెప్పారు కాబట్టి ఏమి జరిగిందో చూడాలి.

నారా చంద్రబాబు నాయుడు అంటే, అది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అమెరికా నుంచి అనకపల్లి వరకు, బిల్ క్లింటన్ దగ్గర నుంచి, మన దేశంలో చిన్న స్థాయి నేత వరకు, ఆయన పరిపాలనా విధానానికి ఫిదా అయిన వారే. ఆయన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించిన చరిత్ర ఉన్నోడు. ఆయన కేంద్ర ప్రభుత్వాలను శాసించినోడు. ఆయన రాష్ట్రపతిలు, ప్రధానులను నియమించిన వాడు. అలాంటి చరిత్ర ఉన్న మహా నేతను, కేవలం ఎన్నికల్లో ఒక్కసారి ఓడిపోయాడని హేళన చేస్తున్నారు. సరే ఇవి రాజకీయాల్లో సహజం అని, ఆయన అన్నీ భరిస్తూ ముందుకు వెళ్తుంటే, ఇప్పుడు ఆ హేళనలు, బూతులు అయ్యాయి, బూతులు ఆడవాళ్ళ వరకూ వచ్చాయి. వల్లభనేని వంశీ, కొడాలి నానీ, ద్వారంపూడి, రోజా, వీళ్ళా చంద్రబాబుని అనేది ? వీరికా ఆయన్ను అనే చరిత్ర ఉంది ? అయితే చంద్రబాబు భార్యని లాగటం, బూతులతో ఆవిడ క్యారక్టర్ మీద దెబ్బ కొట్టటం, ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చలించిన చంద్రబాబు, తన భార్యను బజారులో పెడితే ఇప్పుడు కన్నీళ్లు పట్టుకోవటం, ఇవన్నీ చూసాం. సరే అయ్యింది ఏదో అయిపొయింది, ఇప్పటికైనా క్షమాపణ చెప్పారా అంటే అదీ లేదు. సిగ్గు లేకుండా ఎదురు దాడి చేస్తూ, అందరి చేత ఆయన్ను తిట్టిస్తున్నారు.

jagan 2112021 2

ఇప్పుడు ఈ విషయం పెద్దది అయ్యింది. చంద్రబాబు జాతీయ స్థాయి నేత కావటంతో, అయన్ను వివిధ రాష్ట్రాల నేతలు పరామర్శిస్తున్నారు. అయితే ఈ విషయం పెద్దది అవ్వటం, జాతీయ మీడియా కూడా జగన్ మోహన్ రెడ్డి పార్టీని విమర్శలు చేస్తూ కధనాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు దీనికి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో వైసీపీ పడింది. రేపు సోమవారం అసెంబ్లీ సమావేశం దీనికి వేదిక అయ్యింది. అసెంబ్లీలోనే ఆ వ్యూహం రెడీ చేసారు. స్పీకర్ ఎలాగూ స్పందిస్తారు కాబట్టి, ఆయన స్పందించిన తరువాత, వైసీపీలో రోజా లాంటి నాయకులతో మాట్లాడించి, తరువాత జగన్ అందుకుని, చంద్రబాబు నా తల్లిని అన్నాడు, నా చెల్లిని అన్నాడు, ఇలా అన్నీ చెప్పి, చివరకు మేమే ఏమి చేయకపోయినా చంద్రబాబు హార్ట్ అయ్యారు కాబట్టి, తెలిసో తెలియకో ఏదైనా అంటే, ఆ మాటలు వెనక్కు తీసుకుంటున్నాం అని చెప్పి, భువనేశ్వరి గారికి కూడా క్షమాపణ కాకపోయినా, అలా అర్ధం వచ్చేలా మాట్లాడి, ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, వైసీపీ వ్యూహం పన్నినట్టు తెలుస్తుంది. మరి ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి. మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిగా ఉండనున్నాయి.

అసెంబ్లీని కౌరవ సభగా మార్చి, చంద్రబాబు సతీమణిని అనరాని మాటలు అంటూ, వికటాట్టహాసం చేస్తూ, సభలో చంద్రబాబుని అవమానించి, ఆయన సతీమణిని కించపరిచిన ఘటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా కలిచివేసింది. దేశ వ్యాప్తంగా చంద్రబాబుకు, ఈ విషయంలో మద్దతు లభిస్తుంది. ఇతర రాష్ట్రాల నాయకులు ఫోన్ లు చేసి, చంద్రబాబుని ఓదారుస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అంటే ఒక విజన్ కి చిరునామాగా చూసిన దేశ నాయకులు, ఆయన్ను అలా చూసి చలించిపోయారు. తమిళనాడు సూపర్ స్టార్ట్ రజనీకాంత్‌ చంద్రబాబుని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ నేతలు, చంద్రబాబు సతీమణిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మీడియాలో చుసిన రజనీకాంత్‌, శనివారం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసి, విచారం వ్యక్తం చేసారు. చంద్రబాబుకు ధైర్యం చెప్తూ, ఈ ఘటన నుంచి బయటకు వచ్చి, ప్రజా సేవ కొనసాగించాలని, చంద్రబాబుకు హితవు పలికారు. ఇక తమిళనాడుకు చెందిన న్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. అన్నాడీఎంకే మాజీ ఎంపీ మైత్రేయన్, చంద్రబాబు పట్ల వైసీపీ వ్యవహరించిన తీరుని ఆక్షేపించారు. ఎన్టీఆర్ కుటుంబంతో తమకు 1984 నుంచి పరిచయం ఉందని అన్నారు.

rajini 21112021 21

ఎన్టీఆర్ కుమార్తెను అసెంబ్లీ వేదికగా దుర్భాషలాడటం మీడియాలో తెలుసుకుని చాలా బాధ పడినట్టు చెప్పారు. ఈ ఘటనను ఖండిస్తున్నానని అన్నారు. చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడి, ఆయకు ధైర్యం చెప్పినట్టు చెప్పారు. ఇక చంద్రబాబుకు తెలంగాణా నుంచి కూడా మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గా రెడ్డి, జరిగిన ఘటనను ఖండించారు. అరికెపూడి గాంధీ కూడా చంద్రబాబుకు మద్దతు నిలిచారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జరిగిన ఘటనను ఖండించారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి కూడా జరిగిన ఘటన పై విచారం వ్యక్తం చేసారు. ఏపి అసెంబ్లీలో సంస్కార హీనులు చొరబడ్డారని అన్నారు. ఇది తెలుగు జాతి చరిత్రలోనే ఒక దుర్దినం అని అన్నారు. బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, మరో ఎంపీ సియం రమేష్, మాజీ మంత్రి పురందేశ్వరి కూడా వైసీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి నీచ సంస్కృతికి చరమ గీతం పాడాలని అన్నారు.

నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యల వ్యాఖ్యలు చేస్తూ, చంద్రబాబుని మానసికంగా దెబ్బ తీసే వ్యూహం పన్నిన వైసీపీ, చంద్రబాబుని మానసికంగా ఇబ్బంది పెట్టే విషయంలో సక్సస్ అయ్యింది కానీ, దేశ వ్యాప్తంగా మాత్రం, వైసీపీ చేసిన పని పై విమర్శలు ఎదురుఅవుతున్నాయి. చంద్రబాబుని అలా చూసిన అనేక మంది, ఆయనకు ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్, చంద్రబాబుకు ఫోన్ చేసారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సోనూసూద్, చంద్రబాబుకు ఫోన్ హస్సి పరామర్శించారు. శాసనసభలో జరిగిన విషయం పై విచారం వ్యక్తం చేసారు. ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాల్సిన శాసనసభలో, ఇలాంటి ఘటనలు జరగటం శోచనీయం అని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే, నిర్మాణాత్మక విషయాలు చర్చించాల్సిన, శాసనసభలో, పవిత్ర దేవాలయంలో, ఇలాంటి విధ్వంస ధోరణి మంచిది కాదని అన్నారు. చంద్రబాబుని ఓదార్చిన సోనూ సూద్, హైదరాబాద్ వచినప్పుడు, మిమ్మల్ని వచ్చి కలుస్తానని, మునుపటి లాగే ప్రజా సేవ కొనసాగించి, తమ లాంటి వారికి ఆదర్శంగా ఉండాలని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read