నిన్న ఏపిలో చంద్రబాబుని, ఆయన సతీమణిని, వైసీపీ నాయకులు తిట్టిన విధానం పై, తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి స్పందించారు. రేపు చంద్రబాబు వస్తే, జగన్ ఏమి అవుతాడు అంటూ స్పందించారు. ఆయన మాటలలోనే "గతంలో చంద్రబాబు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు హుందాగా సభలు నడిచేవి. వైఎస్ఆర్ ఒకసారి మాట తులినా, ఆ మాటలు వెనక్కు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాక అవసరమా లేదా అనేది పక్కన పెట్టి స్పందించాలి. చంద్రబాబు గారు మొన్న సియంగా ఉన్నప్పుడు కూడా, ఇలాంటి వ్యక్తిగత దూషణలు చూడలేదు. చంద్రబాబు గారు నిన్న ఏదైతే కన్నీళ్లు పెట్టుకున్నారో, అది బాధాకరం. అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా , దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తిగా ఉన్న చంద్రబాబుని అలా చూసి బాధేసింది. ఆయనకు ఉన్న వయసు రిత్యా, ఆయనకు ఉన్న అనుభవం రిత్యా కొన్ని మర్యాదులు పాటించాలి. చంద్రబాబు గారు ఎప్పుడూ ఏ ఎమోషన్ చూపించారు. కొడాలి నాని మాట్లాడిన విధానం, ఇతర నాయకులు మాట్లాడిన విషయాలు గతంలో చూసాం. బూతులు తిట్టారు. సమాజంలో ఇలాంటివి మంచిది కాదు. కొడాలి నానికి ఇవన్నీ బాగుండ వచ్చు. రోజా కూడా అంతే. టైం బాగుండి ఎమ్మెల్యే అయ్యింది. ఆమె ధోరణి కూడా గతంలో చూసాం. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. "

jagga 20112021 2

"మీడియా ముందుకు వచ్చినప్పుడు మనం మాట్లాడే విధానం ఆలోచించాలి. నిన్న చంద్రబాబు గారు రాజకీయంగా ఇబ్బంది అని బాధపడలేదు. ఫ్యామిలీని దూషించినందుకు తట్టుకోలేక పోయారు. విజన్ ఉన్న చంద్రబాబు, నిన్న ఆ వీడియో చూసి, బాధ వేసింది. ఫ్యామిలిని దూషిస్తే, ఎంత పెద్ద నాయకుడు అయినా కంట్రోల్ చేసుకోలేము. ఇదే మాటలు జగన్ ని, రోజాని అంటే ఎలా ఉంటుంది ?ఇక ఆ స్పీకర్ గురించి చెప్పాలి అంటే, ఆ స్పీకర్ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగేవాడే కదా. అంత జరుగుతుంటే, ఆ స్పీకర్ ఏమి చేస్తున్నాడు ? స్పీకర్ గా అతను అన్ ఫిట్. గుడివాడ నాని మాటలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అది అసెంబ్లీ హాల్ లా లేదు. ఈ మాటలు పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా , ఒక మనిషిలా మాట్లాడుతున్నా. జగన్ రెడ్డి నవ్వులు దేనికో అర్ధం కావటం లేదు. జగన్ మోహన్ రెడ్డి, రేపు చంద్రబాబు గెలిస్తే నీ పరిస్థితి ఏమిటి ? రేపు నీ పని రివర్స్ అవుతుంది. నీ అనుచరులతో ఇలాగే నడిపిస్తే, రేపు కచ్చితంగా నీకు రివర్స్ అవుతుంది జాగ్రత్త."

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై, వైసీపీ అసెంబ్లీ సాక్షిగా చేసిన విమర్శలు, తరువాత స్పందించిన తీరు పై నందమూరి కుటుంబం ఏకం అయ్యింది. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య, ఇతర ఎన్టీఆర్ కుమార్తెలు, కొడుకులు, కోడళ్ళు, ఇతర కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఇప్పటికే కళ్యాణ్ రాం కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ట్విట్టర్ లో ఒక వీడియో సందేశం వదిలారు. ఆయన మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన గురించి స్పందిస్తూ, ఇది ఒక అరాచకానికి నాంది అంటూ స్పందించారు. ఆయన మాటల్లోనే, "మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. ఆ విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రజా సమస్యల మీద జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, లేదా వ్యక్తిగత విమర్శలు ఉండ కూడదు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నా మనసుని కలిచి వేసింది. ఎప్పుడు అయితే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలు మీదకి దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి, పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపలనకు నాంది పలుకుతుంది. "

ntr 20112021 2

"స్త్రీ జాతిని గౌరవించటం అనేది, ఆడవాళ్ళను గౌరవించటం అనేది మన సంస్కృతి,మన నాడుల్లో, మన జీవాల్లో, మన రక్తంలో ఇమిడి పోయిన ఒక సంప్రదాయం. మన సంప్రదాయాలను రాబోయే తరాలకు, జాగ్రత్తగా , భద్రంగా అప్ప చెప్పలే కానీ, మన సంస్కృతిని కలిచి వేసి, కాల్చేసి, రాబోయే తరాలకు ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే, అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలో నేను, ఇలాంటి వ్యక్తిగత దూషణలకు గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాట్లాడటం లేదు. ఈ మాటలు, నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరిడిగా, సాటి తెలుగు వాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులు అందరికీ ఒకటే విన్నపం. దయచేసి, ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని కోరుకుంటున్నా."

భార్య వసుంధర, సోదరుడు రామకృష్ణ, సోదరి లోకేశ్వరి, ఉమామహేశ్వరి, హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశం. పెట్టారు. ఆయన మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో జరిగిన విషయం చూసాం, ఊరుకే చేతులు కట్టుకుని కూర్చోలేదు ఇక్కడ. మా ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు. అసెంబ్లీ పరిణామాలు బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదు. ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది. ఇక నుంచి ఎవడైనా వాగినా, మీరు మీ వ్యవస్థలు ఎన్ని అడ్డు పెట్టుకున్నా, అవేమి మమ్మల్ని ఆపలేవ్, జాగ్రత్త. మా చెల్లెలు, ఏనాడైనా రాజకీయాల గురించి మాట్లాడిందా ? మీ వేషం, మీ భాష, మీ ఆహార్యం చూస్తే, గొడ్ల చావిట్లోకి వచ్చినట్టు ఉంది. మీ బాబాయ్ కేసులో, మీ మీద అనుమానం ఉందని, మీ కుటుంబ సభ్యులే చెప్పారు. అక్కడ ఇష్యూ ఉంది. అది లేవనెత్తితే, దాన్ని డైవర్ట్ చేస్తారా ? అవేమి మాటలు ? అసెంబ్లీలోనే అనేక మంది ఉన్నారు, మంచిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి భాష మాట్లాడుతున్నందుకు వారికి కూడా ఇబ్బంది ఉంటుంది, కానీ బయటకు చెప్పుకోలేక పోతున్నారు."

nbk 20112021 2

"మా పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగినా, ఎన్ని బూతులు తిట్టించినా, ఆయన ఎప్పుడూ చలించలేదు. మేము అప్పుడే ఊరుకోలేదు, కానీ చంద్రబాబు గారు వారించారు. కానీ ఇప్పుడు ఇది చుసిన తరువాత, ఇక మేము ఉపేక్షించం. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. ఏది శాస్వతం కాదు అనే విషయం గుర్తు పెట్టుకోండి. రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసారో చూస్తున్నాం. మొత్తం నాశనం చేసి పెట్టారు. గతంలో చంద్రబాబు గారు ఎలా హ్సుసారు, ఇప్పుడేమి చేస్తున్నారు ? జాగ్రత్తగా ఉండండి, నోరు జారీతే తాట తీస్తాం. ఇక నుంచి చంద్రబాబు గారి మాట కూడా మేము వినం. ఆయన అనుమతి కూడా అవసరం లేదు. ఇక నుంచి ఆయన ఆపారు కాబట్టి ఆగాం. ఆయన ఇచ్చే విలువతోనే, మీరు ఏమి చేసినా సాగింది. ఇక నుంచి కుదరదు. ఇదే మా హెచ్చరిక. పార్టీ కార్యకర్తల తరుపున, కుటుంబం తరుపున, మా సినిమా ఫాన్స్ తరుపున, అందరి తరుపునా హెచ్చరిక. మరోసారి ఇది రిపీట్ అయితే, ఇక చూస్తూ ఉండం. ఇక నుంచి జాగ్రత్తగా, అలోచించి మాట్లాడండి."

ఆమె తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కుమార్తె. టెక్ సియంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తి భర్త. ఆమె తండ్రి రెండు సార్లు సియం, భర్త మూడు సార్లు సియం, కొడుకు మంత్రిగా చేసారు, సోదరుడు రాజ్యసభలో పని చేసాడు, మరో సోదరుడు ఎమ్మెల్యే. పది వేల మంది పని చేసే కంపెనీకి అధిపతి. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, ఆమె ఏ నాడు బయట ప్రచారంలోకి రాలేదు. ప్రోటోకాల్స్ విషయంలో తప్ప, భర్త పక్కన ఎప్పుడూ బయట కనిపించ లేదు. ఆమెను చూస్తే, తెలుగింట మనలో ఒక అమ్మగా, అక్కగా, చెల్లిగా భావించే ఆహార్యం ఆమెది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కూడా రోడ్డుకు లాగారు నీచులు. ఇదేదో ఆవేశంతో అన్నారు అంటే, సరి పెట్టుకోవచ్చు. ఇది పని గట్టుకుని, గత నెల రోజులుగా జరుగుతున్న కుట్ర. ముందు వంశీతో అనిపించారు. నిన్న చంద్రబాబుని కుప్పంలో కొట్టాం, ఇంకేముంది చంద్రబాబుతో ఆడుకోవచ్చు అనుకుంటే, ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తారు. అంతే ఇక ఈయన్ను రాజకీయంగా కొట్టలేం అని, ఆయన భార్య అని భువనేశ్వరిని అసభ్యంగా దూషించటం మొదలు పెట్టారు. భరించారు, భరించారు భరించారు, చివరకు ఇంట్లో భార్యను ఇలా అసెంబ్లీలో ప్రజలు అందరూ చూస్తూ ఉండగా, ఆమె క్యారక్టర్ మీద కొడితే ఆయన భరించ లేక పోయారు.

nara 20112021 2

మీడియా ముందు మాట్లాడుతూ, విలపించారు. చంద్రబాబుని అలా చూసిన చాలా మంది, బాధ పడ్డారు. ఈ రాజకీయాలు ఆయన వద్దు అనుకుంటే, ఎంత సేపు ? ఈ మాటలు పడటం ఎందుకు ? ఇవన్నీ ప్రజలు డిస్కస్ చేస్తూ ఉండగానే, నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు. తన ఆధ్వర్యంలో ఉండే ఎన్టీఆర్ ట్రస్ట్ చేత, పనులు పురామయించారు. ప్రజల వద్దకు పంపించారు. ప్రజల ఇబ్బందులు తీర్చమన్నారు. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరులో వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇబ్బందులు తెలుసుకున్న నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ ని రంగంలోకి దించారు. ఇంకా ప్రజలు వరదలోనే ఉన్నారు కాబట్టి, వారికి కావలసిన ఆహరం పంపించారు. రాత్రి వరదలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ వాలంటీర్లు రంగంలోకి దిగారు. ఇక అంటు వ్యాధులు ప్రబలకుండా, కావాల్సిన మెటీరియల్ మొత్తం పంపించారు. వరద తగ్గగానే మరిన్ని కార్యక్రమాలు చేయటానికి రెడీ అయ్యారు. ఒక పక్క వైసీపీ నేతలు ఆమెను బజారుకు లాగితే, ఆమె మాత్రం, ఆమె చేయగలిగిన మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read