మన రాష్ట్రంలో ప్రజలు గతంలోకి వెళ్లి చూసుకుంటే, ప్రతిపక్షంలో ఉన్న యువ నేతలు యాత్రలు చేస్తూ ప్రజల వద్దకు వెళ్ళిన సందర్భంలో, ప్రజలు కష్టాలు చెప్పి, ఏమైనా సహాయం చేయమంటే, నుదుటున ముద్దు పెట్టి, నెత్తిన చేయి పెట్టి, రెండేళ్ళలో నేనే ముఖ్యమంత్రి అవుతాను, అప్పుడు నీ సమస్య తీరుస్తాను అంటూ అక్కడ నుంచి జారుకున్న సీన్లు చాలా చూసాం. అయితే అందరూ అలా ఉండరు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శైలి భిన్నం. కష్టం అని ఎవరైనా వచ్చి చెప్పినా, ఎక్కడైనా వార్త చూసినా వెంటనే లోకేష్ స్పందించే వారు. తనకు తోచిన సాయం చేసే వారు. నెల రోజులు క్రితం కర్నూల్ పర్యటనలో, ఒక మైనారిటీ వ్యక్తి తనకు ఉన్న కష్టం చెప్పుకోగా, వెంటనే పాతిక వేలు తీసి చేతిలో పెట్టారు. ఇక కార్యకర్తలకు సేవ చేసే విషయం అయితే, రోజుకి ఎన్నో సంఘటనలు ఉంటాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక సంఘటన చూసి లోకేష్ చలించిపోయి సహాయం చేసారు. నారా లోకేష్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే విషయం అందరికీ తెలిసిందే. తన రాజకీయ దిన చర్యల పై, అలాగే అధికార పక్షం చేసే అన్యాయాల పై సోషల్ మీడియా వేదికగా లోకేష్ ఆక్టివ్ గా ఉంటూ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు,
తాజాగా ఒక జర్నలిస్ట్, ఒక పోస్ట్ చేసారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం పడుతున్న బాధులు ఇవి. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరికీ కళ్ళు లేవు. పుట్టిన పిల్లలు వారి కళ్ళు అయ్యారు. అయితే అందరి పిల్లలు లాగా స్కూల్ కు వెళ్ళాల్సిన ఆ పిల్లలు జీవనం కోసం ఆటో నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ చిన్న పిల్లలు ఆటో నడుపుతూ, జీవనం సాగిస్తున్నారని ఒక జాతీయ మీడియా విలేఖరి ఒక స్టొరీ పోస్ట్ చేయగా, దానికి లోకేష్ స్పందించారు. ఆ బాలుడిని బ్యాగ్ తీసుకుని పుస్తాకాలు సద్దుకోమనండి, అతన్ని నేను చదివాస్తానని అన్నారు. అంతే కాదు ఆ కుటుంబానికి తక్షణ సాయంగా 50 వేలు ఇస్తామాని అన్నారు. ఆటో కోసం తీసుకున్న అప్పు 2 లక్షల వరకూ తాము సాయం చేస్తామని అన్నారు. తల్లిదండ్రులు ఇష్టం మేరకు, ఏ స్కూల్ లో కావాలి అంటే ఆ స్కూల్ లో చదివిస్తానని లోకేష్ అన్నారు. చదువు ఖర్చు మొత్తం తానె భరిస్తానని లోకేష్ తెలిపారు. లోకేష్ చేసిన ట్వీట్ కి సోషల్ మీడియా మొత్తం, పార్టీలకు అతీతంగా మెచ్చుకుంటున్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్న వారు ఇలా స్పందిస్తారని, అధికారం కోసం చూడరని వాపోతున్నారు.