తెలుగుభాషను, అకాడమీని నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నచర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ, ప్రభుత్వం జీవో ఇవ్వడం దారుణమని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై మాతృభాషాభిమానులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వివాదాస్పదమైన నిర్ణయాలనే ముఖ్యమంత్రి ఎందుకు తీసుకుంటున్నాడో తెలియడంలేదన్నారు? తెలుగు భాష ఖ్యాతిని గుర్తించి, తెలుగు అకాడమీని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి పనులు చేయడం బాధాకరమని రఫీ వాపోయారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి తెలుగుభాష పటిష్టతకు కృషి చేస్తే, ఈ ముఖ్యమంత్రి తెలుగు భాషపై ఎందుకు కత్తి కట్టాడో తెలియడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీలో తెలుగు అనే పదం ఉందన్న దురాలోచనతో, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలుగు అనేది ఉండకూడదని ఆలోచిస్తున్నాడేమోననిపిస్తోందన్నారు. తెలుగు, సంస్కృతాలను మిళితం చేయడం ద్వారా ముఖ్యమంత్రి తల్లి వంటి తెలుగు భాషను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. సంస్కృతంపై పట్టు ఉండటం అందరికీ సాధ్యం కాదని, అటువంటి భాషతో ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల20లక్షలమంది మాట్లాడే తెలుగుభాషను జోడించాలని ముఖ్యమంత్రి చూడటం ముమ్మాటికీ మాతృభాషను నిర్వీర్యం చేయడమేనని రఫీ తేల్చిచెప్పారు. తెలుగుభాషపై కోపం చూపే, ముఖ్యమంత్రికి సంస్కృతంపై ఉన్నట్టుండి ఇంత ప్రేమచూపడం ఏమిటన్నారు? మాతృ భాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని, అదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని చెబితే, ముఖ్యమంత్రికి ఇవేవీ పట్టడం లేదన్నారు. తెలుగుభాష ఉనికిని ప్రశ్నార్థకంచేసే జీవోనెం-33ని ముఖ్యమంత్రి తక్షణమే రద్దు చేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. అనేక దేశాల్లో పాశ్చాత్యులు తెలుగు నేర్చుకోవడానికి, తెలుగుభాష మాధుర్యాన్నిఆస్వాదించడానికి ఉవ్విళ్లూరుతుంటే, సొంత భాషను కాపాడుకోవాల్సిన ముఖ్యమంత్రి దాన్ని తుంచడానికి పూనుకోవడం అత్యంత బాధాకరమన్నారు. తల్లిని, చెల్లిని రోడ్ల పాలు చేసిన ముఖ్యమంత్రి చివరకు ఎందుకూ, ఎవరికి కొరగాని విధంగా తయారయ్యాడన్నారు. ఈ సందర్భంగా రఫీ సుమతీశతకంలోని “ కొరగానికొడుకు పుట్టిన కొరగామియేకాడు.తండ్రి గుణములు చెరచున్, చెరకుతుద వెన్నుపుట్టిన చెరకున తీపెల్లచెరచు సిద్ధము సుమతీ” పద్యాన్ని వినిపించారు.

జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఒక్క లక్ష్మీపార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లు తప్ప ఎవరూ సమర్థించలేదని, వారికున్న పదవి పిచ్చి, జగన్మోహన్ రెడ్డి భజన తెలుగుభాషకు చేటు చేస్తున్నాయన్నారు. లక్ష్మీప్రసాద్, లక్ష్మీపార్వతి నిర్ణయంపై భాషాభిమానులంతా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగును అధికార భాషను చేశారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తెలుగులోనే అర్జీలు అమలయ్యేలా చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలుగుమాట్లాడటం రాదని, ప్రజలెవరూ తెలుగు మాట్లాడ కూడదని భావించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు చేయాల్సిన పనికాదన్నారు. తమిళనాడులో తమిళ భాషనే అన్ని విధానాల్లో ఉపయోగిస్తున్నారని, అఖరికి సంస్కృతంలోని శ్లోకాలు, మంత్రాలను కూడా తమిళలు వారి భాషలోనే చెబుతున్నారన్నారు. తెలుగుకు తెగులు పట్టించేలా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన జీవోని ఆయన తక్షణమే రద్దు చేయాలని టీడీపీ తరుపున రఫీ డిమాండ్ చేశారు. తెలుగుభాషను నిర్వీర్యం చేసే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. జగన్మో హన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక మాతృభాషను విద్యార్థులకు దూరం చేసే అనేక చర్యలకు శ్రీకారం చుట్టాడన్నారు. తెలుగు అకాడమీతో పాటు, సంస్కృత అకాడమీని కూడా ఏర్పాటు చేసి రెండు భాషలను ముఖ్యమంత్రి రక్షిస్తే, ప్రజలంతా ఎంతో సంతోషిస్తారన్నారు. తానొక మహమ్మదీయుడనని, కానీ తెలుగును అమితంగా ప్రేమిస్తానని రఫీ తెలిపారు. తేనెలొలికే తెలుగు భాషలోని గొప్పతనాన్ని ముఖ్యమంత్రి గ్రహించకపోవడం చాలాచాలా బాధాకరమన్నారు. చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుందని రఫీ హెచ్చరించారు.

రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తాను గవర్నర్ కు ఇచ్చిన లేఖ తాలూకా అంశాలను చాలా తేలిగ్గా తీసుకునేలా, అవేవీ అసలు చెప్పుకోదగిన అంశాలే కావన్నట్లుగా మాట్లాడారని, వ్యక్తులంటే గౌరవంలేని ప్రభుత్వం, మంత్రి, కనీసం వ్యవస్థలైనా గౌరవిస్తే సంతోషిస్తామని టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావులకేశవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ... "రూ.41వేల కోట్లకు సంబంధించిన అంశం గురించి మంత్రి స్థాయిలో ఉన్య వ్యక్తి ఏమాత్రం లెక్కలేనట్లు నిర్లక్ష్యంగా మాట్లాడారు. సీఏజీ (కాగ్), కేంద్ర ప్రభుత్వం అన్నీ తెలివి తక్కువవేనని, తానొక్కడే తెలివైనవాడినన్నట్లుగా మంత్రి మాటలున్నాయి. 17-06-2020న తాను ప్రభత్వానికి లేఖ రాశాను. ఆ లేఖలో చీఫ్ సెక్రటరీని, ఆర్థిక కార్యదర్శిని కొన్ని విషయాలు అడిగాను. ప్రభుత్వం తరుపున ఇచ్చిన బ్యాంక్ గ్యారెంటీలు, లోన్ల వివరాలు, కార్పొరేషన్లకు ఇచ్చిన నిధుల వివరాలు తెలియచేయాలని కోరాను. తాను రాసిన లేఖకు 01-07-2021న ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఒక సంవత్సరానికి 15 రోజుల తక్కువగా దాదాపు 350 రోజుల తర్వాత సమాధానమిచ్చారు. అంత సమయం ఎందుకు తీసుకున్నారు? అసలు తాము గవర్నర్ ను కలిసేవరకు పరిస్థితులను ప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంది? బడ్జెట్ తో పాటు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్యూమ్ 5/2 లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, అందుకోసం ఇచ్చిన గ్యారంటీల వివరాలు దానిలో ఉండాలి. ఆ వాల్యూమ్ ని ప్రభుత్వం విధిగా శాసనసభకు సమర్పించాలి. తాను గతంలో అడిగిన లేఖకు సంవత్సరం తర్వాత ఏమని సమాధానమిచ్చారంటే, 5/2 వాల్యూమ్ లో మీరు అడిగిన సమాచారం ఉంటుంది చూసుకోమన్నారు. దానిలో సమాచారముంటుందనే విషయం నాకుతెలియదా? రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి రూ. 25వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన విషయాన్ని ఈ ప్రభు త్వం శాసనసభకు తెలియకుండా దాచింది. వాల్యూమ్ లో ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. ప్రభుత్వం కొత్తగా ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రూ.25వేల కోట్లు అప్పగా తీసుకోండి...దానికి తమ ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందని సదరు కార్పొరేషన్ తో చెప్పారు.

దానిలో కూడా తప్పేమీలేదు. అనేక కార్యక్రమాలకు చేసినట్లే అప్పులు చేశారని భావిస్తాం. కానీ నేరుగా అప్పుల తాలూకా సొమ్ము, నేరుగా ప్రభుత్వ ఖజానాకు రాకుండా, నిధులన్నీ కార్పొరేషన్ అకౌంట్లోకి పోయేలా ప్రభుత్వం జీవో ఇవ్వడమేంటి? రాష్ట్రం విధించే ఏ పన్నైనాసరే, రాష్ట్రఖజానాలోకే రావాలని రాజ్యాం గంచెబుతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన జీవోనెం -92 సంగతేంటి? ఆ జీవో ద్వారా ఏపీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తీసుకునే రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది. ఆ జీవోపై టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టుకి వెళితే, అక్కడే తాము ఎలాంటి గ్యారంటీలు ఇవ్వలేదని బుకాయించారు. జీవోలో ఒకటిచెప్పడం, కోర్టులో మరోటి చెప్పడం, అసెంబ్లీలో చెప్పకుండా దాయడం.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో మంత్రికి తెలియదా? రూ.25వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ, ప్రభుత్వమిచ్చిన విషయాన్ని శాసనసభకు తెలియ చేయకుండా ఎందుకు దాచారు? దాచాల్సిన అవసరమేమిటి. ఏదైనా అడిగితే సంవత్సరాల తరబడి సమాధానమివ్వరు. ఇదివరకు బుర్ర కథలని చెప్పుకునే వాళ్లం. కానీ ఇకనుంచి బుగ్గన కథలని చెప్పుకోవాలేమో. రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన జీవోని నమ్మాలా...లేక ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకి చెప్పింది నమ్మాలా...లేక శాసనసభకు ప్రభుత్వమిచ్చిన తప్పుడు సమాచారం నమ్మాలా? ఇవేవీకాకుండా రుణాలకోసం బ్యాంకులకు ఏమని గ్యారంటీ ఇచ్చారో అది తెలుసుకోవాలా? బ్యాంకుకు ఏమని చెప్పారో, ఏమని గ్యారంటీ ఇచ్చారో ప్రభుత్వం ఎందుకు శాసనసభ ముందుంచ లేదు? ప్రశ్నిస్తున్న తమకు సమాధానంచెప్పకపోయినా, ప్రజలకుచెప్పాలికదా? రూ.25వేలకోట్ల రుణం తాలూకా వివరాలు, బ్యాంక్ గ్యారంటీ వివరాలు దాచినట్లు, ఈపాలకు లు ఇంకెన్ని దాచారో?

అమరావతిలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అక్రమంగా భూములు కొనుగోలు చేసారు అంటూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పై , హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్టే ని సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం ఉపర్`సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దాని పై ఈ రోజు, వినీష్ శరన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ చేసింది. ఈ విచారణలో ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదించారు. ఆయన వాదిస్తూ, ఈ కేసు విచారణలో హైకోర్టులోనే విచారణ జరగాలని, ఈ కేసు విచారణ హైకోర్టులోనే జరిగేందుకు అనుమతి ఇవ్వండి, మేము దాఖలు చేసిన పిటీషన్ ను కూడా ఉపసంహరించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వండి అంటూ, కోర్టుని కోరారు. అయితే ఆ సందర్భంగా దమ్మాలపాటి తరుపున హాజరైన సిద్ధార్ధ లుత్రా అసలు ఈ కేసులో స్టే విధించాలని వాళ్ళు ఈ పిటీషన్ లో కోరలేదని అన్నారు. దీనికి ఏపి ప్రభుత్వం తరుపు ధావన్ మాట్లాడుతూ, మేము ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వెంటనే దాని పై కోర్టుని ఆశ్రయించారు, సాయంత్రానికే హైకోర్టు స్టే ఇచ్చిందని, గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిందని, వాటిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వచ్చామని, సుప్రీం కోర్టు గ్యాగ్ ఆర్డర్ ని తొలగించిందని, అక్కడి వరుకే ఈ పిటీషన్ పరిమితం అని అన్నారు.

sc 13072021 2

ఏపి ప్రభుత్వం తరుపు లాయర్ వాదిస్తూ, ఈ కేసు విచారణ సుప్రీం కోర్టులో విచారణ జరగటానికి వీలు లేదని, ఈ కేసు విచారణ సుప్రీం కోర్టులోనే జరగాలని, కాబట్టి హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని, మేము వేసిన పిటీషన్ కూడా ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా ఈ కేసులో, సిబిఐ దర్యాప్తుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని, కోర్టు కూడా సిబిఐ విచారణకు ఆదేశిస్తే మాకు అభ్యంతరం లేదని అన్నారు. అంతే కాకుండా, సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపవచ్చని, అంత వరకు కూడా ఎటువంటి దుందుడుకు చర్యలు మేము తీసుకోమని ఏపి ప్రభుత్వం తరుపున, సుప్రీం కోర్టుకు తెలిపారు. దమ్మాలపాటి తరుపున హాజరైన మరో న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ, వ్యవస్థ ప్రతీకారం ఇంకా ఎన్నాళ్లంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఉద్రిక్తతకు దారి తీసాయి. అయితే దీని పై సుప్రీం కోర్టు ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదు. దీని పై తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేస్తూ, ఆ రోజు మేము డిసైడ్ చేస్తాం అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మొదట ఎందుకు పిటీషన్ వేసింది, ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకుంటుంది అనేది అర్ధం కావటం లేదు.

మూడు రోజుల క్రితం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనానికి తెర లేపింది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, గవర్నర్ వద్దకు వెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చూపించకుండా రూ.41 వేల కోట్లు చెల్లించ విషయంతో పాటుగా, కాగ్ రాసిన లేఖను కూడా గవర్నర్ కు ఇచ్చి ఫిర్యాదు చేసారు. జమ ఖర్చులు లేకుండా, ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి అనేవి చెప్పకుండా, కనీసం ట్రజరీ కార్యాలయాలకు కూడా సమాచారం లేకుండా, బిల్లులు చెల్లించారు అంటూ టిడిపి ఆరోపించింది. అయితే కాగ్ కూడా దీనికి సంబంధించే లేఖలు రాయటంతో, ప్రభుత్వం పై ఒత్తిడి నెలకొంది. మొత్తం లెక్కలు ఇవ్వాలని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇచ్చింది కానీ దానికి లెక్కలు చెప్పలేదని కేశవ్ ఆరోపిస్తున్నారు. అయతే కేశవ్ ఆరోపణల పై, దాదాపుగా మూడు రోజులు తరువాత, నాలుగో రోజు ఆర్ధిక మంత్రి బుగ్గన మీడియా ముందుకు వచ్చి, ఇది చాలా చిన్న విషయం అని తేల్చి పారేస్తూ, మీడియా సమావేశం మొదలు పెట్టారు. రూ.41 వేల కోట్లకు సంబంధించి ఆరోపణలు వస్తే, చాలా తేలికగా తీసి పడేసారు బుగ్గన. ఇవన్నీ అసలు అర్ధం లేని ఆరోపణలు అని అన్నారు. ఆడిట్ సంస్థలు ప్రశ్నలు వేస్తే, అవి పట్టుకొచ్చి ఆరోపణలు చేయటం ఏమాత్రం సమంజసం కాదని బుగ్గన అన్నారు.

buggana 13072021 2

ఆడిట్ సంస్థలు సవా లక్ష ప్రశ్నలు ప్రతి రోజు వేస్తూనే ఉంటాయని, వాటికి మేము సమాధానం చెప్తాయని, చాలా తేలికగా తీసి పడేసారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆడిట్ సంస్థలు అనేవి అంత తేలికగా ప్రశ్నలు వేయవు. ఆడిట్ సంస్థలు అనేవి చట్ట పరిధిలో పని చేసే, సంస్థ. ఆ సంస్థ ప్రశ్నలు వేస్తే, జవాబుదారీగా ఉండాల్సిన విషయం తెలిసిందే. అయితే వీళ్ళు వేసిన ప్రశ్నలకు ఆరోపణలు చేయకూడదని బుగ్గన తేల్చేసారు. అయితే రూ.41 వేల కోట్లకు లెక్కలు ఉన్నాయని చెప్పారు కానీ, దేనికి ఖర్చు పెట్టాం అనేది ఒక్క ఉదాహరణ కూడా చెప్పలేదు. అయితే మార్చ్ లో లేఖ రాస్తే, ఇప్పటికే లెక్కలు ఎందుకు బయట పెట్టటం లేదో అర్ధం కావటం లేదు. ఇక అన్నిటికంటే హైలైట్ ఏమిటి అంటే, రూ.41 వేల కోట్ల అవకతవకలకు చంద్రబాబు కారణం అని, ఆయన తెచ్చిన సీఎఫ్‍ఎంఎస్ వ్యవస్థ వల్లే ఈ ఇబ్బందులు వచ్చాయి అంటూ, బుగ్గన తేల్చి పడేసారు. మొత్తానికి ఈ రూ.41 వేల కోట్ల విషయంలో కూడా చంద్రబాబు కారణం అని తేల్చి చెప్పటంతో, అందరూ అవాక్కయ్యారు.

Advertisements

Latest Articles

Most Read