జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, తెలంగాణాతో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే, చంద్రబాబు లాగా జగన్ గట్టిగా ఆడగలేరు కాబట్టి, కేసీఆర్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. జగన్ మొహన్ రెడ్డిని వాటేసుకోవటం, భోజనాలు పెట్టివ్వటం ఇవ్వన్నీ చూసాం. జగన్ మోహన్ రెడ్డి కూడా, ప్రమాణస్వీకారం కూడా అవ్వకుండానే, క్యాబినెట్ లో చర్చించకుండా, రాత్రికి రాత్రి, హైదరాబాద్ సచివాలయంలో ఉన్న ఏపి భవనాలు తెలంగణాకు ఇచ్చేసారు. మన దగ్గర ఉన్న గోదావరి నీరు, తెలంగాణా నుంచి పంపిస్తాం, కేసీఆర్ మ్యగ్నానమస్ అంటూ కీర్తించారు. అలాగే గతంలో చంద్రబాబు గొడవ చేసిన విద్యుత్ బకాయలు గురించి అడగటం లేదు. తొమ్మిది, పదో షడ్యుల్ ఆస్తులు విభజన ఇంకా పెండింగ్ లోనే ఉంది. అందుకే ఏమో చంద్రబాబు కంటే, జగన్ రావాలని కేసీఆర్ కోరుకున్నారు. గత రెండేళ్లుగా ఇవన్నీ బాగానే సాగాయి. అయితే ఏమైందో ఏమో కానీ, ఏమి లేకుండా, అటు వైపు నుంచి తెలంగాణా అందుకుంది. గత పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల పధకం కడుతున్నారని, నీళ్ళు అన్నీ తోడేస్తున్నారు అంటూ, హడావిడి మొదలు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు అన్నారు, జగన మోహన్ రెడ్డి దొంగ అన్నారు, ఇలా ఎన్నో మాటలు అటు వైపు నుంచి వచ్చాయి.
అయితే ఇటు వైపు మాత్రం మౌనం. నిన్నటి నుంచి తెలంగాణా మరింత ముందుకు వెళ్ళింది. నీళ్ళు సరిపడా లేకపోయినా శ్రీశైలం సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టారు. దీంతో రాయలసీమకు దక్కాల్సిన నీళ్ళు ఆగిపోతున్నాయి. అలాగే పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు, దీంతో అక్కడ కృష్ణా డెల్టాకు నీళ్ళు రాని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అయ్యింది. ఇంకేముంది, తెలంగాణ పై సమరమే అని అందరూ అనుకున్నారు. అయితే కేవలం ప్రధానికి లేఖ రాయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు కాబట్టి, ఓర్పుగా ఉంటున్నామని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై విమర్శలు వస్తున్నాయి. మరి గతంలో ప్రతిపక్ష నేతగా జలదీక్షలు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుకురాలేదా అని విమర్శలు వస్తున్నాయి. అప్పుడు పోరాడినట్టే, ఇప్పుడు ఎందుకు తెలంగాణా పై పోరాడరు, ఎందుకు ఈ బేల మాటలు అనే ప్రశ్నలు వస్తున్నాయి.