గత నెలలో తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక, 11 మంది మరణించిన సంఘటన పై , ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. తిరుపతి పట్టణ వాసి ఒకతను, ఈ అంశం పై, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ఈ వ్యాజ్యం తరుపున అడ్వొకేట్ బాలాజీ వాదించారు. రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక, మరణించిన సంఘటన పై నేటి వరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని చెప్పారు. అదే విధంగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మరణించిన వారికి, ఒక్కొక్కరికి కోటి రూపాయలు సాయం చేసి, తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక చనిపోయిన వారికి మాత్రం, కేలవం పది లక్షల రూపాయలు పరిహారంగా ఇచ్చారని, ఇదేమి ద్వంద్వ విధానం అని ప్రశ్నించారు. అది ప్రైవేటు సంస్థలో జరిగినా కోటి ఇచ్చారని, ఇక్కడ ప్రభుత్వ బాధ్యత ఉన్నా కేవలం పది లక్షలు ఇచ్చారని అన్నారు. ఇది మంచి పద్దతి కాదని అన్నారు. ఈ నేపధ్యంలో హైకోర్టు స్పందిస్తూ, తిరుపతి రుయా ఘటన పై, పూర్తీ నివేదిక మా ముందు ఉంచాలని ఆదేశించింది. అదే విధంగా దీని పై ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదని పిటీషనర్ తరుపు న్యాయవాది ప్రశ్నించిన సందర్భంలో, హైకోర్టు కలుగు చేసుకుని, దీని కంటే ఎక్కువగా తాము ఆలోచిస్తున్నాం అని హైకోర్టు చెప్పింది. అదే విధంగా, దీంతో పాటు, హైకోర్టులో మరో ఆసక్తికర సంఘటన జరిగింది.

hc 280962021 2

రుయా హాస్పిటల్ లో మరణించిన కుటుంబాలకు ఇప్పటికే పరిహారం చెల్లించామని ప్రభుత్వం విపు నుంచి చెప్పగా, అసలు ఎవరి బాధ్యత ఇందులో ఉందని పరిహారం చెల్లించారు ? ఇందులో అసలు ఎవరు బాధ్యులు ? ఎందుకు ఆక్సిజన్ ఆగిపోయింది ? అధికారులు ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోయారు ? ఆక్సిజన్ లేక మరణిస్తే, దీనికి ఎవరు బాధ్యులు ? ఎవరు దీనికి బాధ్యులో చెప్పాలని చెప్పి, హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటికీ సంబంధించి, తమకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారల లోపు, ఈ నివేదిక తమ ముందు ఉంచాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం నివేదిక తమ ముందు ఉంచిన తరువాత, దీని పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు చెప్పింది. రెండు వారాల తరువాత నివేదిక వచ్చిన తరువాత, దీని పై తగు చర్యలు తీసుకుంటాం అని, హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు రెండు వారాలకు వాయిదా పడింది.

పది రోజులు క్రితం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై, యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రతి రోజు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై విద్యార్ధి సంఘాలు మండి పడుతున్నాయి. పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2.30 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, రెండేళ్ళ తరువాత, కేవలం 10 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటూ ప్రకటన ఇవ్వటం పై విద్యార్హులు మండి పడుతున్నారు. మరీ ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు కేవలం 36 పోస్టులు ప్రకటించటం, అలాగే సున్నా ఉపాధ్యాయ ఉద్యోగాలు ప్రకటించటం, వేళల్లో పోలీస్ ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే, కేవలం 400 ఉద్యోగాలు ప్రకటించటం, ఇలా అనేక అంశాల పై యువత, జగన్ మోహన్ రెడ్డి పై ఆగ్రహంగా ఉన్నారు. ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకుని వస్తాను, ఇక ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోతుంది, ఉద్యోగాలే ఉద్యోగాలు అని చెప్పి, ఇప్పుడు ప్రత్యెక హోదా దేవుడి దయ ఉంటేనే వస్తుందని జగన్ మాట మార్చటం, పైగా కంపెనీలు అన్నీ ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోతూ ఉండటం, ఒక్క కొత్త పెట్టుబడి కూడా రాకుండా ఉండటం, ఇలా అనేక అంశాల పై యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

job 28062021 2

అటు ప్రైవేటు ఉద్యోగాలు లేక, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించక ఎలా బ్రతకాలి అంటూ, యువత రోడ్డు ఎక్కారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్ధి సంఘాలు చలో కలక్టరేట్ పిలుపు ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఈ రోజు అన్ని జిల్లాల్లో యువత రోడ్డు ఎక్కారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులకు చుక్కలు చూపిస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్‌ ముట్టడికి విద్యార్ధి సంఘాలు వెళ్ళాయి. డీఆర్‍సీ సమావేశం కోసం వాచ్చిన మంత్రులు అనిల్, బుగ్గన ఉన్నారు. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నం చేసారు. అలాగే విజయనగరంలో మంత్రి బొత్స ఇంటి ముట్టడికి ప్రయత్నం చేసారు. విశాఖలో మంత్రి అవంతి ఇల్లు ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేసాయి. ఇక తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇల్లు ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. అలాగే మంత్రి ఆళ్ళ నాని ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం చేసారు. అయితే పోలీసులు అలెర్ట్ అయ్యి, ఎక్కడికక్కడ విధ్యార్ధులను అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, యువత ఎదురు తిరగటం మొదలు పెట్టింది.

ప్రజలను ఒక ఎమోషన్ లోకి నెట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవటం, మన రాజకీయ నాయకులకు బాగా అలవాటు. ఈ మధ్య రాజకీయాలు చూస్తుంటే, ఇది తప్పు కాదేమో అని కూడా అనిపిస్తుంది. ప్రజలు కూడా మంచి చెడు ఆలోచన చేసే విజ్ఞత ప్రదర్శించక, ఈ ఎమోషన్ కు పడిపోతూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణాలో ఉన్న కేసీఆర్, ఇక్కడ ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఇందులో సిద్దహస్తులు. చంద్రబాబుకు మాత్రం, ఇలాంటివి చేతకాక, రాజకీయంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా కేసీఆర్ , తనకు రాజకీయంగా ఇబ్బంది వస్తుంది అంటే చాలు, ఆంధ్రా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, చంద్రబాబు తిప్పి కొట్టేవారు. అయితే చంద్రబాబు స్పందన కోసమే ఎదురు చేసే కేసీఆర్, చంద్రబాబుని బూచిగా చూపించటంలో సక్సస్ అయ్యే వారు. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు, ప్రతిసారి చంద్రబాబుని బూచిగా చూపించి రాజకీయం సక్సస్ అయ్యే వారు. ఇప్పుడు అధికారంలో జగన రెడ్డి ఉండటం, కేసీఆర్ - జగన్ వాటేసుకుని తిరుగుతున్నారు అనే ప్రచారం ప్రజల్లో ఉండటంతో, ఇది తనకి రాజకీయంగా ఏ మాత్రం ఉపయోగ పడదు అనుకున్నారో ఏమో కానీ, దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. అయితే లోపల జగన్ తో ఎలా ఉన్నా, బయటకు మాత్రం తిట్టేస్తున్నారు.

cbn 27062021 2

గత వారం రోజులు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్ళు ఎక్కువ తీసుకుని పోతుందని హడావడి చేస్తున్నారు.  ఇందులో భాగంగా జగన్ ని దొంగ అంటున్నారు, రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడు అంటున్నారు. అయినా జగన్ వైపు నుంచి స్పందన మాత్రం లేదు. ఇవన్నీ చూస్తుంటే, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా కనిపిస్తుంది. అయితే జగన్ స్పందించినా స్పందించిక పోయినా, పెద్దగా లాభం లేదు కానీ, చంద్రబాబు స్పందించాలని ఇరువురు నేతలు కోరుకుంటున్నారు. చంద్రబాబు తెలంగాణాకు వ్యతిరేకంగా స్పందిస్తే, మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టవచ్చని కేసీఆర్ ఆలోచన. ఇక జగన్ ఏమో, చంద్రబాబు ఈ విషయం పై స్పందించాలి అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ గేమ్ అంతా అర్ధమైన చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు గ్రౌండ్ జీరో లో ఈ విషయంలో ఏమి జరగకపోయినా, హడావిడి అంతా ఉత్తుత్తిదే అని, ఏదైనా ఉంటే అది జగన్, కేసిఆర్ చూసుకోవాలనే ధోరణిలో చంద్రబాబు ఉన్నారు. విషయం మరీ ముదిరితే తప్పితే చంద్రబాబు స్పందించే అవకాశమే లేదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కల, 42 ఎంపీ సీట్లు గెలిపించి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటం. ఆయన ఎప్పుడూ ఇదే మాట చెప్తూ ఉండేవారు. తరువాత ఆయన అకాల మరణం తరువాత, జగన్ మోహన్ రెడ్డి కూడా ఒక సందర్భంలో 42 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీని గెలిపించటమే నా కల అని చెప్పే వారు. తరువాత జరిగిన పరిణామాల్లో జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు దూరం అయ్యారు. తన అక్రమాలు అన్నీ కాంగ్రెస్ బయట పెట్టింది అనే అక్కసుతో ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యి, కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉండేవారు. ఈ క్రమంలో బీజేపీతో అవగాహన కూడా చేసుకున్నారు. తన పార్టీ పేరులోనే కాంగ్రెస్ ని పెట్టుకున్నారు కూడా. ఎందుకంటే తన తండ్రి పేరుతో ఓట్లు అడిగారు కాబట్టి, కాంగ్రెస్ క్యాడర్ ని తన వైపు లాక్కోవటానికి. మొత్తానికి తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసి, తన సంపాదనుకు కూడా కారణమైన కాంగ్రెస్ పార్టీ పై జగన్ మోహన్ రెడ్డి ద్వేషం పెంచుకున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఆకట్టుకోవటానీకో, లేక నరేంద్ర మోడీని మంచి చేసుకోవటానికో కానీ, విజయసాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ విరుచుకు పడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నాలుగు నెలల క్రితం కూడా, రైతు చట్టాల పై దేశమంతా బీజీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో, విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు చేసారు.

vsreddy 28062021 2

కాంగ్రెస పార్టీ దళారీ అని, కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అసహ్యం అంటూ, నరేంద్ర మోడీ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి గారికి, కాంగ్రెస్ పై విమర్శలు చేసి, బీజేపీ పెద్దల దృష్టిలో పడే అవకాసం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఒక ట్వీట్ చేసారు. లేబర్ ఫోర్సు లో, మహిళల భాగస్వామ్యం పై, పార్లమెంటరీ కమిటీ, మినిస్ట్రీ అఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ ను కొన్ని వివరాలు అడిగితే, తమ దగ్గర ఎటువంటి సమాచారం లేదని సమాధానం వచ్చిందని, మినిస్ట్రీ అఫ్ ఎంప్లాయిమెంట్ పేరుని మినిస్ట్రీ అఫ్ మేల్ ఎంప్లాయిమెంట్ అని మార్చుకోవాలని ట్వీట్ చేసారు. దీనికి విజయసాయి రెడ్డి కలుగు చేసుకుని, పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ లు రహస్యం అని, హౌస్ లో పెట్టే దాకా ఆ విషయం బయటకు చెప్పం అని, చిదంబరం పై చర్యలు తీసుకోవాలని, రాజ్యసభ చైర్మెన్ ని కోరుతాను అంటూ ట్వీట్ చేసారు. గతంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి ఏదో అన్నారని, జగన్ కలుగు చేసుకుని ట్వీట్ చేస్తే, ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే పనిలో ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read