తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడవారధిని అలిపిరి వరకు పొడిగించాలన్న టీటీడీ నిర్ణయం సరైంది కాదని, ట్రాఫిక్ పెరుగుతుందన్న సాకుతోవారధి పొడవును పెంచాలనుకోవడం సమంజసంకాదని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ స్పష్టంచేశారు. శనివారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి కపిలతీర్థం వరకు (సుమారు 7కిలోమీటర్లు) వారధికట్టాలని భావించి, వెంటనే శంఖుస్థాపన కూడా చేయడం జరిగిందన్నారు. 2019లో టీడీపీప్రభుత్వం దిగిపోయేనాటికి వారధి నిర్మాణానికి అవసరమైన పిల్లర్లనిర్మాణం సహా, దాదాపు 60శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వైసీపీప్రభుత్వంవచ్చిన రెండేళ్లతరువాత తాపీగా వారధినిర్మాణంపై దృష్టిపెట్టిందని, కపిలతీర్థం వరకు అనుకున్న నిర్మాణాన్ని, నందిసర్కిల్ వరకు పెంచాలని తీర్మానించారన్నారు. వారధి నిర్మాణాన్ని ఎందుకు పెంచుతున్నారు.. ఎవరికోసం పెంచుతున్నారనే దానిపై ప్రభుత్వంగానీ, టీటీడీగానీసమాధానమివ్వడంలేదని టీడీపీనేత తెలిపారు. సహజంగా ట్రాఫిక్ సమస్యలున్నప్పు డు, ఫ్లైఓవర్లనిర్మాణం చేస్తుంటారని, కపిలతీర్థంనుంచి నందిసర్కిల్ కు వెళ్లడానికి మంచిరోడ్లే ఉన్నాయని, ఎక్కడా క్రాస్ రోడ్లుకూడా లేవన్నారు. అలాంటప్పుడు వారధి నిర్మాణాన్ని పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని బుచ్చిరామ్ ప్రసాద్ ప్రశ్నించారు. వారధినిర్మాణం పొడిగించ డం వల్ల, అదనంగా రూ.200కోట్ల వరకు ఖర్చవుతుందన్నా రు. టీడీపీ ప్రభుత్వం రూ.284కోట్లతో వారధినిర్మాణటెండర్లు పిలిచి, దాదాపు 60శాతం పనులు పూర్తిచేశాక, మిగిలిన దాన్ని పూర్తిచేయకుండా, దాన్ని పొడిగించాల్సిన అవసరం ప్రభుత్వానికేమిటన్నారు. టీడీపీప్రభుత్వం ఉన్నప్పుడే వారధి నిర్మాణానికి టీటీడీ 66శాతం నిధులివ్వడానికి ఒప్పుకుందని, మిగిలినదాన్ని ప్రభుత్వం భరించడానికి సమ్మతించిందన్నారు. వారధి నిర్మాణంపూర్తయి ప్రారంభానికి సిద్ధమైన తరుణంలో ప్రభుత్వం, టీటీడీ ఇలాంటి తెలివితక్కువనిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. గరుత్మంతుడు, శ్రీవేంకటేశ్వరస్వామి పై ఉన్న గౌరవం, మర్యాద, భక్తిప్రపత్తులను గమనించి, ప్రభుత్వంప్రజలను బాధపెట్టే నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిదన్నారు. కపిలతీర్థంవరకు మాత్రమే తిరుపతిలో ఉన్నట్లు అనిపిస్తుందని, అక్కడినుంచి నందిసర్కిల్ వరకు తిరుమలకు వెళుతున్నట్టే అనిపిస్తుందన్నారు. కుడివైపున శ్రీ వేంకటేశ్వరస్వామి అభయారణ్యం పచ్చగా కనువిందు చేస్తుంటుందన్నారు.
తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే, భక్తుల మనోభావాలను, వారి చూపులకుకనువిందుచేసే సుందరప్రదేశాలను కనిపించకుండా, చేసేలా వారధి నిర్మాణాన్ని పొడిగించవద్దని బుచ్చిరామ్ ప్రసాద్ విజ్ఞప్తిచేశారు. తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వారధినిర్మాణాన్ని పొడిగించేచర్యలను తక్షణమే విరమించుకోవాలన్నారు. టీటీడీ ఈవో/ఛైర్మన్ గా ఉన్న జవహర్ రెడ్డి, టీటీడీ జేఈవో తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. అలానే తిరుమల తిరుపతి దేవస్థానంఆధ్వర్యంలో రాజధాని అమరావతిలో నిర్మించతలపెట్టిన శ్రీవారి ఆలయం, కళ్యాణమండపాల నిర్మాణాలకు గతప్రభుత్వం రూ.64కోట్లు కేటాయించిందన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణాన్నే ఎడారిగామార్చిందని, అమరావతిలో నిర్మించాల్సిన శ్రీవారి ఆలయనిర్మాణాన్నికూడా నిలిపివేసిం దన్నారు. ఎక్కడోకాశ్మీర్ లో గుడికడతామంటున్న టీటీడీ వారు సొంతరాష్ట్రంలోని రాజధానిప్రాంతంలో ఆలయం నిర్మించడానికి ఎందుకు మీనమేషాలులెక్కిస్తున్నారో తెలియడం లేదన్నారు. రాజధానిలో నిర్మించదలచిన వేంకటేశ్వరస్వామి ఆలయనిర్మాణం పూర్తైతే, చిన్న తిరుమలగా ఖ్యాతిచెందుతుందన్నారు. వారధి నిర్మాణాన్ని పొడిగించడం కమీషన్లకోసమేనన్న అనుమానం తమకు కలుగుతోందని విలేకరులు అడిగినప్రశ్నకు సమాధానంగా బుచ్చిరామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇంజనీర్ల ఆమోదం లేకుండా, 2, 3నెలల్లో పూర్తయ్యే నిర్మాణాన్ని ఉన్నట్టుండి 4 కిలోమీటర్లు ఎందుకు, ఎవరికోసం పొడిగిస్తున్నారో దేవా దాయమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమాధానంచెప్పాలన్నారు.