పేరు చివరన రెడ్డి ఉందని ఒకే ఒక్క కారణంతో జగన్ రెడ్డికి మద్దతు ఇచ్చిన రెడ్లు ఇప్పుడు తమలో తాము మథనపడుతున్నారు. ఇంత అరాచకుడికి మద్దతు ఎందుకు ఇచ్చామని తలలు పట్టుకుంటున్నారు. మాజీ మంత్రి ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డు వంతు వచ్చింది. వైసీపీకి నెల్లూరులో ఎదురులేని విజయం కట్టబెట్టడంలో రెడ్డి సామాజికవర్గ నేతలు ఎంతో కృషి చేశారు. వార్డు మెంబర్ల నుంచి పార్లమెంటు మెంబర్ల వరకూ అంతా వైసీపీ వారే గెలిచారంటే ఏ స్థాయిలో పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. కులాభిమానం, ఆర్థిక సహకారం నెల్లూరు పెద్దారెడ్ల నుంచి జగన్ రెడ్డికి బాగానే అందింది. వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన నెల్లూరు పెద్దారెడ్లలో ఒక్కొక్కరినీ దూరం పెడుతూ వస్తున్నారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి. అప్రతిహత గెలుపు తెచ్చిన అహంకారం జగన్ మోహన్ రెడ్డిలో అణువణువూ పేరుకుపోయింది. తన క్రైమ్ పార్టనర్ విజయసాయిరెడ్డిది కూడా నెల్లూరే. ముందుగా సాయిరెడ్డిని దూరం పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆనం రాం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి అన్నీ తామైన నెల్లూరు పెద్దారెడ్లకి జగన్ రెడ్డి పెద్ద దెబ్బే వేశారు.
news
జగన్ నెక్స్ట్ డైవర్షన్ ప్లాన్ ఏంటి ? చంద్రబాబుని అరెస్ట్ చేస్తాడా ?
డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిపోయిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి, మరో ప్రమాదకర ఎత్తుగడకి తెరతీస్తున్నాడని అనుమానాలు వస్తున్నాయి. బాబాయ్ హత్యకేసులో అడ్డంగా బుక్కయిపోయిన అబ్బాయ్ అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ వెళ్లి వచ్చాడు. అవినాష్ దర్యాప్తు కూడా ఆగిపోయింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు వివేకా హత్యకేసు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని వార్తలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్టు అయితే దానిని డైవర్ట్ చేయడానికి ఏకంగా చంద్రబాబుని అరెస్ట్ చేయాలనే వ్యూహంతో జగన్ రెడ్డి పావులు కదుపుతున్నాడని అర్థం అవుతోంది. రాజధాని భూముల కేసులో ఏమీ చేయలేకపోయాడు. అలైన్ మెంట్ మార్పు పేరుతో టిడిపి కీలకనేత నారాయణ వైపు సీఐడీని పంపాడు. అదీ వర్కవుట్ అవ్వలేదు. మార్గదర్శి కేసులంటూ ఈనాడు రామోజీరావుపై దృష్టి సారించినా, అదీ బెడిసి కొట్టినట్టే ఉంది. ఎమ్మెల్సీల ఓటమి, వివేకా హత్య కేసు అరెస్టుల నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే ఏదైనా పెద్దది చేయాలనుకుంటున్నారని వైసీపీ క్యాంప్ నుంచి లీకులు వస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పేరుతో చంద్రబాబుని అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని, బాబాయ్ హత్యకేసులో తమ అరెస్టులని జనం లైట్ తీసుకుంటారని..జగన్ భావిస్తున్నారని వైసీపీ నేతలే నర్మగర్భంగా చెబుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని, ఇందులో చంద్రబాబు, లోకేష్ అరెస్టు అవుతారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ మీడియాకి చెబుతూ జగన్ రెడ్డి వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు.
ఎంపీ రామ్మోహన్ అక్కని జగన్ బెదిరించారా? వైసీపీ బెదిరింపులు మాములుగా లేవు...
దివంగత కింజరాపు ఎర్రంనాయుడు కుమార్తె భవానీని సీఎం వైఎస్ జగన్ రెడ్డి టార్గెట్ చేశారా? ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సోదరిపై వైసీపీ పెద్దలు కక్ష సాధింపులకు పాల్పడ్డారా? ఇవేవో గాసిప్స్ కావు. ఎర్రన్న సోదరుడు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించిన కఠోర వాస్తవాలు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అయిన ఎర్రన్న కుమార్తె భవానీని టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనూరాధకి ఓటేయవద్దంటూ వైసీపీ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఓటింగ్ కి గైర్హాజరు కాకపోతే, భవానీ మామ, భర్తలని అరెస్టు చేయిస్తామంటూ వైసీపీ పెద్దల నుంచి వార్నింగ్ ల మీద వార్నింగులు వచ్చాయని అచ్చెన్నాయుడు వివరించారు. అయినా సరే తన అన్న కుమార్తె ధైర్యంగా వచ్చి ఓటేశారని వివరించారు. అంటే టిడిపి నుంచి నలుగురి ఎమ్మెల్యేలను పశువుల్లా కొనడమే కాకుండా, ఉన్న టిడిపి ఎమ్మెల్యేలనూ టిడిపి అభ్యర్థికి ఓటేయకుండా చూడాలని జగన్ రెడ్డి చేసిన కుతంత్రాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎర్రన్న కుమార్తె భవానీ భర్త, మామ వ్యాపారాలను బూచిగా చూపించి ప్రతీసారీ వైసీపీ పెద్దలు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారని తెలుస్తోంది. చిట్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లు మూయించేస్తామని, సీఐడీతో దాడులు చేయిస్తామని వైసీపీ బెదిరించి, టిడిపి అభ్యర్థికి ఓటేయకుండా చూడాలనే వ్యూహం ఈ సారికి బెడిసికొట్టింది. గత సారి రాజ్యసభ ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్లకుండా వేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అంటే అప్పుడు కూడా వైసీపీ బెదిరింపులతోనే ఇలా చేసి వుండొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.
అవినాష్ రెడ్డి అరెస్ట్ వార్తలు సడన్ గా ఎందుకు ఆగిపోయాయో తెలుసా ?
తన బాబాయ్ హత్యకేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని, నేడో రేపో అరెస్టు తప్పదని సీబీఐయే ప్రకటించింది. కోర్టుకి కూడా ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తెలియజేసింది. కోర్టు కూడా సీబీఐ ఇచ్చిన విచారణ ప్రాసెస్, వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాలు పరిశీలించి సీబీఐ అరెస్టుని ఆపలేమని ప్రకటించింది. దీంతో ఆ తరువాత రోజు వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను సీబీఐ అరెస్టు చేస్తుందని అంతా అనుకున్నారు. సడెన్‌గా అసెంబ్లీ సమావేశాలు కూడా వదిలేసి జగన్ రెడ్డి అవినాష్ రెడ్డిని తీసుకుని ఢిల్లీ చేరాడు. మోడీ, అమిత్ షాలను కలిశాడు. అటునుంచి జగన్ రెడ్డి వచ్చిన వెంటనే సీబీఐ అవినాస్ రెడ్డిని విచారణకి కూడా పిలవడంలేదు. ఏపీకి సంబంధించి అదానీ అడిగిన కీలక ఆస్తులు అప్పగించడానికి జగన్ రెడ్డి సై అనడంతో అదానీ కేంద్రంలో పెద్దలను మేనేజ్ చేశారని, దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోయిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. సీబీఐ అధికారి రాంసింగ్ ని కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించాలని అదానీని కోరగా, కోర్టు పరిధి అంశం కావడంతో సాధ్యం కాలేదని ప్రచారం సాగుతోంది. మొత్తానికి కేంద్రంలోని పెద్దలకు ఏ తాయిలాలు ఇచ్చాడో కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుని ఆపగలిగాడని జోరుగా ప్రచారం సాగుతోంది.