జగన్మోహన్ రెడ్డి సర్కారు కుంభకోణాల్లో అతిపెద్దదైన ఇసుక కుంభకోణం (శాండ్ స్కామ్) గురించి ప్రజలకు తెలియ చేయడానికే మీడియాముందుకొచ్చినట్లు టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! జగన్మోహన్ రెడ్డి పెద్దఎత్తున సహజవనరుల దోపిడీకి పాల్పడుతూ, వేలకోట్లనుదిగమింగుతున్నాడు. మరోపక్క మద్యం వ్యాపారం మొత్తాన్ని తనగుప్పెట్లో పెట్టుకొని లిక్కర్ డాన్ గా అవతరించాడు. కచ్చితమైన ఆధారాలతో, వాస్తవాలను బయటపెడుతూ, తెలుగుదేశం తరుపున ముఖ్యమంత్రిని, ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఇసుకను పొరుగురాష్ట్రాలకు తరలిస్తూ, ఇప్పటికీ వ్యాపారం చేస్తూనేఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలోనే పెద్ద శాండ్ స్మగ్లర్ గా పేరుప్రఖ్యాతులు పొందాడు. ఆయనకు చెందిన వందలాది లారీలు, చిత్తూరు జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుకు తరలిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. పెద్దిరెడ్డి లాంటి ఇసుక స్మగ్లర్లు, రాష్ట్రంలోని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీకి పాల్పడుతూ, ప్రజలపై వేలకోట్ల భారం మోపుతున్నారు. ఇసుక లారీని రూ.40నుంచి రూ.50వేలకు అమ్ముకుంటూ, దోపిడీచేసి, తాడేపల్లి ప్యాలెస్ కు పెద్దఎత్తున వేలకోట్ల సొమ్ము తరలించారు. ఆ తరువాత కేబినెట్ సబ్ కమిటీ వేశామని, రాష్ట్రవ్యాప్తంగాఉన్న ఇసుక రీచ్ లన్నింటినీ ఒక కంపెనీకి కట్టబెట్టి, పెద్దఎత్తున ఇసుక వ్యాపారం జరిగేలా చూస్తామని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఇసుక రీచ్ లన్నింటినీకూడా, ఒక బూటకపు టెండర్ తో, హోల్ సేల్ గా జయప్రకాశ్ వెంచర్స్ అనేకంపెనీకి కట్టబెట్టాడు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్ టీసీ (మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్) ద్వారా టెండర్లు పిలిచామని మాయ మాటలు చెప్పుకున్నారు. కావాలనే ముందుగా ప్లాన్ చేసి, జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు అనుగుణంగా ప్రణాళికలు సిద్దంచేశారు.
దివాళాతీసిన జేపీ వెంచర్స్ కంపెనీని, మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ఇసుక దోపిడీకి తెరదీశాడు. ఇసుక తవ్వకాల్లో ఎలాంటి అనుభవం లేని జయప్రకాశ్ వెంచర్స్ కు రాష్ట్రంలోని ఇసుకరీచ్ లన్నింటినీ ఎలా అప్పగిస్తారని తాను నెలక్రితమే ప్రశ్నించాను. ఇసుక రీచ్ లను ప్రభుత్వరంగ సంస్థలకు కట్టెబెడతామనిచెప్పిన ప్రభు త్వం, ప్రైవేట్ సంస్థలకు ఎలా కట్టబెడుతుందనికూడా పెద్దిరెడ్డిని నిలదీయడం జరిగింది. అప్పుడు మీడియా ముందుకొచ్చిన పెద్దిరెడ్డి, చాలా పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించామనిచెప్పారు. కేంద్రప్రభుత్వసంస్థ ఎంఎస్ టీసీఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ నిర్వహించామని, తమ పాత్రేమీలేదని పెద్దిరెడ్డి నెలక్రితం మీడియా ముందు నంగనాచిలా బుకాయించాడు. పెద్దిరెడ్డి పిట్టకథలుచెప్పడం మానుకోవాలి. ఆ వీడియోలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, తమకేమీ సంబంధం లేదని, టెండర్ల నిర్వహణ మొత్తం ఎంఎస్ టీసీ ఆధ్వర్యంలో నే జరిగిందని చెప్పారు. శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి అమాయకం గా మాట్లాడినంత మాత్రాన నిజాలు బయటకురాకుండా ఉం డవు. ఎంఎస్ టీసీ అనేది కేవలం ఒక ఈ-కామర్స్ ఫ్లాట్ ఫామ్ మాత్రమే. నిబంధనలు, విధివిధానాల తయారీలో ఆ సంస్థకు ఎలాంటి సంబంధముండదు. టెండర్ నిర్వహణ మాత్రమే ఎంఎస్ టీసీ చేస్తుంది.. గైడ్ లైన్స్ తో వారికి సంబంధముండదని గతంలోనేను అంటే, ఆరోజు పెద్దిరెడ్డి అడ్డగోలుగా బుకాయించాడు. అంతా ఎంఎస్ టీసీవారే చేశారన్నట్టుగా చెప్పాడు.
సమాచార హక్కుచట్టం ద్వారా ఎంఎస్ టీసీవారిని వివరాలు అడగడం జరిగింది. ఎంఎస్ టీసీ ద్వారా ఏపీలో ఇసుకకు సంబంధించి, మూడు ప్యాకేజీలకు చెందిన టెండర్లలో టెక్నికల్ గైడ్ లైన్స్ ఎవరు రూపొందించారని నేను అడగడం జరిగింది. ఎంఎస్ టీసీ ఇచ్చిన సమాచారంలో చాలా స్పష్టం గా చెప్పారు. ఇసుక టెండర్ కు సంబంధించిన టెక్నికల్ బిడ్ లో ఎంఎస్ టీసీ ఎటువంటి గైడ్ లైన్స్ రూపొందించలేద ని తేల్చిచెప్పారు. దీనిపై శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి ఏంసమాధానం చెబుతాడు? చాలా స్పష్టంగా టెక్నికల్ బిడ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను తాము రూపొందించలేదని ఎంఎస్ టీసీ తరుపున అడిషనల్ జనరల్ మేనేజర్ మలాయ్ మండల్ నాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంతో పెద్దిరెడ్డి గతంలో ఆడిన నాటకం, కుట్ర, ఇసుకమాఫియాలో దోపిడీకోసం ముఖ్యమంత్రి పన్నినకుట్ర బట్టబయలైంది. ప్రభుత్వమే గైడ్ లైన్స్ అన్నీ రూపొందించి, నింద మాత్రం ఎంఎస్ టీసీపై వేస్తారా? అంతా ఎంఎస్ టీసీ ద్వారానే జరిగినట్టు కలరింగ్ ఇస్తారా? ప్రజలంతా ఇప్పటికై నా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్న దగాకోరు లగురించి తెలుసుకోవాలి. శాండ్ స్మగ్లర్ ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పాడో, ఇదివరకే వీడియోలో చూశాం కదా? వేలకోట్లను దిగమింగడానికి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ అనే డమ్మీ కంపెనీని తెరపైకి తెచ్చారని తేలిపోయింది. ఈముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, సీఐడీ, ఏసీబీ విభాగాలను నేడు ఛాలెంజ్ చేస్తున్నాను. ఏసీబీని, సీఐడీని పెద్దిరెడ్డి ఇంటికి పంపించి, తక్షణమే ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలి. శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి అవినీతి బట్టబయలైంది. ఆయన ఇంటికి ఏసీబీ, సీఐడీని పంపించే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయించే దమ్ము, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నాయా? ఏరకంగా బూటకపు టెండర్లతో, టెక్నికల్ గైడ్ లైన్స్ రూపొందించి, డమ్మీ కంపెనీ అయిన జయప్రకాశ్ వెంచర్స్ కు ఇసుకరీచ్ లను అప్పగించారో ప్రజలంతా అర్థం చేసుకోవాలి.