ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతి రైతుల గురించి ఆలోచించకుండా, గతంలో ప్రభుత్వం వారితో కుదుర్చుకున్న ఒప్పందం తుంగలోకి తొక్కి, జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, అమరావతి రైతులు నిరసన బాట పట్టారు. అయితే ఇదే సందర్భంలో న్యాయ పోరాటం కూడా చేసారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన మూడు రాజధానుల జీవో పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసు పై పూర్తి స్థాయిలో వాదనలు వింటుంది. ఈ కేసు పై ఇప్పటికే నెల రోజులు పాటు హోరాహోరీగా వాదనలు కూడా జరిగాయి. త్వరలోనే ఈ కేసు పై హైకోర్టులో తీర్పు వచ్చే అవకాసం ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో, హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చే కొత్త చీఫ్ జస్టిస్, అమరావతి కేసు పై ఏమి చేస్తున్నారు అనే సస్పెన్స్ నెలకొంది. అమరావతి కేసుని మొదటి నుంచి మళ్ళీ వాదనలు వింటారా ? లేక ఇప్పటికే జరిగిన విచారణ గమనించి, ఆ కేసుని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సహజంగా ఇలాంటి పెద్ద కేసులు విషయంలో, జడ్జి మారితే మళ్ళీ మొదటి నుంచి వదానలు వింటారనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఇలా ఉంచితే, అమరావతి పై హైకోర్టు స్టే ఎత్తేయించటానికి, అనేక ప్రయత్నాలు కూడా జరుగుతన్నాయి.
వివిధ పిటీషన్లు హైకోర్టులో, సుప్రీం కోర్టులో వేస్తున్నారు. ఇదే కోవలో జి.శ్రీనివాస్‍రెడ్డి అని రాయలసీమకు చెందిన వ్యక్తితో పాటుగా మరి కొందరు, మూడు రాజధానులు విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టే ని ఎత్తివేయాలి అంటూ, సుప్రీం కోర్టులో పిటీషన్ వేసారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమ వాదనలు వినలేదని, పిటీషన్ లో తెలిపారు. ఈ కేసు పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు, పిటీషన్ వేసిన వారికి షాక్ ఇచ్చింది. హైకోర్టు స్టే ఎత్తివేయటం కుదరదని సుప్రీం కోర్టు చెప్పింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తులుగా మీరు పిటీషన్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఎదింగా సంఘంగా పిటీషన్ వేస్తే, దాని గురించి ఆలోచించాలని, చెప్తూ, హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయటానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు హైకోర్టు మీదే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో, వాదనలు దాదాపుగా విన్న హైకోర్టు, త్వరలోనే తీర్పు ఇస్తుంది అనుకున్న తరుణంలో, చీఫ్ జస్టిస్ బదిలీతో, నెక్స్ట్ ఏమి జరుగుతుంది అనే సస్పెన్స్ నెలకొంది.