దేశంలో క-రో-నా రోజు రోజుకీ పెరిగిపోతుంది. 21 రోజుల లాక్ డౌన్ పెడితే, అంతా సర్దుకుంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే, తరువాత క-రో-నా ఎక్కడ తగ్గక పోగా, ఇంకా పెరుగుతూ ఉండటంతో, మరో 21 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ సమయాన్ని, సరిగ్గా వినియోగం చేసుకోవాలని, ఈ లాక్ డౌన్ సమయంలోనే, క-రో-నా పాజిటివ్ ఉన్నవారిని గుర్తించి, వారిని వేరు చేస్తే, చాలా వరకు ఈ క-రో-నా తగ్గుతుందని కేంద్రం భావించింది. రాష్ట్రాలను ఎక్కువగా క-రో-నా టెస్టులు చేసి, క-రో-నా ఉన్న వారిని గుర్తించాలని సూచించింది. అయితే ఇక్కడే కొన్ని రాష్ట్రాలు చూపిస్తున్న అత్యుత్సాహంతో, మొత్తం రివర్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా క-రో-నా-కి సరైన నిర్ధారణ, కేవలం, ఆర్టీ-పీసీఆర్ టెస్టు మాత్రమే. ముక్కు, గొంతు నుంచి తీసి, టెస్టింగ్ చేస్తారు. ఇది మాత్రమే కచ్చితమైన సమాచారం ఇస్తుంది. ఈ టెస్ట్ చేస్తేనే, కోరనా పాజిటివా, నెగిటివా అనేది కచ్చితంగా తెలుస్తుంది.
అయితే ఈ టెస్ట్ కొంచెం ఖరీదు ఎక్కువ, రిజల్ట్ రావటానికి టైం పడుతుంది. అయినా, ప్రపంచం అంతా ఇదే వాడుతుంది. అయితే ఐసీఎంఆర్, చెప్పిన రాపిడ్ టెస్టింగ్ విషయంలో, కొన్ని రాష్ట్రాలు తప్పుగా అర్ధం చేసుకోవటంతో, మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. రాపిడ్ టెస్టింగ్ అనేది, హాట్ స్పాట్లలో, క-రో-నా లక్ష్యాణాలు ఉన్న వారిని గుర్తించటానికి మాత్రమే, ఇవి ఉపయోగపడతాయి. అది కూడా కచ్చితమైన సమాచారం ఇది ఇవ్వదు. ఇది తక్కువ రేటు కావటం, అలాగే వెంటనే రిజల్ట్ వస్తూ ఉండటంతో, ఈ టెస్ట్ చేసేసి, ఎక్కువ టెస్టులు చేస్తున్నట్టు, కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం, ఇందులో ఉన్న రిస్క్ గుర్తించి, లోపాలు కేంద్రానికి చెప్పాయి. ఉదాహరణకు, రాజస్తాన్, పాజిటివ్ ఉన్న పేషంట్ కు, ఈ రాపిడ్ టెస్టింగ్ చేసినా నెగటివ్ రావటాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు.
దీంతో కేంద్రం, అన్ని రాష్ట్రాలను, ఈ రాపిడ్ టెస్టులు చెయ్యటం అపేయ్యలని చెప్పింది. అంతే కాదు, నిన్న ఈ విషయం పై అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాసారు. క-రో-నా టెస్టింగ్ విషయంలో, కేవలం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు మాత్రమే ప్రామాణికం అని స్పష్టం చేసింది. రాపిడ్ టెస్టులు, కేవలం లక్ష్యనాలు ఉన్నాయో లేదో, రోగ నిరోధక శక్తి ఎంత ఉందో తెలుసుకోవటానికే అని చెప్పింది. అంతే కాని, రాపిడ్ టెస్టులు చేసి, క-రో-నా నిర్దారణ పరీక్షలు చేసినట్టు కాదని తేల్చి చెప్పింది. క-రో-నా టెస్టింగ్ అంటే, ఆర్టీ-పీసీఆర్ టెస్టు మాత్రమే అని తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాలు, ఐసీఎంఆర్ ప్రొటోకాల్‌ను పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది.