అమరావతిలో దళితుల భూములు పై కుంభకోణం అంటూ, చంద్రబాబు పై ప్రభుత్వం సిఐడి కేసు పెట్టి, ఆయనకు జగన్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సరైన ఆధారాలు ఏమి చూపించకపోవటం, కోర్టు ఆధారాలు అడిగితే, తమ వద్ద ఇప్పుడే ఏమి లేవు అని చెప్పటంతో, హైకోర్టు ఈ కేసుని వాయిదా వేసింది. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ ఈ ఫిర్యాదు ఇవ్వటం, తనకు కొంత మంది రైతులు వచ్చి విషయం చెప్పారని, వాళ్ళ తరుపున ఫిర్యాదు చేస్తున్నాను అంటూ ఆళ్ళ తన కంప్లైంట్ లో కొంత మంది పేర్లు పెట్టారు. అయితే ఆ కంప్లైంట్ ఇచ్చిన వారి వాద్దకు వెళ్ళగా, మేము చంద్రబాబు పై కంప్లైంట్ ఇవ్వలేదు అంటూ, సంచలన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇదంతా చంద్రబాబు పై కుట్ర అని తేలిపోయింది. ఇది రాజకీయ కుట్ర అంటూ, తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, సంచలన వీడియోలు బయట పెట్టింది. సీనియర్ నాయకుడు ధూళిపాళ్ళ నరేంద్ర ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, ఈ వీడియోలు చూపించారు. ఫిర్యాదు చేసిన కందా పావని అనే ఆమె స్పందిస్తూ, మేము అసలు ఏ కేసు పెట్టలేదని చెప్పారు. తమ వద్దకే విచారణ అంటూ, కొంత మంది వచ్చారని, అప్పట్లో మీరు భూమి అమ్మరా లేదా అని విచారణ చేసి, తమ వద్ద సంతకాలు పెట్టించుకుని వెళ్ళారని తెలిపారు.

cbn 25032021 2

ఆ సంతకాన్ని మేము కేసు పెట్టినట్టు ఇప్పుడు తిప్పెసరని చెప్పారు. మీడియాలో తమ పేర్లు వచ్చేంత వరకు ఈ విషయం తెలియదని, ఇలా ఫిర్యాదు కోసం అయితే, తాము అసలు సంతకాలే పెట్టే వాళ్ళం కాదని, తేల్చి చెప్పారు. ఇక మరో రైతు అద్దెపల్లి సాంబశివరావు కూడా ఇదే చెప్పారు. ఎవరూ తమ వద్ద బలవంతంగా లక్కోలేదని చెప్పినా, కేసు పెట్టేసారని అన్నారు. దీనికి సంబంధించి రెండు వీడియోలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది. ఇప్పటికే, జాన్సన్ అనే వ్యక్తి గురించి వివరాలు బయట పెడుతూ, ఆయన ఆళ్ళ అనుచరుడు అని తేలిపోయింది. మేము ఎక్కడ విచారణలో బలవంతంగా లాక్కున్నారని చెప్పలేదని, పోలీసులు సంతకాలు పెట్టించి, ఇప్పుడు ఇలా చేసారని అంటున్నారు. చంద్రబాబు పై కేసులు పెట్టటం, రాజధానిని తరలించే కుట్రలో భాగంగానే, ఇలా తప్పుడు ఫిర్యాదులు చేసారని, దీని వెనుక పై స్థాయిలో కుట్ర జరుగుతుంది అంటూ, తెలుగుదేశం పార్టీ వాపోతుంది. ఇవన్నీ కోర్టుకు కూడా ఇస్తాం అని, పోలీసులు పై కూడా ప్రైవేటు కేసు వేస్తామని చెప్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడికి పలు సార్లు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అయితే దీని పై వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది. చంద్రబాబు రాసిన లేఖలు అన్నీ బూటకం అని, అవి కేవలం మీడియాలో ప్రచారం కోసం, ఇలా చేస్తున్నారు అంటూ, ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు తాజాగా ఆర్టీఐ ద్వారా అసలు నిజం బయట పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం మొత్తం ఫేక్ అని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రధాని మోడికి రెండు సార్లు లేఖలు రాసినట్టు ప్రధాని కార్యాలయం ఒప్పుకుంది. ఆర్టీఐ దరఖాస్తు నెంబర్ PMOIN/R/E/21/00979 ద్వారా ఈ సమాచారం బహిర్గతం అయ్యింది. ఈనగంటి రవికుమార్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించారు. దీనికి ప్రధాని కార్యాలయం స్పందిస్తూ, మార్చి 10వ తేదీన, అలాగే మార్చ్ 20వ తేదీన, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆ లేఖలు తమకు అందాయని తెలిపింది. చంద్రబాబు రాసిన లేఖల పై జవాబు ఇవ్వాలని, ఇన్‍వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‍మెంట్ శాఖ(దీపం)కు సూచించింది ప్రధాని కార్యాలయం.

pno 24032021 2

అయితే లేఖలు రాసింది నిజమే అని నిర్ధారిస్తూ, ప్రధాని కార్యాలయం ఒప్పుకోవటంతో, వైఎస్ఆర్ చేస్తున్న ప్రచారం తప్పు అని తేలిపోయింది, తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే, చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాసారని టిడిపి గుర్తు చేసింది. ముందుగా ప్రైవేటీకరణ ఆపాలని లేఖ రాసారని, మళ్ళీ వారం రోజులు తరువాత, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి అంటే ఏమి చేయాలో వివరిస్తూ చంద్రబాబు లేఖ రాసారని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో కేంద్రంతో పోరాడుతుందని, పార్లమెంట్ వేదికగా కూడా తెలుగుదేశం ఎంపీలు, ఏ విధంగా కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నారో, ప్రతి తోజు చూస్తున్నాం అని టిడిపి అంటుంది. నిన్న కూడా రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవస్యకత, దాన్ని ఎలా కాపాడుకోవాలి, కేంద్రం ఏమి చేయాలి అంటూ, పది నిమిషాల పాటు పార్లమెంట్ లో చేసిన ప్రసంగం, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశం మొత్తం ఎంపీలు, మెచ్చుకున్న తీరు, టిడిపి పోరాట స్పుర్తిని అర్ధమయ్యేలా చేస్తుందని వాపోతున్నారు.

2017లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి, అంబటి రాంబాబు సహా, కొంత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విశాఖపట్నంలో ప్రత్యెక హోదా పై నిరసన కార్యక్రమం అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో విశాఖలో పెట్టుబడులు సదస్సులు జరుగుతూ ఉండేవి. వీళ్ళు కార్యక్రమం పెట్టుకున్న సమయంలో, పెట్టుబడులు సదస్సు జరుగుతుంది. 40 దేశాల నుంచి ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ వచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమం తరువాత రోజు పెట్టుకోవాలని, వాళ్ళు ఉండగా నిరసన కార్యక్రమాలు చేస్తే, తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కోరింది. అయినా వినలేదు. వేరే ప్రదేశంలో పెట్టుకోవాలని చెప్పినా వినకుండా, కేవలం పెట్టుబడులు సదస్సు జరుగుతున్న విశాఖకు వస్తాం అంటూ, జగన్ మోహన్ రెడ్డి అండ్ కో అక్కడకు బయలుదేరి వెళ్లారు. అయితే పెట్టుబడులు సదస్సు ఎక్కడా వీళ్ళ అలజడితో, డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో, అప్పటి పోలీస్ అధికారులు, అనేక నిబంధనలు విధిస్తూ, వీరి నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. జగన మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని ఎయిర్ పోర్ట్ లోనే ఆపేశారు. అయితే ఆ సందర్భంగా, జగన్, విజయసాయి రెడ్డి , పోలీసులు పై ఎదురు తిరిగారు.

vsreddy 24032021 2

ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ నువ్వు , రెండే రెండేళ్ళు ఎవరినీ వదలను అంటూ, పోలీసులను బెదిరించారు. అయితే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు కావటంతో, పోలీసులు పై ఫిర్యాదు చేసారు. పోలీసులు తమ హక్కులకు భంగం కలిగించారని, అమర్యాదగా వ్యవహరిస్తూ, దుర్భాషలాడారని, అనేక ఆరోపణలు చేస్తూ, 2017లోనే రాజ్యసభ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగింది అంటూ, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు పైన భేటీ ఆయన కమిటీ, అప్పటి విశాఖ కమీషనర్ మీనా, అసిస్టెంట్ కమీషనర్ చిట్టి బాబును పిలిపించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళను ఎందుకు అడ్డుకుంది చెప్తూ, తాము వారి పై ఎలాంటి అగౌరవంగా ఏమి ప్రవర్తించలేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని, సభా హక్కుల కమిటీకి వివరణ ఇచ్చారు. దీంతో వారి వివరణతో సంతృప్తి చెందిన ప్రివిలేజ్ కమిటీ, విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై, ఎక్కడా సభా హక్కుల నిబంధనలు జరగలేదని తేల్చారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా తన విధులకు ఆటంకం కలిగిస్తేనే సభా హక్కుల ఉల్లంఘన అవుతుందని, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళటం రాదని స్పష్టం చేస్తూ, పార్లమెంట్ కు తమ నివేదికను ఇచ్చింది.

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నెల రోజులు గడిచినా నేటి వరకు పాలకవర్గాలకు అధికారాలు, బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో నేటికీ గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. అధికారికంగా ప్రమాణ స్వీకారం తేదీని నిర్ణయిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అప్పుడు పంచాయతీ కార్యదర్శులు ఆయా సర్పండ్లు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. అంతవరకు సర్పంచ్ హోదా ఉండదు. పంచాయతీకి సంబంధించి ఎటువంటి అధికారాలు సర్పంచ్ గా ఉండవు. ఆర్థిక సంవత్సరం ముగింపులో భాగంగా మార్చి నెలాఖరు కావడంతో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చుచేసి తమకు బాధ్యతలు అప్పగించే నాటికి పంచాయతీల్లో ఖాళీ ఖజానా ను ప్రత్యేక అధికారులు అప్పగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని నూతనంగా ఎన్నికైన సర్పంచులు వాపోతున్నారు. గత నెలలో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. నూతన సర్పంచులు, వారి మద్దతుదారులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి నెల రోజులు దాటింది. కానీ ఇంతవరకు సర్పంచులుగా అధికారికంగా బాధ్యతలు చేపట్టలేదు. పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు చేసేంత వరకు సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి వీలులేదు. 2013 లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే సర్పంచులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజులు గడిచిన ఎటు వంటి ఉత్తర్వులు వెలువడలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం సర్పంచులు బాధ్యతలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేస్తారని సమాచారం.

sarpanch 24032021 2

ఎన్నికలు జరిగి, ఫలితాలు ప్రకటించిన తేదీతో సంబంధం లేకుండా, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి సర్పంచులు, వార్డు సభ్యులకు ఐదేళ్లపాటు పదవీకా లం ఉంటుంది. పంచాయతీల్లో సచివాలయ ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయాలన్నా, నిధులను డ్రా చేయాలన్నా సర్పంచ్ లకు చెక్ పవర్ ఉంటుంది. అధికారికంగా జీవో జారీ చేసినా నాటి నుంచి మాత్రమే సర్పంచ్ గా అన్ని రకాల అధికారాలు లభిస్తాయి. మరోవైపు సర్పంచుల బాధ్యతలకు సంబంధించి కొన్ని మార్పులు ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఏప్రిల్ లోగానీ వీరు బాధ్యతలు చేపట్టే అవకాశలు లేవని అంటున్నారు. ఈ నెలాఖరుకు 14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోనున్నాయి. వీటిని ప్రత్యేక అధికారుల చేత ఖర్చు పెట్టించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతు న్నారు. ఈ నెలాఖరు వరకు పంచాయతీ ప్రత్యేకాధికారుల ఏలుబడే కొనసాగే పరిస్థితి ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు మంజూర య్యి నిధులు, విధులపై సర్వహక్కులు పాలక వర్గాలకే ఉంటాయి. ప్రత్యేకాధికా రులు నిధుల దుర్వినియోగం, మళ్లింపు, ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతోపాటు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు. అధికారి కంగా ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టని విషయం చాలామందికి తెలియదని, తాగునీ టి సమస్యను పరిష్కరిరచాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలం టూ ప్రజలు ఒత్తిడి తీసుకువస్తున్నారని పలువురు సర్పంచులు వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read