ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న విజయవాడలో చారిత్రాత్మిక కలిగిన ఆలయంలో ఒకటి మొగల్రాజపురం ధనకొండ, దుర్గా భవాని ఆలయం... దుర్గమ్మ కొలువైన కొండ అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు... ఇంద్రకీలాద్రి పై అమ్మ కొలువు తీరడానికి ముందు, ఇంకోచోట వెలసిందని భక్తుల నమ్మకం. "దక్షిణాన కదిలిందిరా మా అమ్మ దుర్గా ఉత్తరానికొచ్చింది రా " అనే గీతం ప్రకారం కూడా దుర్గా అమ్మవారు దక్షిణాది నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండ పైన వెలిసింది అంటారు..

ఈ విషయం ఇప్పటి తరంలో చాలా మందికి పెద్దగా తెలీదు. విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా మొగల్రాజపురం ధనకొండ పై వెలసిందని నమ్ముతారు. ఇప్పటికీ అమ్మ వారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి, రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటారు...

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఎంత మహిమాన్వితురాలో మొగల్రాజపురంలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా మహిమగలదని భక్తుల నమ్మకం....

మొగల్రాజపురం కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీకచ్రకపీఠంపై పాదముద్రలు, నేత్రంతో వెలసిందంటారు. ఇది నిజమేనంటూ ఇప్పటికీ అంతరాలయంలో పాద ముద్రలు, నేత్రంతో ఉన్న శ్రీచక్రపీఠం ఉంది. ఈ ఆలయంలో అమ్మరావతి విగ్రహ రూపం కనపడదు... అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం కింద భాగంలో శ్రీ చక్ర రూపం ఉంటుంది...

స్థానికుల కధనం ప్రకారం దశాబ్దాలక్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనం ఇచ్చి, నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని అభ్యర్థించాడట. ఆమ్మ కరుణతో కొంత ధనాన్నిని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లు... ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని.. చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందిట. గుహ వద్ద నుంచి కిందకు బయల్దేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనుక నుంచి శబ్దాలు, ఇతర చప్పుళ్లు వినబడటంతో వెనక్కి తిరిగాడట. వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట. ఇప్పటికీ ఆ గుహకు దిగువుగా అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది.

ప్రస్తుతానికి కొండ కింద నుండి పైకి వెళ్లడానికి చక్కటి మెట్లు ఆ పై నుంచి గుడి వరకు సిమెంట్‌ రోడ్డు ఉంది. భక్తులు పైనపొంగళ్లు చేసుకొవడానికి షెడ్‌, కాలి మార్గంలో నవదుర్గలు, క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి గర్బగుడిపైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతార్భగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఈక్షేత్రానికి వెళ్లాలంటే మొగల్రాజపురం బోయపాటి మాధవరావు రోడ్డు నుంచి ఈ గుడికి వెళ్ల వచ్చు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముఖ ద్వారంగా ఉన్న కృష్ణా నదిలో దుబాయ్ లోని హోటల్ క్రూయిజ్ తరహాలో ఒక అందమైన భారీ క్రూయిజ్ హోటల్ అధునాతన వసతులతో ఏర్పాటవుతుంది. సీతానగరం వైపున ఇసుక ర్యంపు దగ్గర ఈ భారీ క్రూయిజ్ పనులు చకచక జరుగుతున్నాయి. అత్యంత భారీగా రెండు అంతస్తులగా ఈ బోటును నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.

దీని పొడవు దాదాపు 126 మీటర్లు ఉంటుంది, వెడల్పు 40 మీటర్ల ఉంటుంది. ఈ భారీ క్రూయిజ్ నిర్మాణానికి రూ.2 కోట్ల ఖర్చు చేస్తున్నారు. ఇందులో దాదాపు 360 మంది యాత్రికులు ఒకే సారి ఉండటానికి అవకాశం ఉంది. దీని లోపల భాగంలో అధునాతన వసతులతో రెస్టారంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో యాత్రికులు కోరిన విధంగా భోజనాలు, కోరిన రుచులతో ఆస్వాదించవచ్చు. దీంతో పాటు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. పెళ్లిళ్లకు, హనీమూస్ జరుపుకునే జంటలకు వివిధ రకాల పంక్షన్లకు ఈ క్రూయిజ్ అద్దెకు ఇస్తారు. భవాని ద్వీపం, ఇంద్రకీలాద్రి, నడుమ కృష్ణానది నీటి పై ఈ క్రూయిజీసు లంగరు వేసి ఉంచుతారు. భవాని ఐలాండ్, శాండ్ ఐలాండ్, ఫారెస్ట్ ఐలాండ్స్, వంటి ఎన్నో సహజ సుందరమైన దీవులను కలిగి ఉన్న కృష్ణానదిలో ఒకప్పుడు సాదారణ బోట్ల మాత్రమే తిరిగేవి.

రాష్ట్రంలో టీడీపి ఆధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఆధునిక క్రూయిజ్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వం పర్యాటకానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ప్రైవేటు రంగం నుంచి పెద్ద ఎతున పెట్టబడులు వస్తున్నాయి. రాజధాని పరిధిలో ఎన్నో బడా టూరిజం ప్రాజెక్టులను తెచ్చేందుకు ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడానికి ఛాంపియన్స్ యాచ్ క్లబ్ ముందుకు వచ్చింది. తొలిదశలో భాగంగా సగానికి పైగా పనులు పూర్తి చేసింది. మిగిలిన పనులు ముగింపు దశలో ఉన్నాయి. అలాగే, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, స్కై ఛాపర్స్ సంస్థలు కూడా కొన్ని ప్రాజెక్ట్లు మొదలుపెట్టాయి.

సముద్రంలో రయ్మంటూ దూసుకుపోవాలనుందా? కెరటాల పై కేరింతలు కొడుతూ షికారు చేయాలనుందా? అయితే వైజాగ్ పదండి. త్వరలోనే ఆ కోరిక తీరుతుంది. దేశంలోనే తొలిసారిగా మన విశాఖ బీచ్ లో అలాంటి వారి సరదాలు తీర్చేందుకు హోవర్ క్రాఫ్ట్ వస్తోంది. ఇన్నాళూ, ఇంగ్లండ్ అమెరికా వంటి దేశాల్లోనే ఉన్న ఈ హోవర్ క్రాఫ్ట్ ఇప్పడు మనకూ రాబోతోంది.

అక్షర ఎంటర్ప్రెజెస్ సంస్థ దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టబోతోంది. విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్ లలో వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.8 కోట్ల ఇందుకు నేవీ, కోస్ట్ గార్డ్ , విశాఖపోర్టు, జీవీఎంసీ, వుడా, కాలుష్య నియంత్రణ మండలి, పోలీసు, ఎన్ఐఓ వంటి అన్ని అనుమతులను తెచ్చుకుంది.

ఇందుకోసం బ్రిటన్ నుంచి ఒక్కొక్కటి రూ.1.80 కోట్ల వెచ్చించి రెండు హోవర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసింది. తొమ్మిది సీట్ల సామర్థ్యం ఉండే ఈ క్రాఫ్ట్ లో పైలట్ (డైవర్), ఒక సహాయకుడితో పాటు మరో ఏడుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఆర్కే బీచ్ సమీపంలో ఒక పాయింట్ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నుంచి పార్క్ హోటల్ వరకు, తొట్లకొండ పాయింట్ నుంచి ఆ పరిసరాల్లోనూ 20 నుంచి 25 నిమిషాల పాటు సముద్ర ఒడ్డు నుంచి 500 మీటర్ల దూరం వరకు వీటిని తిప్పనున్నారు.

ఈ హోవర్ క్రాఫ్ట్ లో షికారు చేయడానికి ఒక్కొక్కరికి రూ.300 టికెటుగా నిర్ణయించాలని యోచిస్తున్నారు. భద్రత కోసం ఒడ్డున సేఫ్టే బోట్లను కూడా సిద్దంగా ఉంచుతారు.

దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ హోవర్ క్రాఫ్ట్ లు నడపడానికి అవసరమైన అన్ని అనుమతులు తెచ్చుకున్నారు.

ఇది నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో ఉన్న ఓ అద్భుత లోకం.... అక్కడ అడుగుపెడితే అదో కొత్త బంగారు లోకం... విజయావాడ అంటే కృష్ణా నది, ప్రకాశం బ్యారేజి, రెండు పార్కులు మాత్రమే తెలిసిన నగరవాసులకి, ఈ ప్రదేశానికి వెళ్తే, ఇన్నేళ్ళు ఇక్కడకు ఎందుకు వెళ్ళ లేదా అనిపిస్తుంది... పచ్చని చెట్ల మొక్కల మధ్య నుంచి సీతాకోకచిలుకలు వచ్చి స్వాగతం పలుకుతాయి... ఒక్కటీ రెండూ కాదండి వేలల్లో.. అడుగులు ముందుకు పడుతుంటే మనతో పాటే కదులుతాయి... మనతో మమేకం అయిపోతాయి, మనల్ని ముద్దాడుతాయి.. మొన్నటి వరకు ఎక్కడెక్కడికో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన విజయవాడ వాసులు ఇప్పుడు ఇటువైపు చూస్తున్నారు. సొంత ప్రాంతంలో సరి కొత్త అనుభూతులను పొందుతున్నారు.

ప్రకృతి కొత్త అందాలతో మురిసిపోతోంది విజయవాడకు కూత వేటు దూరంలో ఉన్న మూలపాడు. సీతాకోక సంపద కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను కమ్మేసుకుంది. ఒకపక్క సెలయేళ్ల నీటి గలగలలు... అటూ ఇటూ కొండలు... మధ్యలో ప్రకృతి పచ్చని కోక కట్టినటుగా కనిపించే అరణ్యం.. మరో పక్క చల్లని గాలులకు, ఇంద్రధనస్సును తలిపిస్తూ, రంగురంగుల సీతాకోక చిలుకలు నాట్యం... వాః అద్భతం కదూ... కాంక్రీట్ జంగల్ గా మారిన విజయవాడ వాసులకి, ఇక్కడ అందమైన సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు.

మూలపాడు, దొనబండ ప్రాంతాల్లో వేలు, లక్షల సంఖ్యలో రంగురంగుల సీతాకోకచిలుకలు రెక్కలు విప్పతాయి. దాదాపు 30 రకాల సీతాకోకచిలుకలు, జూన్, జూలై, ఆగష్టు నెలల్లో అడవి మొత్తాన్ని ఆక్రమించి కొత్త అందాలు తీసుకొస్తాయి. సీతాకోక చిలుకలను దూరం నుంచి మాత్రమే చూసి ఆనందించాలి. వాటిని పటుకోవడానికి ప్రయత్నించడం, పరుగులు తీసూ వాటి స్వేచ్చకు భంగం కలిగించకూడదని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

అక్కడకు ఎలా వెళ్ళాలి ?
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారి పై (విజయవాడకు 20 కిలోమీటర్ల దూరం) మూలపాడు గ్రామం ఉంది. ఆక్కడి నుంచి కుడి వైపకు 3 కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడ ఆటవీ ప్రాంతం మొదలవుతుంది. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్ల దూరంలో సమాంతరమైన ఆటవీ ప్రాంతంలో అభయాంజనేయస్వామి ఆలయం, దొంగమర్ల బావి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే రంగు రంగుల సీతాకోకచిలుకలు సందడి చేస్తాయి.

ప్రభుత్వం ఇలాంటి అందమైన పర్యాటక కేంద్రాన్ని మరింతగా ప్రాచుర్యం కలిగించి, మంచి పర్యటక కేంద్రంగా, సీతాకోకచిలుకల మనుగడకు ఇబ్బంది లేకుండా మరింత అభివృద్ధి చెయ్యాలి...

ఏ నగరాన్నయినా రోడ్ల మీద తిరుగుతూ చూడటం కన్నా విహంగ వీక్షణంలో చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది... అలాంటి అనుభూతి స్వయంగా పొందకపోయినా, ఈ వీడియో చూడండి, బెజవాడ ఎంత అందంగా ఉందో... హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ, నగర అందాలు కెమెరాలో రికార్డు చేశారు...హెలికాప్టర్ నుంచి ఈ సీన్ చూస్తుంటే, ఆస్వాదించే మనసుండాలేగాని బెజవాడలో ప్రతి ప్రాంతం సోయగాల బృందావనమే...

ఆకాశం నుంచి బెజవాడ ఎంత అందంగా ఉందో చూడండి... కృష్ణా తీరం, పచ్చని కొండలు, నగరంలో నుంచి ప్రవహించే కాలువలు, కృష్ణా నదిలో ద్వీపాలు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, లయలా కాలేజి, సిద్ధర్దా కాలేజీ, స్టేడియం, ఇలా విజయవాడ నగర విహంగ వీక్షణం అద్భుతం...

More Articles ...

Page 1 of 2

Advertisements

Latest Articles

Most Read