సోషల్ మీడియాను ఉపయోగించుకుని, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పి, ప్రజలను బురిడీ కొట్టించి వైసీపీ గెలిచిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ని అడ్డు పెట్టుకుని, వైసీపీ చెలరేగిపోయింది. పేటీయం బ్యాచ్ లని పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టు చేసారు. అయితే అధికారంలో వచ్చిన తరువాత కూడా, ఈ ఫేక్ బ్యాచ్ ని వదిలి పెట్టలేదు. తమ ప్రభుత్వానానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తారా అంటూ, ఏకంగా న్యాయమూర్తులను, న్యాయస్థానాలను కూడా టార్గెట్ చేసారు. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ ఉండటంతో పలువురు షాక్ తిన్నారు. ఏకంగా ప్రజా ప్రతినిధులు కూడా కోర్టుల పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటంతో, సోషల్ మీడియా బ్యాచ్ రెచ్చిపోయింది. విషయం హైకోర్టు వరకు వెళ్ళటంతో, ఏకంగా హైకోర్టు కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పటి లాగే, సిఐడి ఈ కేసుని ముందుకు తీసుకుని వెళ్లకపోవటంతో, ఈ కేసు సిబిఐ విచారణకు వెళ్ళింది. అయితే సిబిఐ ఇప్పటికే కొంత మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వైసీపీ సోషల్ మీడియాలో పేరున్న ఉన్న వారే ఇందులో ఉన్నారు. అయితే అమెరికాలో వీడియోలు పెడుతూ, రెచ్చిపోయే పంచ్ ప్రభాకర్ విషయంలో మాత్రం సిబిఐ ముందుకు వెళ్ళ లేక పోతుంది. తరుచూ కోర్టు ఈ విషయంలో సిబిఐ తీరుని తప్పు బడుతూ వస్తుంది.
అయితే ఈ రోజు హైకోర్టుకు ఒక కొత్త విషయం తెలియటంతో, హైకోర్టు కూడా షాక్ తింది. అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ కొత్త తరహాలో యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారని, ప్రైవేట్ యూజర్ ఐడీ పెట్టుకొని, తన వీడియోలు అడిగిన వారికి మాత్రమే ఇస్తున్నాడని, కొత్త కొత్త వీడియోలు ఇలా పెడుతున్నాడు అంటూ, కోర్టుకు తెలిపారు న్యాయవాది. ఇలా కోర్టు వద్దు అని చెప్పినా, ఇలా కొత్త పధ్ధతిలో ప్రైవేట్ వ్యూస్ ఇస్తూ, కోర్టు నిర్ణయాన్ని, కోర్టుని మరింతగా అగౌరవ పరుస్తున్నాడు అంటూ కోర్టుకు తెలిపారు. అలాగే సిబిఐ వేసిన అఫిడవిట్ లో ఎక్కడా పంచ్ ప్రభాకర్ పేరు లేదని, ఇది తీవ్ర అభ్యంతరకరం అని అన్నారు. అయితే విషయం తెలుసుకున్న హైకోర్టు, యూట్యూబ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అతనికి ఈ అవకాసం కల్పించారు అంటూ యూట్యూబ్ పై సీరియస్ అయ్యింది. వెంటనే అవి ఆపించాలని ఆదేశిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. ఇప్పటి వరకు ఎందుకు పంచ్ ప్రభాకర్ ని అరెస్ట్ చేయలేదని సిబిఐని ప్రశ్నించింది. ఎప్పుడు, ఎలా అరెస్ట్ చేస్తారో, తమకు తెలపాలని కోర్టు తెలిపింది.