ఈనాడులో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఎప్ప‌టి మాదిరిగానే అన్ని ఆధారాల‌తో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. వైసీపీ స‌ర్కారు చేస్తున్న అరాచ‌కాలు, అవినీతినే ఈనాడు రాయ‌డంతో ఏం చేయ‌లేని జ‌గ‌న్ రెడ్డి క‌క్ష సాధింపుల‌కు మార్గ‌ద‌ర్శిని మార్గం చేసుకున్నాడు. ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌కున్నా ఈనాడు రామోజీరావుని ఇబ్బంది పెట్టి, ఈనాడు క‌థ‌నాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌నుకుని మార్గ‌ద‌ర్శి చిట్స్ పై దాడుల‌కు అధికార యంత్రాంగాన్ని ఉసిగొల్పారు సీఎం జ‌గ‌న్ రెడ్డి. రోజుల‌కొద్దీ మార్గ‌ద‌ర్శిలో సోదాలు జ‌రిపినా ఏం ప‌ట్టుకోలేక సాక్షిలో త‌ప్పుడు రాత‌లు రాసి సైకో ఆనందం పొందారు. ఇదే స‌మ‌యంలో రామూ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఈనాడుపై సోష‌ల్మీడియా వేదికగా వికృత రాత‌లు పోస్టు చేసి పైశాచిక ఆనందం పొందారు. అయితే ఎక్క‌డా రామోజీరావు త‌గ్గ‌లేదు. ఈనాడు అంత‌కంటే త‌గ్గ‌లేదు. చిట్స్ చ‌ట్టం కింద రామోజీని బుక్ చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేసినా ఒక్క కేసు పెట్ట‌డానికి ఆధారం దొర‌క‌లేదు. మార్గ‌ద‌ర్శిపైనా, రామోజీరావుపైనా ఆరోప‌ణ‌లు చేసిన వైసీపీ మంత్రి అంబ‌టి రాంబాబు అదే చిట్స్ నేరంపై పోలీసు కేసు బుక్ అయ్యింది. అంబ‌టి రాంబాబు ఆదేశాల‌తో సత్తెనపల్లిలో కొన్నేళ్లుగా సంక్రాంతి డ్రా పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వ‌లంటీర్లు, స‌చివాల‌య సిబ్బంది సైతం ఈ డ్రా టికెట్లు అమ్మార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీనిపై జ‌న‌సేన నేత‌లు కోర్టులో పిటిష‌న్ వేశారు. కోర్టు ఈ డ్రా వ్య‌వ‌హారంపై సీరియ‌స్ గా స్పందించింది. అయితే కోర్టులు ఏం చేసినా డ్రా జ‌రిగి తీరుతుంద‌ని అంటి స్ప‌ష్టం చేశారు. అలాగే డ్రా కూడా తీశారు. హైకోర్టు  ఈ డ్రా వ్య‌వ‌హారంపై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశాలు ఇవ్వ‌డంతో, ఆ డ్రా ముగిసిన త‌రువాత సత్తెనపల్లి పోలీసులు చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. రామోజీరావుని ఇదే చ‌ట్టం కింద బుక్ చేయాల‌నుకుని రాంబాబు బుక్ కావ‌డం దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు స‌త్తెన‌ప‌ల్లి  నేత‌లు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ కి తెలిసి జ‌రుగుతోందో, తెలియ‌క జ‌రుగుతోందో జ‌నానికి తెలియ‌దు కానీ..గుడివాడ కేంద్రంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌రువు ప‌దేప‌దే తీస్తున్నాడు కొడాలి నాని అని ఫ్యాన్స్ వాపోతున్నారు. కొడాలి నాని టిడిపిపై ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌ను మంద‌లించ‌క‌పోవ‌డంతో కొడాలి నాని రెచ్చిపోతున్నారు. అయితే రాజకీయాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ వేలు పెట్టే స్థాయిలో లేరని, ఆయన ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని ఆయన సన్నిహితులు చెప్తూ వస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 27వ వ‌ర్థంతి సంద‌ర్భంగా కొడాలి నాని రౌడీ మూక‌లు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు పెట్టుకుని గుడివాడ‌లో గంద‌ర‌గోళం సృష్టించాయి. విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు, మ‌హానాయ‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు వ‌ర్థంతికి ఆయ‌న అభిమానులు, తెలుగుదేశం వారు నివాళుల‌ర్పించ‌కుండా కొడాలినాని జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో దా-డు-ల‌-కు పాల్ప‌డ్డాడు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అధ్యక్షతన టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ కి నివాళుల‌ర్పిస్తుండ‌గా కొడాలి నాని అనుచ‌రులు వారిపై దా-డు-ల‌-కు పాల్ప‌డ్డారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతిని జ‌రుపుకోనివ్వ‌క‌పోవ‌డం ఘోరం కాగా, త‌న‌కి అత్యంత ఇష్ట‌మైన తాత ఎన్టీఆర్ వ‌ర్థంతిని జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో అడ్డ‌గించ‌డం మ‌రీ దారుణం. ఎన్టీఆర్ విగ్ర‌హాలు ధ్వంసం చేసి, యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసిన వైసీపీ వాళ్లు వ‌ర్థంతి జ‌రిపితే లేని అభ్యంత‌రం టిడిపి త‌మ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడికి నివాళులు అర్పిస్తే ఎందుకొచ్చింద‌ని టిడిపి అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరుతో కొడాలి నాని పాల్ప‌డుతున్న అరాచ‌కాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే తార‌క్ పేరు చాలా డ్యామేజ్ జ‌రుగుతోంద‌ని అస‌లైన అభిమానులు వాపోతున్నారు.

టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్ట‌బోయే పాద‌యాత్రకు అన్నివ‌ర్గాల నుంచీ మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. విప‌క్షాలు ఇప్ప‌టికే పాద‌యాత్ర స్వాగ‌తించాయి. తెలుగుదేశం పార్టీలో 175 నియోజ‌క‌వ‌ర్గాల ఇన్చార్జులు, అనుబంధ సంఘాలు లోకేష్ వెంట న‌డిచేందుకు మేము సైతం అంటూ ముందుకొచ్చాయి. సినీ రంగం నుంచి కూడా నారా లోకేష్‌కి బెస్టాఫ్ ల‌క్ చెబుతూ హీరోలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. ఇటీవ‌ల బెంగ‌ళూరు వెళ్లిన నారా లోకేష్‌ని కేజీయ‌ఫ్ హీరో య‌ష్ క‌లిశారు. రాజ‌కీయంగా ఎద‌గాలని, పాద‌యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. నంద‌మూరి న‌ట‌సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాల‌కృష్ణ త‌న అల్లుడి పాద‌యాత్ర‌కి ముందు అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్ తో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. హీరో నందమూరి తార‌క‌ర‌త్న ఇటీవ‌లే లోకేష్‌ని క‌లిసి పాద‌యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. హీరో నారా రోహిత్ అయితే యువ‌గ‌ళం పోస్ట‌ర్ ఆవిష్క‌రించారు. లోకేష్ పాద‌యాత్ర‌లో తానూ పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించారు. అన్యాయానికి గురైన యువ‌త స్వ‌రాన్ని వినిపించే యువ‌గ‌ళం లోకేష్ ది అని కొనియాడారు.

టూరిజం శాఖా మంత్రిగా కంటే, డ్యాన్సులు శాఖా మంత్రిగానే రోజా రెడ్డి గారికి ఈ మధ్య పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కి ఇప్ప‌టికీ జ‌బ‌ర్ద‌స్త్ షో జ‌డ్జిగానే రోజా రెడ్డి సుప‌రిచితురాలు. ఆమె నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతూ త‌ర‌చూ ప్ర‌భుత్వాన్ని, వైసీపీని ఇర‌కాటంలో ప‌డేస్తుంది. తాజాగా బ‌తికి వున్న త‌న‌యుడు జ‌గ‌న్, దివంగ‌తుడైన తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఒకే ఒక మాట‌తో ఇర‌కాటంలో ప‌డేసింది. కావాల‌ని అంటుందో, నోరు జారుతుందో కానీ..విప‌క్షానికి విసిరే పంచులు బూమ‌రాంగ్ అయి వైసీపీకే త‌గ‌ల‌డం రోజా స్పెష‌ల్. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర గురించి మాట్లాడుతూ ``వ‌ళ్లు ఎక్కువైంది..త‌గ్గించుకోవ‌డానికి పాద‌యాత్ర ప‌నికొస్తుంది`` అంటూ నోటి తీట ప్ర‌ద‌ర్శించారు. పాద‌యాత్ర కాక‌పోతే పొర్లుదండాలు పెట్ట‌మ‌నండి అంటూ సెటైర్లు వేసింది. దీనిపై టిడిపి నుంచి గ‌ట్టిగానే కౌంట‌ర్లు ప‌డ్డాయి. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ళ్లు త‌గ్గ‌డానికే ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో యాత్ర చేశాడా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జాసంక‌ల్పం పేరుతో జ‌గ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర వ‌ళ్లు లావై, త‌గ్గించుకోవ‌డానికే చేశారా రోజా రెడ్డి గారు అంటూ టిడిపి సోష‌ల్మీడియా వేదిక‌గా గ‌ట్టిగానే కౌంట‌ర్లు ఇస్తున్నారు. దీనిపై ట్రోల్స్‌, మీమ్స్ కూడా లెక్క‌లేన‌న్ని వదిలారు. దీంతో వైసీపీ నేత‌లు త‌మ అధినేత‌ని రోజా కావాల‌నే బుక్ చేస్తున్న‌ట్టు ఉంద‌ని వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read