సీఐడీ చీఫ్‌గా మొన్న‌టివ‌ర‌కూ ప‌నిచేసిన సునీల్ కుమార్ కి ఏపీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మోష‌న్ ఇచ్చారు. డిజిపి ర్యాంకు ఇచ్చి గౌర‌వించారు. అయితే ఆయ‌న‌పై ఫిర్యాదుల‌పై ద‌ర్యాప్తు చేసిన కేంద్రం ప్ర‌భుత్వం డిమోష‌న్‌కి సిఫార‌సు చేసింది. ఈ మేర‌కు ఏపీ సీఎస్‍కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. డీజీ సునీల్‍కుమార్‍పై చర్యలు తీసుకోవాలని అందులో వివ‌రించింది. అంబేద్కర్ ఇండియా మిషన్ (ఎయిమ్‌) న‌డుపుతున్న సునీల్ కుమార్ అదే వేదికపై చేసిన విద్వేషపూరిత ప్రసంగమే ఆయ‌న ప‌ద‌వికి ఎస‌రు తెచ్చింది. ఈ హేట్ స్పీచ్ పై కేంద్రానికి  ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆధారాల‌తో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సునీల్ కుమార్ ప్రసంగించారంటూ అందులో పేర్కొన్నారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుతో పాటు డీవోపీటీ లేఖను ఏపీ సీఎస్‍కు కేంద్రహోంశాఖ పంప‌డంతో ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్ పై గృహహింస కేసు కూడా ఉంది. దీనిపైనా ఫిర్యాదులున్నాయి. సీఐడీ క‌స్ట‌డీలో టార్చ‌ర్ పెట్టార‌నే కేసు కూడా హైకోర్టులో విచార‌ణ‌కి వ‌చ్చింది. మొత్తానికి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సంతోష‌పెట్ట‌డానికి నిబంధ‌న‌లు పాటించ‌కుండా, చ‌ట్ట‌వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌లో సునీల్ కుమార్ దెబ్బ‌కి భ‌యం నెల‌కొంది.

సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అటెన్ష‌న్‌ని త‌న‌వైపు తిప్పుకుని నారా లోకేష్ భ‌లే ట్రాప్ చేశార‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు విశ్లేషిస్తున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ని హైలైట్ చేసే బాధ్య‌త‌ని వైసీపీ తీసుకున్న‌ట్టు ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. అనుమ‌తుల మంజూరులో నాన్చి నాన్చి ఇవ్వ‌డంతోనే లోకేష్ పాద‌యాత్ర‌కి వైసీపీ ప‌బ్లిసిటీ ఆరంభ‌మైంది. పాద‌యాత్ర‌లో పోలీసుల హ‌డావిడితో యువ‌గ‌ళం పాద‌యాత్ర రోజూ వార్త‌ల్లో ప్ర‌ముఖంగా క‌నిపిస్తోంది. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి కుప్పంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి, ప‌ల‌మ‌నేరు డిఎస్పీ సుధాక‌ర్ రెడ్డి వంటి వారు చేస్తున్న ఓవ‌ర్ యాక్ష‌న్ తో యువ‌గ‌ళం క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఓ వైపు యువ‌గ‌ళానికి జ‌నం లేరంటూ వైసీపీ సోష‌ల్మీడియా ప్ర‌త్యేక టీము ద్వారా పాద‌యాత్ర లైవ్ అప్ డేట్స్ ఇస్తున్నాయి. ఇంకో వైపు ఇంటిలిజెన్స్ వాళ్లు డ్రోన్లు, లైవ్ ఎక్విప్మెంట్ ద్వారా పాద‌యాత్ర‌లో ప్ర‌తీ క్ష‌ణాన్ని రికార్డు చేసి తాడేప‌ల్లి పెద్ద‌ల‌కు రియ‌ల్ టైములో పంపుతున్నారు. ఇంటిలిజెన్స్, వైసీపీ సోష‌ల్మీడియా టీములు, వారిని కాపాడేందుకు మ‌ఫ్టీ పోలీసులు, అధికారికంగా బందోబ‌స్తులో పాల్గొనే పోలీసుల‌తో పాద‌యాత్ర‌కి పెద్ద‌గా జ‌న‌స‌మీక‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రం రావ‌డంలేదు. మ‌ఫ్టీలో ఉన్నోళ్లు, యూనిఫాం వేసిన వీళ్లంతా క‌లిసి 200 మంది పైనే పాద‌యాత్ర‌ని రెండు వారాలుగా ఫాలో అవుతున్నారు. లోకేష్ త‌ప్పు మాట్లాడార‌ని ఖండించ‌డానికి ఒక‌రు, జ‌గ‌న్ ని దూషించార‌ని కౌంట‌ర్ ఇవ్వ‌డానికి మ‌రొక‌రు, నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని చెప్పేందుకు ఇంకొక‌రు లెక్క‌న రోజూ వైసీపీ నుంచి ప్రెస్మీట్లు, ప్ర‌క‌ట‌న‌లు, ట్వీట్ల‌తో వ‌స్తున్నారు. రోజూ జ‌గ‌న్ భ‌జ‌న‌లో త‌రించే వైసీపీ అఫీషియ‌ల్ సోష‌ల్మీడియా ఖాతాల‌న్నీ లోకేష్‌ని ట్రోల్ చేయ‌డానికి, పాద‌యాత్ర‌లో జ‌నం లేరు అని చెప్ప‌డానికి వాడుతున్నారు. దీంతో వైసీపీ సోష‌ల్మీడియా ఖాతాల్లో టిడిపి ఎస్ఎం కంటే ఎక్కువ‌గా లోకేష్‌కి ప్ర‌చారం ద‌క్కుతోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లోకేష్ పాద‌యాత్ర‌ని అస్స‌లు ప‌ట్టించుకోకుండా ఉండి ఉంటే, ఇంత హైలైట్ అయ్యేది కాదు. నారా లోకేష్ తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ట్రాప్‌లో ప‌డేశారు. ఇప్పుడు ప్ర‌భుత్వం, పోలీసులు, వైసీపీ, వైసీపీ సోష‌ల్మీడియా మొత్తం నారా లోకేష్ నామ‌స్మ‌ర‌ణే. యువ‌గ‌ళం పాద‌యాత్ర వార్త‌లే చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో  ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాడిపత్రిలోని పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రీచ్ కు వెళ్లి నిరసన తెలిపారు. ఇసుక రీచ్ లో కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కేవలం మూడు అడుగులే ఇసుక తవ్వాలని నిబంధనలు ఉన్నాయిని, అయితే 20 అడుగుల లోతు తవ్వి రాత్రిబవళ్లు ఇసుక తరలిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పెన్నా నదిలో గోతులు తవ్వుతున్నారని జేసీ నిరసనకు దిగారు. అయితే నిరసన విరమించుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసుల హుకుం జారీ చేయటంతో,   పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చేసుకుంది. దీంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వాహనం నుంచి జేసీ గన్ మెన్ ను కూడా దించేవేసిన పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిని వాహనంలో పలు చోట్లకు తిప్పుతున్నారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

బోరుగడ్డ అనిల్.. క్రిస్టియన్ సంస్థలతో సంబంధాలు న‌డుపుతూ హిందూ ధార్మిక సంస్థ‌ల‌లో కీల‌క వ్య‌క్తుల‌తో రాజ‌కీయాలు న‌డుపుతాడు. వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి బంధువుని అని కూడా చెబుతుంటాడు. వాళ్ల‌ను చంపుతా, వీళ్ల‌ని వేసేస్తా అనే బోరుగ‌డ్డ అనిల్ ద‌గ్గ‌ర మేట‌ర్ నిల్. ఆయ‌న బ‌ల‌మూ, బ‌ల‌గ‌మూ అంతా వైసీపీ పెద్ద‌లే. జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకు బోరుగ‌డ్డ అనిల్ దాడులు చేస్తాడు, కేసులు వేస్తాడని ఆయ‌న గురించి తెలిసిన వారు చెప్పే మాట‌. బోరుగడ్డ అనిల్ ఏకంగా హోంమంత్రి పేరు చెప్పుకుని భూసెటిల్మెంట్లు చేసినట్లు అతని మీద కేసులున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ స్టేషన్‌లో అనిల్‌పై రౌడీ షీట్ కూడా ఉంది. బోరుగడ్డ అనిల్ సైమన్ అమృత్ ఫౌండేషన్ అనే క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. గుంటూరు వల్లూరివారి తోటలో.. భీంసేన పేరుతో ఓ కార్యాలయం ప్రారంభించారు. రిప‌బ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాఖ‌కి తానే వ‌ర్కింగ్ ప్రెసిడెంటున‌ని ప్ర‌చారం చేసుకుంటాడు. మోసాలు, నకిలీలలు, బెదిరింపు దందాలు, పెద్ద పెద్ద అధికార్లనే బురిడీ కొట్టించడం, కోర్టులో కేసులు వేయడం ద్వారా.. పాపులారిటీ పెంచుకోవడం, ఆ పాపులారిటీతో మళ్లీ దందాలు చేయడం, ఇలా అనేక సార్లు ఆరోపణలు ఎదుర్కుంటూ, ఆయన వార్తల్లో నిలిచాడు

బోరుగ‌డ్డ అనిల్ చ‌రిత్ర ఇది, 1. గతంలో అమరావతి ప్రాంతంలో.. భూదందాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కారు. 2. ఓ భూవివాదంలో డిప్యూటీ సీఎం హోమంత్రి పేరు చెప్పుకుని నేరాలకు పాల్పడ్డారు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. 3. క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ, రమణ దీక్షితులు పక్కన కూర్చుని, చంద్రబాబు పై దాడి చేసాడు.. విమర్శలు కురిపించారు. 4. జగన్ కోడి కత్తి కేసులో కూడా అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లు చేశాడు. 5. మాజీ స్పీక‌ర్ కోడెల మృతిపై ఒక కేసు వేశారు. 6. కేంద్ర మంత్రి ఓఎస్డీ అంటూ, ఐఏఎస్ ఆఫీసర్ ని అంటూ మారు పేర్లతో దందాలు చేసే వాడనే ఆరోపణలు, కేసులు కూడా ఉన్నాయి. 7. శ్రీ వారి నగలు మాయం అయ్యాయని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుతో నాటి టిడిపి ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు ద‌గ్గ‌రుండి చేయించింది బోరుగడ్డ అనిల్. 8. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జ‌స్టిస్ ర‌మ‌ణ‌పై పిల్ వేసింది కూడా ఈ బోరుగ‌డ్డ అనిలే..

Advertisements

Latest Articles

Most Read