క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు. అంత‌కుముందు క‌ర‌డుగ‌ట్టిన కాంగ్రెస్ నాయ‌కుడు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడైన నేత‌. కాంగ్రెస్ వ‌ల్ల రాష్ట్ర విభ‌జ‌నలో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని ప్ర‌జ‌లు వెలిబుచ్చిన ఆగ్ర‌హంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్ నేత‌లు త‌లో పార్టీలోకి పోయారు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బీజేపీలో చేరి ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షుడయ్యారు. బీజేపీ కాపుల‌ను దువ్వి ఏపీలో త‌మ ఉనికి చాటుకోవాల‌నుకునే వ్యూహంలో క‌న్నాని చేర‌దీసింది. అయితే బీజేపీ స్టాండ్ ఏంటంటే, వైసీపీ భుజాల‌పై తుపాకీ పెట్టి టిడిపిని కాల్చేయ‌డం. ఇది సాధ్యం కాలేదు. రోజు రోజుకీ త‌మ అభిమాన వైసీపీ ప్రజాభిమానం కోల్పోతుండ‌డంతో బీజేపీ నుంచి మ‌ద్ద‌తు కోసం వైసీపీ సానుభూతిప‌రులైన సోమువీర్రాజుని అధ్య‌క్షుడిని చేసి,క‌న్నాని సాగ‌నంపింది బీజేపీ. అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌డెన్‌గా బీజేపీకి రిజైన్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే ఎటువంటి ఊగిస‌లాట లేకుండా టిడిపిలో చేర‌తాన‌ని ప్ర‌క‌టించారు. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేలో చేర‌తార‌ని అంద‌రూ ఊహించారు. దీనికి భిన్నంగా టిడిపిలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. జ‌న‌సేన బీజేపీతో వెళితే..మ‌ళ్లీ అదే వైసీపీ సానుభూతిప‌రుల కోట‌రీ కింద ప‌నిచేయాల్సి వ‌స్తుంద‌ని, అలాగే ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో వ‌చ్చేది టిడిపియేన‌ని ఫిక్స్ అయిన క‌న్నా తెలుగుదేశం గూటికి చేరాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

మంత్రివ‌ర్గ చేర్పులు, మార్పుల సంద‌ర్భంగా మంత్రి ప‌ద‌వి కోల్పోయిన కొడాలి నానిని మ‌ళ్లీ మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. దీనికి ఊతం ఇచ్చేలా నాని రోజూ మీడియా ముందుకు వ‌చ్చి గ‌తంకంటే ఘోర‌మైన బూతుల‌తో టిడిపిపై విరుచుకుప‌డుతున్నాడు. కొత్త‌గా మంత్రులు అయిన‌వారు కానీ, గ‌తం నుంచి కొన‌సాగుతున్న వారు కానీ..వైసీపీ పెద్ద‌లు ఆశించిన స్థాయిలో బూతులు మాట్లాడ‌టంలేద‌ని తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. నిత్య‌మూ టిడిపిని టార్గెట్ చేయాలంటే కొడాలి నాని క‌రెక్ట్ అని, ఏం బూతులు మాట్లాడ‌మంటే అవే మాట్లాడుతున్న నానికి మంత్రి ప‌ద‌వి లేక‌పోవ‌డంతో క‌వ‌రేజ్ వీక్‌గా ఉంద‌ట‌. అందుకే మంత్రిని చేస్తే మ‌రింతగా బూతుల‌తో టిడిపిపై విరుచుప‌డేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాడ‌ని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంద‌ని స‌మాచారం. మంత్రివ‌ర్గంలో కొంద‌రిని కొత్త‌వాళ్ల‌ను తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచీ కొడాలి నాని మీడియా ముందుకొస్తూ మ‌ళ్లీ నోరుపారేసుకోవ‌డం చూసి, మంత్రిగా కొడాలిని తీసుకుంటార‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. దీనిపై తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో మంతనాలు సాగించార‌ని స‌మాచారం. బూతులు తిట్టే సామ‌ర్థ్యం కొడాలి నానికి మంత్రి ప‌ద‌వికి తొలి అర్హ‌త కాగా, కొడాలి నాని రోజూ తిట్టుకునే త‌న‌ సామాజిక‌వ‌ర్గం స‌మీక‌ర‌ణం క‌లిసొచ్చింద‌ని తెలుస్తోంది. క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నుంచి ఎవ‌రూ మంత్రివ‌ర్గంలో లేర‌ని, కొడాలి నానిని మ‌ళ్లీ కేబినెట్లోకి తీసుకుంటే అటు క‌మ్మ ప్రాతినిధ్యం ఇచ్చిన‌ట్ట‌వుతుంద‌ని, మ‌ళ్లీ బూతులు తిట్టే మంత్రి వ‌చ్చేసిన‌ట్టుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది.

ముప్పేట దాడి త‌ట్టుకోలేని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని తెలుస్తోంది. 23 మందిలో న‌లుగురు పార్టీ నుంచి జంప్ ఇచ్చేశారు. ప్ర‌తిప‌క్షం పాత్ర నామ‌మాత్రం అనుకుంటే చుక్క‌లు చూపిస్తోంది తెలుగుదేశం. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం త‌రువాత `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి` చేప‌ట్టింది. అడ్డ‌గోలు స‌ర్కారు నిర్ణ‌యాల‌ను కోర్టులు కొట్టేస్తున్నాయి. కేసులు మెడ‌కి చుట్టుకున్నాయి. ఏ స‌ర్వే చూసినా వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రంగా పెరిగింద‌నే వ‌స్తోంది. ఏం చేయాలో తెలియ‌ని ఫ్ర‌స్టేష‌న్‌తో సీఎం ఉన్నార‌ని వైసీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే రెండు విడ‌త‌లు మంత్రివ‌ర్గంలో మార్పులు చేసిన జ‌గ‌న్ మ‌రోసారి మంత్రివ‌ర్గంలో మార్పులు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డానికి అని చెబుతున్నా...అస‌లు కార‌ణం వేరే అని వైసీపీ నేత‌లే చెబుతున్నారు. రెండో విడత‌లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించినా రాని వాళ్లు, మంత్రి ప‌ద‌వి పోయిన వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా వున్నార‌ని కోటంరెడ్డి, ఆనం, సుచ‌రిత వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ ఆందోళ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు జారిపోకుండా మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చ‌నేది వైసీపీ పెద్ద‌ల వ్యూహంగా తెలుస్తోంది. మంత్రులుగా ఎవ‌రున్నా, నిర్ణయాలు తీసుకునేది త‌న కోట‌రీయేన‌ని, మంత్రి ప‌ద‌వులు పారేసి..ఓ బుగ్గ కారు ప‌డేస్తే అసంతృప్తి చ‌ల్లారుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లో ప‌డేస్తున్న కొంద‌రు మంత్రుల‌ని త‌ప్పించ వ‌చ్చ‌ని, వీరి స్థానంలో మ‌రికొంద‌రు కొత్త వారిని తీసుకోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రోవైపు టిడిపిని ఎవ‌రు ఎక్కువ బూతులు తిడితే వారికి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం వైసీపీ స‌ర్కిళ్ల‌లో న‌డుస్తోంది. దీని ఫ‌లిత‌మే కొడాలి నాని బూతుల డోస్ పెర‌గ‌డ‌మ‌ని అంటున్నారు. గ‌త‌సారి కూడా చంద్ర‌బాబు ఇంటిపై దాడి చేసి, బూతులు తిట్టిన జోగి ర‌మేష్‌కి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇలాగే తాము బూతులు మాట్లాడితే మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోవ‌చ్చ‌ని బ‌రితెగించి మ‌రీ ప్ర‌తిప‌క్ష‌నేత‌పైనే బూతులు పేలుతున్నార‌ని వైసీపీలో టాక్ న‌డుస్తోంది.

వైసీపీ ప్ర‌భుత్వంలో రెడ్ల‌కి త‌ప్పించి ఇత‌రుల‌కు ప్రాధాన్య‌త లేద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌లు బ‌ల‌ప‌డిపోయాయి. వైసీపీలో కూడా ఇత‌ర సామాజిక‌వ‌ర్గ నేత‌లు త‌మ పార్టీలో రెడ్ల‌కి త‌ప్పించి ఇత‌రుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌ర‌ని ఫిక్స‌యిపోయారు. ఒక వేళ ఇచ్చినా పెత్త‌నం మాత్రం రెడ్ల‌దేన‌ని చాలా మంది ఆఫ్ ది రికార్డు మీడియా మిత్రుల ద‌గ్గ‌ర వాపోతున్నారు. ఇటువంటి స‌మ‌యంలో  సీఎం జగన్ రెడ్డి త‌న‌పై సామాజిక‌వ‌ర్గ అన్యాయం అప‌ప్ర‌ధ‌ని తొల‌గించుకునేందుకు ఎమ్మెల్సీ స్థానాల‌ని ఓ అవ‌కాశంగా వినియోగించుకోవాల‌నుకున్నారు. బీసీలు, ఎస్సీలు ఈ స్థానాలు ప్ర‌క‌టించి మైలేజ్ కొట్టేద్దామ‌ని చాలా ప్లాన్ చేసుకున్నారు. రెండు రోజుల నుంచి జాబితా విడుద‌ల‌పై బ్రేకింగ్స్ ఇస్తూ, భారీ ప్ర‌చార ప్ర‌ణాళిక సిద్ధం చేశారు.  ఉద‌య‌మే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా స‌మావేశం పెట్టి ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎంపిక చేసిన అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు ఎమ్మెల్సీలుగా చంద్రబాబు 37 శాతం అవకాశం ఇస్తే.. వైసీపీ 68 శాతం అవకాశం ఇచ్చామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించారు. ఎమ్మెల్సీలకు ఇచ్చిన సామాజిక‌వ‌ర్గాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే విధంగా ప్ర‌చారం కోసం భారీ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఆయా సంఘాల సంబ‌రాలు, స‌న్మానాలు ప్లాన్ చేసుకున్నారు. ఇంత‌లోనే గ‌న్న‌వ‌రంలో టిడిపి కార్యాల‌యంపై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ దా-డి-కి దిగారు. వాహ‌నాలు త‌గ‌ల‌బెట్టారు. రాష్ట్ర ప్రజలంతా ఎమ్మెల్సీల ఎంపిక‌లో సామాజిక న్యాయం గురించి మాట్లాడుకుంటార‌ని ఆశించిన సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి గ‌న్న‌వ‌రం ఇన్సిడెంటుతో షాక్ కొట్టిన‌ట్ట‌య్యింది. అంద‌రి దృష్టి పూర్తిగా గ‌న్న‌వ‌రం ఘ‌ట‌న‌పైకి మ‌ళ్ల‌డంతో త‌మ ఎమ్మెల్సీ ప్ర‌చారం మ‌రుగున‌ప‌డింద‌ని తాడేప‌ల్లి పెద్ద‌లు వంశీపై ఆగ్ర‌హంగా ఉన్నార‌ని స‌మాచారం. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నేడో, రేపో వంశీని పిలిపించి సీఎం జ‌గ‌న్ రెడ్డి వ‌ద్ద‌కు తీసుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని వైసీపీలో టాక్ న‌డుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read