Sidebar

17
Mon, Mar

సమర్ధవంతమైన అధికారిగా, డీజీపీగా సేవలు అందించి రిటైర్డ్ అయిన నండూరి సాంబశివరావుని, ముఖ్యమంత్రి చంద్రబాబు వదిలిపెట్టటం లేదు... రిటైర్డ్ అయినా సరే, ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం అని భావించి, ఆయనకు కొత్త పోస్ట్ ఇచ్చారు... విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా నండూరి సాంబశివరావ నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్ర డీజీపీగా ఆయన పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో డేరింగ్ పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, ఉత్తమ విలువలు, మానవతావాదికావడంతో ఆయనకు పోలీసులే కాకుండా ఇతర డిపార్టుమెంట్లలో పనిచేసే అధికారులు కూడా ఈనాకు అభిమానులుగా మారిపోయారు...

sambasivarao 09012018 2

సాంబశివరావుకి, విశాఖకు ఎక్కువ అనుబంధం ఉంది. గతంలో ఇక్కడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. విశాఖలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేసి పోలీసులు ప్రజల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించారు. అనంతరం ఆయన రాష్ట్ర ఆర్టీసీ ఎండిగా కూడా బాధ్యతలు చేపట్టి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేసారు. తరువాత ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించి, ఒక బాధ్యత గల పోలీస్ అధికారిగా రాష్ట్ర ప్రజలకి విశేష సేవలందించి ప్రభుత్వంచే మన్ననలు పొందారు. పదవీ విరమణ అనంతంర ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పడైనా తన సేవలను స్వీకరించవచ్చని చెప్పారు.

sambasivarao 09012018 3

రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే ఎలాంటి సేవలు చేసేందుకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లు తెలియజేసారు. గతంలో విశాఖతో ఏంటో అనుబంధం ఉన్న ఆయన తిరిగి విశాఖకు రావడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను గంగవరం పోర్టుకు ఎంతో అవసరమని పేర్కొంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు, ఆయన శ్రేయోభిలాషలు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే చంద్రబాబు సాంబశివరావుని, సమాచార హక్కు కమీషనర్ గా నియమిస్తారు అనే వార్తలు వచ్చాయి... దానికి ప్రతిపక్ష నేత జగన్ కూడా వచ్చి, ప్రభుత్వంతో చర్చించాలి... అయితే జగన్ మాత్రం ఇప్పటికి రెండు సార్లు ఆ మీటింగ్ కి రాలేదు... ఈ నేపద్యలో అది తేలే వ్యవహారంలాగా లేదు అని భావించి, చంద్రబాబు, ఈయనను గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా నియమించారు.

అమరావతికి రుణం ఇవ్వాద్దు అంటూ తాజాగా కెనడాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ, ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసిన సంగతి ఇవాళ వార్తల్లో చూసి ఆశ్చర్యపోయారు ప్రజలు... ఒక పక్క ఇక్కడ రైతుల పేరిట ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాసిన వారు, ఇప్పుడు ఏకంగా విదేశాల నుంచి మన అమరావతి పరువు తీస్తున్నారు... అయితే ఇప్పుడు ఈ కెనడా ఎన్జీవో సంస్థ వెనుక, అందరూ అనుకుంటున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింక్ బయటపడింది... నడా ఎన్జీవో సంస్థ వెనుక ఎవరు ఉన్నది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనందబాబు బయట పెట్టారు...

brother anil 09012018 2

కెనడా ఎన్జీవో సంస్థ వెనుక ఉంది కధ అంతా నడిపించింది, జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ అని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు... మతం పేరుతో రాజకీయాలు లు మానుకోవాలని బ్రదర్ అనిల్ కుమార్, జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు... రాష్ట్ర అభివృద్ధి ని సైందవుడిలా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని అన్నారు. రైతుల స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇస్తే, స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ప్రపంచ రాజధాని నిర్మాణం చేపట్టడం జరిగితే, అమరావతి రాజధాని లో నిర్మాణం ఇష్టంలేని జగన్మోహన్ రెడ్డి ఇన్ని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో పర్యఠించిన బిల్ గేట్స్, రాష్ట్రపతి రామ్ నాద్ కొవింద్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి , టెక్నాలజీ ని చూసి అభినందించారని, జగన్ మాత్రం మారటం లేదు అని అన్నారు..

brother anil 09012018 3

ఉదయం నుంచి ఈ వార్తా వింటున్న వారికి, అమరావతి నిర్మాణం ఆపటానికి కెనడాలో ఉన్న సంస్థ అడ్డుకోవటం ఏంటో అర్ధం కాలేదు... కెనడాకి, అమరావతికి ఎక్కడా లింక్ కుదరలేదు... జగన్ పార్టీ పై అనుమానం ఉన్నా, వివరాలు లేక ఎవరూ మాట్లాలేదు... జగన్ బావ బ్రదర్ అనిల్, తనకు ఉన్న మతపరమైన పరిచయాలతో, అక్కడ నుంచి ప్రపంచ బ్యాంకు కు ఫిర్యాదు చేసినట్టు, ప్రభుత్వంలోని పెద్దలు అంచనాకి వచ్చారు... పూర్తి వివరాలు సేకరించి, ప్రజల ముందు ఉంచటానికి రెడీ అయ్యారు... కెనడా నుంచి అయితే, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల మీద ఒత్తిడి తేవచ్చు అని జగన్ భావించి, బ్రదర్ అనిల్ పరిచయాలు వాడి ఉంటారు అని అంటున్నారు..

సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన పనుల ప్రగతిని పరిశీలించారు. అగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎగువ కాపర్‌ డ్యామ్‌ జట్‌ గ్రౌటింగ్‌ పనులకు పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించిన ఆగ్రిటెక్ కూలింగ్ ప్లాంట్ తో పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో వేగం పంజకోనుంది. ఇప్పటి వరకు రోజుకు 3 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ చేస్తుండగా ఇక నుండి 5 వేల క్యూబిక్ మీటర్లకు పెరగనుంది. ప్రధాన కాంట్రాకు సంస్థ రూ.25 కోట్లతో దుబాయి కేటీఐ కంపెనీకి చెందిన ఆగ్రిటెక్ కూలింగ్ ప్లాంట్ విడి భాగాలను తీసుకొచ్చి ప్రాజెక్టు క్షేత్రంలో బిగించారు.

polavaram 23122017 2

ఇప్పటి వరకు ఐస్ ముక్కలు ఉపయోగించి కాంక్రీట్ను 12 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తయారు చేసేవారు. దీనిని టెలీబెల్ట్ ద్వారా స్పిల్ వేకు 300 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి పంపేవారు. ఆ తర్వాత ఆ టెలీబెల్ట్ ను ఆక్కడి నుంచి తొలగించి. 300 మీటర్ల దూరం నుంచి మళ్లీ స్పీల్ వే వరకు అమర్చి కాంక్రీటును పోసేవారు. టెలీబెల్ట్ ను తొలగించి వేరే చోట బిగించేందుకు రెండు గంటల సమయం పట్టేది. పైగా ఈ కాంక్రీటును అర మీటర మందాన మాత్రమే పోసేవారు. ఆది చల్లారాక మళ్లీ 72 గంటలు పూర్తయ్యాక మాత్రమే దాని పై మరో ఆరమీటరు మందాన కాంక్రీటు వేసేందుకు ఇంతవరకు అవకాశం ఉంది.

polavaram 23122017 3

ఇప్పడు ఆగ్రిటెక్ కూలింగ్ ప్లాంట్ గంటకు 600 టన్నుల మెటల్ ను కూలింగ్ చేసి, కాంక్రీట్ తయారు చేసే రెండు బ్లాచింగ్ షాంట్లలోకి 300 టన్నుల చొప్పన నేరుగా సరఫరా చేస్తుంది. దీని ద్వారా తయారైన కాంక్రీట్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఆందుచేత ఒకేసారి మీటరు నుంచి మీటరున్నర మందంతో కాంక్రీట్ వేయవచ్చు. టెలీబెల్ట్ ను తరచూ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో రెండు టెలీబెల్ట్ లు ఉంటాయి. కొత్త అగ్రిగేటర్‌ కూలింగ్‌ ప్లాంట్‌ వల్ల రోజుకు 5000 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయడానికి వీలవుతుంది. ఈ ప్లాంట్‌ వల్ల స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పుంజుకుంటాయి.

రాష్ట్రంలో పి.ఎం.ఎ.వై, ఎన్.టి.ఆర్. నగర పథకం కింద అత్యాధునిక షీర్ వాల్ టెక్నాలజీతో పట్టణ పేదలకు గృహాలు నిర్మిస్తున్నారు.... ఈ షీర్ వాల్ టెక్నాలజీ పెద్ద బిల్డర్ లు కూడా ఇప్పుడు వాడటం లేదు... అలాంటిది పేదల కోసం, ప్రభుత్వం ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇళ్ళు కడుతుంది. రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లో గృహ నిర్మాణాల కోసం తొమ్మిది లక్షలు దరఖాస్తులు వస్తే, వీటిలో 6.41 లక్షలు గృహాలు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న పట్టణ గృహ నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైంది. రాష్ట్రంలో పట్టణ పేదల ఆవాసాలను బట్టి 300, 365, 430, చదరపు అడుగుల విస్తీర్ణాల్లో మూడు విభాగాలుగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.

housing 09012018 2

షీర్‌ వాల్‌ టెక్నాలజీ.. సంప్రదాయ నిర్మాణ పద్ధ్దతులకు ఇది పూర్తి భిన్నం. నాణ్యతతో పాటు అతి తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. షీర్‌ వాల్‌ టెక్నాలజీలో ఇటుకలు వాడాల్సిన అవసరం లేదు. గోడలు, శ్లాబ్‌ అంతా రోలర్‌ కాంపాక్టెడ్‌ కాంక్రీట్‌(ఆర్‌సీసీ)తోనే వేస్తారు. గోడలు, శ్లాబ్‌ల విస్తీర్ణం, డిజైన్‌ను బట్టి ముందు అల్యూమినియం ప్యానెళ్లు ఏర్పాటు చేస్తారు. ఆ ప్యానెళ్లలోనే విద్యుత, ఇతర పైపులు అమర్చుతారు. అనంతరం ఆర్‌సీసీ వేస్తారు.

housing 09012018 3

మూడు రోజుల తరువాత ప్యానెళ్లు తొలగించి గట్టిపడిన గోడలకు ప్లాస్టింగ్‌ పనులూ చేసుకోవచ్చు. దీంతో సాధారణ నిర్మాణ విధానంతో పోలిస్తే అతి తక్కువ సమయంలో పనులు పూర్తవుతాయి. లబ్ధిదారులకు ఎక్కడ, ఏ ఇళ్లు కేటాయిస్తున్నారో ముందే వెల్లడిస్తున్నారు... దీంతో, వారు కూడా తమ ఇళ్ల నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. పేదలకు ధీమా, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తుంది. ఎల్అండ్టీ, ఎన్సీసీ, షాపూర్జీ పల్లోంజి, కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తదితర ప్రఖ్యాత సంస్థలకు ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read