కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరిన తరుణంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో తెదేపా ఎంపీల భేటీ ముగిసింది. అనంతరం ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ తెదేపా ఎంపీల సమక్షంలోనే మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. కడప ఉక్కు కర్మాగారం విషయంపై ఎంపీలు తనతో చర్చించారని, సుప్రీంలో దాఖలైన పిల్‌ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ అఫిడవిట్‌ను ఆయన చదివి వినిపించారు.

steel 27062018 2

సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం పై కేంద్రమంత్రితో ఎంపీలు వాగ్వాదానికి దిగారు. ఒక పక్క టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసిందని చెప్తూ, మరి సుప్రీంకోర్టులో ఎందుకు, కుదరదు అని చెప్పారు అంటూ, కేంద్ర మంత్రిని నిలదీశారు. ఈ సందర్భంగా ఎంపీలు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయనను డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా కాల పరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికను విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. వెనువెంటనే ఉన్నతాధికారులతో సమావేశమైన బీరేంద్ర సింగ్‌ ఉక్కు శాఖ కార్యదర్శి, అధికారులతో సమావేశమయ్యారు. అయితే, మరో సారి ఆయన నుంచి, ఎలాంటి కాల పరిమితితో కూడిన స్పష్టమైన హామీ రాలేదు.

steel 27062018 3

కేంద్ర ఉక్కు శాఖమంత్రి బీరేంద్ర సింగ్‌ చేసిన ప్రకటనపై తెదేపా ఎంపీలు అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం కోరిన సమాచారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నా స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాల వ్యవధితో కూడిన హామీ ఇవ్వలేదని, దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పినా మంత్రి పట్టించుకోలేదన్నారు. రాష్ట్రమంతా ఆందోళనలు చేస్తుంటే.. కచ్చితంగా ఎప్పటి నుంచి ఉక్కు పరిశ్రమ పనులు మొదలు పెడతారో, ఎన్ని రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తారో అని మంత్రిని పదేపదే కోరినా స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తొలుత సమావేశం అనంతరం మళ్లీ మంత్రి ఛాంబర్‌లోకి వెళ్లి కలిశామని, పరిశ్రమ ఏర్పాటుపై కచ్చితమైన సమయం చెప్పాలని, మెకాన్‌ నుంచి ఎప్పుడు నివేదిక తెప్పిస్తారో స్పష్టంచేయాలని అడిగినా ఆయన నుంచి స్పందన రాలేదన్నారు. ఓ రాజ్యసభ సభ్యుడు ఆమరణ నిరాహార దీక్షచేస్తున్న సమయంలో స్పందించాల్సిన కేంద్రం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్రం నుంచి తాము ఎంతో ఆశించి దిల్లీకి వచ్చామని.. కాలయాపన చేయడం సరికాదని అన్నారు.

మేధావి అయిన పవన్ కళ్యాణ్ గారు, మరి కొందరు మేధావులతో కలిసి, ఈ రోజు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పై చర్చించారు. చాలా మంచి పని చేసారు, ఎన్నో పరిష్కారాలతో ముందుకు వస్తారు అని అందరూ అనుకున్నారు. ఆ మేధావులు ఏమన్నారో కాని, ఈ మేధావి మాత్రం మేము చర్చింది ఇది అని ట్విట్టర్ లో వేసిన ట్వీట్లు మాత్రం, ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడ ఉన్నది నిజంగా మేదావులేనా ? లేక వారు చెప్పిన దాన్ని వక్రీకరించి, ఈ మేధావి ట్వీట్ చేసాడా అనే అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా, ప్రతి ట్వీట్లో ఉత్తరాంధ్రని బయట నుంచి వచ్చిన వ్యక్తులు తోక్కేస్తున్నారు అని అక్కడ ప్రజలను రెచ్చగొడుతున్నాడు పవన్. అంతే కాదు, మాటి మాటికి, తెలంగాణా లాగా, ఉత్తరాంధ్ర కూడా ప్రత్యెక రాష్ట్రం కొరుకుంటుంది అని రెచ్చగొడుతున్నాడు..

pk 27062018 2

ఆంధ్ర ప్రదేశ్‌లో భాగమైన ఉత్తరాంధ్ర మరో తెలంగాణ కావడానికి మరెంతో దూరం లేదు అంటూ, తల తిక్క ట్వీట్ వేసి, ఇప్పటికే మోడీ చేసిన నయవంచనతో, నాశనం అయిన మన రాష్ట్రాన్ని, ఇక్కడ ప్రజలను మరింతగా ఆందోళన పడేలా, ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ‘ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ ఉద్యమం మరింత ప్రబలే అవకాశం ఉందని కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రపై ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే.. మరో తెలంగాణ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు’ అంటూ ట్వీట్ చేశాడు పవన్. ‘తెలంగాణ ఉద్యమం కూడా ఇలాగే ప్రారంభమైంది. ఏపీ నేతల అధికారంలో తీవ్ర అణచివేత, క్రూరత్వం భరించి వారు రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశారు. అదో మహత్తర ఉద్యమంగా రూపుదాల్చింది. చివరికి తెలంగాణ ఏర్పడింది. మరికొద్ది సంవత్సరాలు లేదంటే అంతకు ముందే ఉత్తరాంధ్ర కూడా ప్రత్యేక రాష్ట్ర అవుతుంది’ అని మరో ట్వీట్ చేశారు. ఇలా లేని ఉద్యమాన్ని, ప్రజల్లో లేని ఆలోచనలను రేకెత్తించి, రెచ్చగొడుతున్నాడు...

pk 27062018 3

సరే, ఇదంతా బాగానే ఉంది.. ఉత్తరాంధ్ర బాగుపడాలి అంటే, మనకు విభజన హామీల్లో ఇచ్చిన రెండు అంశాలు ఇప్పటికీ కేంద్రం తేల్చలేదు. కొన్ని దశాబ్దాలుగా రైల్వే జోన్ పై విశాఖలో ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి డబ్బులు కూడా ఏమి పెట్టనవసరం లేదు. ఒక నిర్ణయంతో మోడీ, రైల్వే జోన్ ఇవ్వచ్చు. కాని, మనకు ఆదాయం అంతా మన వైజాగ్ కు వస్తుంది కాబాట్టి, మోడీ ఇవ్వటం లేదు. దీని పై ఉత్తరాంధ్ర ప్రజలు, ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. అలాగే, వెనుకబడిన జిల్లాలు అయిన, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, నిధులు ఇస్తాం అని విభజన చట్టంలో పెట్టారు. మొన్న 350కోట్లు మన రాష్ట్ర ఎకౌంటు లో వేసి, చంద్రబాబు ఎదురు తిరిగాడు అని, ఆ 350కోట్లు వెనక్కు తీసుకున్నారు. మరి, ఈ రెండు అంశాలు అక్కడ మేధావులకు కనిపించలేదా ? లేక అక్కడ చర్చించినా, ఈ మేధావికి ట్వీట్ చేసి, మోడీ పై వ్యతిరేకంగా, ప్రజలకు చెప్పే ధైర్యం లేదా ? ఎందుకు మోడీని ప్రశ్నించకుండా, భయపడుతూ ఈ నాటకాలు ఆడుతున్నాడు ?

పొలానికి వెళ్లి పని చేసే రైతులకు, ఎప్పుడూ ఇబ్బందే... పాము కాటుకు గురవుతారో తెలియదు, కరెంటు షాక్ కొడుతుందో తెలియదు, పిడుగులు పడతాయో తెలియదు. ఇలా ప్రతి నిమషం రిస్క్ తో కూడిన పని చేస్తూ, ఆ మట్టిలోనే కష్టపడుతూ, కష్టమైన, నష్టమైన భరిస్తూ, మనకు పంట పండిస్తాడు రైతన్న. అయితే, ఇప్పటికే అసంఘటిత రంగంలోని కార్మికులకు చంద్రన్న బీమా పథకం అమలవుతోంది. ఏ రకమైన భీమా రైతులకు లేదు. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో, రాష్ట్రంలో రైతుకు కూడా బీమా భరోసా దక్కనుంది. దేశంలో పంటలకు బీమా కల్పనే ఇంకా అంతంతమాత్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రైతులకు వ్యక్తిగతంగా బీమా భద్రత కల్పించనున్నారు. పింఛన్లతోపాటుగా అత్యంత సంతృప్తినిస్తున్న పథకంగా చంద్రన్న బీమా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అదే తరహాలో రైతు కుటుంబాలకు కూడా రక్షణ ఉండేలా బీమా సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

farmers 27062018 2

ఏరువాక సందర్భంగా గురువారం దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. 18 నుంచి 70 ఏళ్లు మధ్యనున్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వారి వార్షిక ఆదాయం రూ.2.5లక్షలు మించి ఉండకూడదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 50 లక్షల మంది రైతులకు బీమా దన్ను లభిస్తుంది. చంద్రన్న రైతు బీమా పథకం కోసం కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికంగా భరిస్తుంది. మొత్తం ప్రీమియంలో రూ.21.91కోట్లు రాష్ట్ర ప్రభుత్వం.. రూ.18.70కోట్లు కేంద్రం చెల్లిస్తుంది. ఈ పథకానికి చంద్రన్న రైతు బీమా అనే పేరు పెట్టాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. పాలసీదారు చనిపోతే వారి కుటుంబానికి రూ.30వేల నుంచి రూ.5లక్షలు పరిహారం ఇస్తారు. 18-50 ఏళ్లు వయసున్న రైతు సహజ మరణం పొందితే రూ.2లక్షలు ఇస్తారు. 50-60 ఏళ్లు వారైతే రూ.30వేల పరిహారం ఇస్తారు. 18-70 ఏళ్లు మధ్యవయసులోని వారు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాలకూ రూ.5లక్షల పరిహారం అందిస్తారు.

farmers 27062018 3

శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5లక్షలు చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యమైతే రూ.2.5లక్షలు ఇస్తారు. ఆయా కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలుంటే వారికి ఏడాదికి రూ.1200లు ఉపకార వేతనం ఇస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ చదివే పిల్లలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్రంలో చంద్రన్న రైతు బీమా ద్వారా ప్రయోజనం పొందనున్న 10.75లక్షల మంది రైతుల్లో ఏ వయసు వారు ఎంతమంది ఉన్నారన్న లెక్కలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే అత్యధిక రైతుల ప్రజాసాధికార సర్వేలో ఉన్నారు. సర్వేలో నమోదు కానివారికీ మరో అవకాశం ఇస్తారు. ఈ పథకం అమలులో కార్మికశాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. చంద్రన్న బీమా తరహాలోనే ఈ పథకంలో కూడా మరణించినవారి కుటుంబానికి 10 రోజుల్లోనే పరిహారం అందేలా నిబంధనలను రూపొందించారు. ఇప్పటికే సెర్ప్‌ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు చంద్రన్న బీమాను బాగా అమలుచేస్తుండడంతో వారికే దీని అమలును కూడా అప్పగించాలని నిర్ణయించారు.

 

 

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ గత వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని సీఎం రమేష్‌ను కేంద్రమంత్రి కోరారు. ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనలో ఉంది అంటూ పాత పాటే పాడారు. అయితే కాల పరిమితితో కూడిన హామీ ఇవ్వాలని రమేష్ కోరారు. దీని పై చర్చలు జరుగుతున్నాయి అంటూ పాత సమాధానమే చెప్పారు కేంద్ర మంత్రి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం వారం రోజులుగా దీక్ష చేయడంతో సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించింది. తక్షణ వైద్యం అందించకపోతే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్‌ను టీడీపీ ఎంపీలు కలిసి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ramesh 27062018 2

విభజన చట్టంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని వివరించారు. కడపలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేస్తున్న దీక్ష అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. 2014లో మెకాన్ తన నివేదికలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని పేర్కొంది. తర్వాత అక్కడ పరిస్థితి మారింది. కడపలో కొత్త గనులు ఉన్నట్లు కనిపెట్టారు. కాబట్టి అక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే మెకాన్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమేనంటూ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఇప్పుడు కడప ఉక్కు... ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో రాష్ట్ర ప్రజల్లో సెంట్‌మెంట్‌గా మారిందని, కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎంపీలు బీరేంద్ర సింగ్‌ను కోరారు.

ramesh 27062018 3

మరో పక్క, మంత్రి బీరేంద్రర్‌సింగ్ మీడియాతో మాట్లాడారు.. కడప, ఖమ్మంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రర్‌సింగ్ స్పష్టం చేశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై టీడీపీ ఎంపీలు తనను కలిసి చర్చించారని కేంద్రమంత్రి అన్నారు. అలాగే ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవి దీక్ష విరమించాలని ఫోన్లు కోరినట్లు తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీపై టాస్క్‌ఫోర్స్ రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలుంటాయని చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా సహకారం అందించాలన్నారు. ఈ విషయంపై టీడీపీ ఎంపీలు కూడా సంతృప్తి చెందారని వెల్లడించారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేటు భూమి ఎంత అందుబాటులో ఉందన్నదాని పై వివరాలు కోరినట్లు చెప్పారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నామని బీరేంద్రసింగ్ చెప్పుకొచ్చారు.

Advertisements

Latest Articles

Most Read