నంద్యాల బై ఎలక్షన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని జగన్‌కు..తన పార్టీ సీనియర్ నేతలు, ఆంతరంగికులు ఇచ్చిన నివేదిక చూసి కళ్లుబైర్లు కమ్మాయట! నంద్యాలలో ఘోర పరాభవానికి జగన్ చేసిన ఏడు తప్పులే కారణమని వారు విశ్లేషించారట! వాస్తవంలో గెలిస్తే తన ఖాతాలో వేసుకుందామనుకున్న జగన్...దారుణ పరాభవం ఎదురు కావడంతో... అధికార పార్టీ దుర్వినియోగం, ప్రలోభాలు, బెదిరింపులు అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారట! ఇది కావాలనే వ్యూహాత్మక చేసిందని తెలుస్తోంది.
ఆ ఏడు తప్పులు ఏంటంటే...!
1) చనిపోయిన శాసనసభ్యుడి స్థానం ఏకగ్రీవం చేయడం సంప్రదాయం..అయితే నంద్యాలలో భూమాపై కక్షతో దీనికి జగన్ ఒప్పుకోలేదు ఇది మొదటి తప్పు
2) ఓడిపోతామని తెలిసీ పోటీకి తన వ్యూహాన్ని, బలగాలను వినియోగించడం మరో తప్పు
3) శిల్పా మోహన్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో తీవ్రవ్యతిరేకత ఉందని తెలిసి..వారితో వచ్చే ఎన్నికల టికెట్లు, ఇప్పటికి పార్టీలో చేర్చుకోవడానికి వందల కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడం మరో తప్పు.
4) అన్నా చెల్లెళ్లయిన బ్రహ్మానందరెడ్డికి..అఖిలప్రియకు...అలాగే దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆత్మలాంటి ఏవీ సుబ్బారెడ్డి...అఖిలప్రియకు గొడవలు పెట్టేందుకు తన మీడియాలో కథనాలు పుంఖానుపుంఖానులుగా రాయించడంతో వారిపై సానుభూతి మరింత పెరిగిపోయింది. అలాగే అఖిలప్రియ చుడీదార్ పై రోజా వ్యాఖ్యలు దారుణంగా దెబ్బతీశాయి..ఇదే అతి పెద్ద తప్పుగా నిలిచింది.
5) ముఖ్యమంత్రి పాంట్రీకార్‌ను పట్టుకుని డబ్బుతరలించే వాహనం అని చెప్పి తన మీడియాలో హడావిడి చేసి అభాసుపాలవడం వ్యూహాత్మక తప్పిదమని ఆంతరంగికులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు.
6) మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులపై వ్యాఖ్యలు చేశాడని, ఒక ఉద్యమం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇది కూడా ఎన్నికల సమయంలో చేసిన మరో వ్యూహాత్మక తప్పిదం అని, ఎలక్షన్ మూడ్ డైవర్ట్ అయ్యిందట!
7) వైసీపీ అభ్యర్థి తప్పక గెలుస్తాడని..బెట్టింగ్‌లు వేయించడం..సోషల్ మీడియాలో టీడీపీపై విషప్రచారం కూడా బూమరాంగ్ అయ్యాయని మరో తప్పుగా తేల్చారు. ఈ ప్రచారంతో వైసీపీ అభిమానులు పిచ్చి అభిమానంతో కొన్ని వందల కోట్లు బెట్టింగ్‌లో నష్టపోయారని తెలుస్తోంది.
ఇవి కాకుండా రోజా నోటి దురుసు, జగన్ మిస్‌ఫైర్, శిల్పా సోదరులపై వ్యతిరేకత, ఎన్నికల ఖర్చుకోసం శిల్పా సోదరుల దగ్గర తీసుకున్న జగన్, అతని గ్యాంగ్ వద్దే ఉంచుకుని ఖర్చు చేశారట! ఇవన్నీ కూడా వైసీపీ దారుణ పరాజయానికి కారణాలుగా నిలిచాయని ఆ నివేదికలో పేర్కొన్నారట.