కేంద్రాన్ని అడిగి మరీ తాము చేతకానివాళ్లం అని అనిపించుకున్నారు వైసీపీ నేతలు. పోలవరాన్ని 2020 అని ఒకసారి, 2021లో మరోసారి, 2022లో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ మంత్రులు కేంద్రం సమాధానంతో ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతుందా అని..రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. దీనిపై కేంద్రం అవునంటూ సమాధానం ఇవ్వడంతో వైసీపీ ఎంపీలు ఖంగుతిన్నారు. టిడిపి హయాంలో 72 శాతం పనులు పూర్తి అయిన పోలవరం వైసీపీ సర్కారు రాకతో నిలిచిపోయాయి. రివర్స్ టెండరింగ్తో ఏడాది, వరదలతో మరో ఏడాది ఆలస్యమైన పనులు కనీసం 3 శాతం కూడా కాలేదు. దీంతో 2024కి కూడా ప్రాజెక్టు పూర్తికావడం అసాధ్యమని కేంద్రం తేల్చి చెప్పేసింది.
news
ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో, ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎట్టకేలకు సుప్రీం కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ-త్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అనంతబాబు డీఫాల్ట్ బెయిల్ పిటీషన్ పై, ఈ రోజు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. వదనలు విన్న అనంతరం సుప్రీం కోర్ట్ బెయిల్ ఇచ్చింది. ఈ ఏడాది మే 23న పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేసారు. అప్పటి నుంచి అతను రాజమండ్రి జైలులో ఉన్నారు. కింద కోర్ట్ బెయిల్ ని నాలుగు సార్లు తిరస్కరించింది. ఆ తరువాత హైకోర్టు కూడా తిరస్కరించింది. దీని పైన ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఎట్టకేలకు సుప్రీంలో బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో మొదట అనంతబాబు పై కేసు పెట్టలేదు. ఆందోళనలు తరువాతే కేసు పెట్టారు. అయితే పోలీసులు కూడా ఈ కేసులో సరిగ్గా చార్జ్ షీట్ వేయలేదు అనే విమర్శలు వచ్చాయి. దాదపుగా ఆరు నెలలు అనంతబాబు జైల్లో ఉన్నారు. అయితే ఈ తీర్పు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చార్జిషీట్ పదే పదే ఉపసంహరించుకోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏపి ప్రభుత్వం ఖంగుతింది. అనంతబాబుని రక్షిస్తున్నారు అంటూ, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, సుప్రీం వ్యాఖ్యలతో నిజం అయ్యాయి...
జగన్ పత్రికి సాక్షి సర్క్యులేషన్ పెంచటానికి, ఎంతకు తెగించారో చూడండి...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ``మన ప్లేటులో మనమే బిర్యానీ కావాల్సినంత తిందాం`` అన్నారు. దీనర్థం ఏంటో ఇప్పుడు స్పష్టం అయ్యింది. రాష్ట్రంలో రోడ్లపై పడిన గుంతలు కప్పడానికి నిధుల్లేవు. ఆస్పత్రిలో సూది,దూదికి డబ్బుల్లేవు. జగన్ రెడ్డి సాక్షికి కట్టబెట్టడానికి మాత్రం వందల కోట్లు జనం సొమ్ము తేరగా దొరుకుతోంది. ఇప్పటివరకూ ఇప్పటికే 2.71 లక్షల మంది వలంటీర్లకూ, సచివాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సాక్షి పత్రికని బలవంతంగా వేస్తూ వందల కోట్లు కొల్లగొట్టారు. ఇప్పుడు 1.5 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు సాక్షిని అంటగట్టి మరో 100 కోట్లు జనం సొమ్ము జగన్ సాక్షికి మింగేస్తోంది. ఎక్కువ సర్కులేషన్ గల పత్రిక వేయించుకోవాలని ఆదేశాలున్నాయి. అలా అయితే అంతా ఈనాడు వేయించుకోవాలి. కానీ అందరూ సాక్షి వేయించుకుని ఆ బిల్లు పెడితేనే రూ.200 మంజూరు చేస్తారు. ప్రకటనలో రూపంలో తన అక్రమాస్తుల పుత్రిక సాక్షికి వందల కోట్లు దోచిపెట్టిన జగన్ ..ఇప్పుడు సర్క్యులేషన్ కోసం మరో 200 కోట్లు సాక్షికి కట్టబెట్టారు.
రుషికొండను చూసి కన్నీళ్లు పెట్టుకున్న వాటర్ మ్యాన్ అఫ్ ఇండియా
రుషికొండపై విధ్వంసం చూశాక కన్నీళ్లు వస్తున్నాయని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రీయ జల బిరాదరీ చైర్మన్ రాజేంద్ర సింగ్ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణతో కలిసి రుషికొండని పరిశీలించారు. సముద్రం ఒడ్డున రక్షణగా వున్న రుషికొండని జగన్ రెడ్డి సర్కారు ధ్వంసం చేయడం క్షమించరాని నేరం అన్నారు. న్యాయస్థానం పరిధిలో ఈ అంశం ఉందని, న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తునన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నదులు కూడా పూర్తిగా కలుషితం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.